Jump to content

ప్రొజెక్టర్

వికీపీడియా నుండి
ఎసెర్ ప్రొజెక్టర్, 2012

ప్రొజెక్టర్ లేదా చిత్ర ప్రొజెక్టర్ అనేది ఉపరితలంపై, సాధారణంగా ప్రొజెక్షన్ స్క్రీన్ పై చిత్రాలను (లేదా కదిలే చిత్రాలు) ప్రదర్శించే ఒక ఆప్టికల్ పరికరం. అధికభాగం ప్రొజెక్టర్లు చిన్న పారదర్శక లెన్స్ ద్వారా ప్రకాశవంతమైన కాంతి ద్వారా చిత్రాన్ని సృష్టిస్తాయి, కానీ కొన్ని కొత్త రకాల ప్రొజెక్టర్లు లేజర్స్ ఉపయోగించడం ద్వారా నేరుగా చిత్రాన్ని ప్రదర్శిస్తున్నాయి. వర్చువల్ రెటినల్ డిస్ప్లే, లేదా రెటినల్ ప్రొజెక్టర్ అనేది బాహ్య ప్రొజెక్షన్ స్క్రీన్ ఉపయోగించడానికి బదులుగా రెటీనా మీద నేరుగా చిత్రాన్ని ప్రదర్శించే ఒక ప్రొజెక్టర్. నేడు ఉపయోగిస్తున్న ప్రొజెక్టర్ యొక్క అత్యంత సాధారణ రకమును వీడియో ప్రొజెక్టర్ అంటారు.