ప్రియదర్శిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రియదర్శిని
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తివెయిట్‌లిఫ్టర్‌ క్రీడాకారిణి

ప్రియదర్శిని తెలంగాణ రాష్ట్రానికి చెందిన వెయిట్‌లిఫ్టర్‌ క్రీడాకారిణి. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1][2]

జననం

[మార్చు]

ప్రియదర్శిని తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఏటూరునాగారం మండలంలోని చాల్పాకలో తూరం శ్రీనివాస్, శారద దంపతులకు ప్రథమ పుత్రికగా జన్మించింది. కోయ తెగకు చెందిన ప్రియదర్శిని తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. ప్రియదర్శినికి అమ్మ శారద, చెల్లె సితార ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంటున్న ప్రియదర్శిని

వెయిట్‌లిఫ్టర్‌ క్రీడాకారిణిగా

[మార్చు]

ప్రియదర్శినికి చిన్నతనంనుండే క్రీడల పట్ల ఉన్న ఆసక్తి ఉంది. తాడ్వాయి మండలం మేడారం లోని ఇంగ్లీషు మీడియం పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్న ప్రియదర్శిని లాంగ్ జంప్, హైజంప్‌లో కనబర్చుతున్న ప్రతిభను గమనించిన పాఠశాల పీఈటీ లక్ష్మీనారాయణ, ప్రియదర్శినిని హైదరాబాద్‌ హకీంపేటలోని క్రీడల పాఠశాలలో చేర్పించారు. శిక్షకులు శ్రీనివాస్‌, మాణిక్యాలరావు ప్రోత్సహించారు.

  • 2015 జనవరిలో హరియాణా కేంద్రంగా జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో తొలి స్వర్ణ పతకం గెలిచింది.
  • 2015 అక్టోబరు 12న పుణెలో జరిగిన కామన్‌వెల్త్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించి 44 కిలోల విభాగంలో స్నాచ్‌- 53, క్లీన్‌ అండ్‌ జర్క్‌- 75 కిలోలతో మొత్తం 128 కిలోల బరువు ఎత్తి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.[3]

బహుమతులు - పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. డైలీహంట్. "ఓరుగల్లు వనితల ఘనత". m.dailyhunt.in. Retrieved 3 April 2017.[permanent dead link]
  2. నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 6 April 2017.
  3. The Hindu. "Gold for Warangal girl in weightlifting". Retrieved 3 April 2017.