ప్రియతమా ప్రియతమా తరగని పరువమా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ప్రియతమా ప్రియతమా తరగని పరువమా 1992లో విడుదలైన తెలుగు చిత్రం పెద్దరికం చిత్రం లోని పాట. దీనిని భువనచంద్ర, వడ్డేపల్లి కృష్ణలు రచించగా రాజ్ కోటి సంగీతాన్నందించాడు. ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర గానం చేసారు. సినిమాలో ఈ పాటలో జగపతిబాబు, సుకన్య ప్రధాన పాత్రలుగా నటించారు.[1]

ప్రియతమా ప్రియతమా తరగని పరువమా
తరలి రా తరలి రా..
కన్నె గోదారిలా కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేర రావే..
ప్రియతమా ప్రియతమా తరగని విరహమా
కదలి రా కదలి రా
మాఘ మాసానివై మల్లె పూమాలవై
నిండు నా గుండెలో ఊయలూగ

నీ ఆశలన్ని నా శ్వాసలైనా ఎంత మోహమో
నీ ఊసులన్నీ నా బాసలైన ఎంత మౌనమో
ఎవరేమి అన్నా ఎదురీదనా...
సుడిగాలినైనా ఒడి చేరనా
నీడల్లే నీ వెంట నేనుంటా
నా ప్రేమ సామ్రాజ్యమా

పెదవుల్ని తడితే పుడుతుంది తేనె తీయ తీయగా
కౌగిట్లో పడితే కొడుతుంది వాన కమ్మ కమ్మగా
వెన్నెల్ల మంచం వేసేయ్యనా
ఏకాంత సేవ చేసేయనా
వెచ్చంగా చలి కాచుకోవాల నీ గుండె లోగిళ్ళలో

మూలాలు

[మార్చు]
  1. "Priyathama Priyathama Lyrics". www.raagabox.com. Retrieved 2020-09-18.