ప్రిన్సెస్ డయానా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేల్స్ యువరాణి

ప్రిన్సెస్ డయానా
Международная Леонардо-премия 18 (cropped 2).jpg
1995 లో లియోనార్డ్ పురస్కారా వేడుకలలో డయానా
జననం
డయానా ఫ్రాన్సిస్ స్పెన్సర్

1 జూలై 1961
పార్క్ హౌస్, శాంద్రింఘం, ఇంగ్లాండ్
మరణం31 ఆగష్టు 1997
పారిస్
మరణ కారణంకారు ప్రమాదం
జాతీయతఇంగ్లాండ్
బిరుదువేల్స్ యువరాణి
పిల్లలుప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యర్రి
సంతకం
Lady Diana signature-vect.svg

డయానా (1961 - 1997), బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్ మొదటి భార్య. బ్రిటిష్ మహారాణి ఎలిజెబెత్ - II కోడలు. ఈవిడ ప్రిన్స్ విలియం (డ్యూక్ అఫ్ కేంబ్రిడ్జి), ప్రిన్స్ హ్యర్రి లకు తల్లి. ఈవిడను '''''డయానా : ప్రిన్సెస్ అఫ్ వేల్స్ అని పిలుస్తారు.[1]

బాల్యం

డయానా, బ్రిటిష్ లోని స్పెన్సర్ కుటుంబంకి చెందినా ఎడ్వర్డ్ జాన్ స్పెన్సర్, అతని మొదటి భార్య అయిన ఫ్రాన్సిస్ రూత్ రోచేల నాలుగోవ సంతానం. స్పెన్సర్ కుటుంబానికి, బ్రిటిష్ రాజకుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. డయానా నాయనమ్మ, అమ్మమ్మలు బ్రిటిష్ మహారాణి ఎలిజెబెత్ - 1 వద్ద సహచరులుగా పనిచేసారు.

డయానా, 1961 ఆగస్టు ౩౦ న శాంద్రింఘంలో గల సెయింట్ మేరీ మగ్దలేనే చర్చిలో బాప్తిసం తీసుకుంది. డయానాకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు.

డయానాకు ఏడు సంవత్సరాల వయసులో వారి తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. కొన్ని సంవత్సరాలు, ఆవిడ తన తల్లి దగ్గర పెరిగింది. అటుతరువాత, ఆమెను తన తండ్రి అధినంలో కొనసాగింది.

వివాహం

ప్రిన్స్ చార్లెస్ ను మొదటి సరిగా ఆవిడా 1977 నవంబరు 16 లో చూసింది. అప్పుడు ఆవిడా వయసు 16 సంవత్సరాలు. కొన్ని సంవత్సరాలు తరువాత ప్రిన్స్ చార్లెస్, నవంబరు 1980 వ సంవత్సరంలో తమ స్కాటిష్ భవనం నకు డయానాను తీసుకు వెళ్లి తన అమ్మమ్మకు, ఎలిజెబెత్ మహారాణికు, అతని తండ్రి ఫిలిప్పుకు ఆమెను పరిచయం చేసాడు. వారందరికి డయానా బాగా నచ్చింది.

1981 ఫిబ్రవరి 6 వ తేదిన ప్రిన్స్ చార్లెస్ తన ప్రేమను డయానాకు తెలియచేసాడు. డయానా అతని ప్రేమను అంగీకరించింది. 1981 ఫిబ్రవరి 24 న వారి నిశ్చితార్ధం జరిగింది.

వారి వివాహం 1981 జూలై 29 న లండన్ లోని సెయింట్ పాల్ కాతేద్రాల్ లో జరిగింది. వివాహం జరిగినప్పుడు డయానా వయసు 21 సంవత్సరాలు.[2]

వారిరువురికి ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హర్రీలు జన్మించారు.

మరణం

డయానా, 1997 ఆగస్టు 31 న పారిస్ లో ఒక కారు ప్రమాదంలో మరణించారు.[3] మరణించే సమయానికి ఆవిడా ప్రిన్స్ చార్లెస్ నుంచి విడాకులు పొందియున్నారు. ఆవిడా మరణం ప్రపంచానికి దిగ్బ్రాంతిని కలిగించింది. ఎంతోమంది ఆవిడా మరణ వార్తను విని కన్నీరు పెట్టుకున్నారు. బ్రిటిష్ రాజకుటుంబం గౌరవ మరియదలతో 1997 సెప్టెంబరు 6 న అల్త్రోప్ లో డయానా పర్థవ శరీరాన్ని పాతిపెట్టారు.

మూలాలు

  1. డయానా, వేల్స్ యువరాణి The House of Royal Family. Retrieved on 21 October 2017.
  2. ప్రిన్స్ చార్లెస్, డయానాల వివాహం Youtube. AngelDocs Published on October 16, 2012. Retrieved on October 21, 2017.
  3. 20 years after Princess Diana's death, a recall of facts and conspiracy theories The New Indian Express. Published online on 30 August 2017.