Jump to content

ప్లాంటిక్స్

వికీపీడియా నుండి
ప్లాంటిక్స్
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుPEAT GmbH
ప్రారంభ విడుదల2015
ఆపరేటింగ్ సిస్టంAndroid
జాలస్థలిhttps://plantix.net/te

ప్లాంటిక్స్,[1] [2] రైతులు, ఎక్స్టెన్షన్ వర్కర్లు, ఔత్సాహిక తోటల పెంపకందార్లకోసం ఒక మొబైల్ పంట సలహా యాప్. ప్లాంటిక్స్ ను బెర్లిన్ కు చెందిన AI స్టార్టప్ అయిన PEAT [3]GmbH, అభివృద్ధి చేసింది. తెగుళ్ల వలన కలిగే నష్టం, మొక్కల వ్యాధులు, పంటలను ప్రభావితం చేసే పోషక లోపాలు మొదలైన వాటి నిర్ధారణ, సంబంధిత చికిత్స పద్దతులను అందిస్తుందని ఈ యాప్ క్లెయిమ్ చేస్తుంది. మొక్కల ఆరోగ్య సమస్యలపై చర్చించడానికి శాస్త్రవేత్తలు, రైతులు, మొక్కల నిపుణులను కనుగొనే ఆన్‌లైన్ సంఘంలో వినియోగదారులు పాల్గొనవచ్చు. స్థానిక వాతావరణ  వివరాలు, సీజన్ అంతా మంచి వ్యవసాయ సలహాలను, వారి పరిసరాల్లో ఏదైనా వ్యాధి వ్యాప్తి చెందిన వెంటనే ఆ వ్యాధి హెచ్చరికలను రైతులు పొందవచ్చు.

చరిత్ర

[మార్చు]

2015 [4]లో PEAT GmbH  సంస్థ ప్లాంటిక్స్ యాప్ ను ప్రారంభించింది. ఏప్రిల్ 2020 లో PEAT స్విస్-ఇండియన్ స్టార్టప్ సేల్స్ బీ ను సొంతం చేసుకుంది[5]. ఈ సంస్థ బిబిసి, ఫార్చ్యూన్, వైర్డ్, ఎంఐటి టెక్నాలజీ రివ్యూ, నేచర్ వంటి ప్రధాన మీడియా సంస్థలలో ఉదహరించబడింది[6][7][8][9]. CeBITI ఇన్నోవేషన్ అవార్డు, USAID డిజిటల్ స్మార్ట్ ఫార్మింగ్ అవార్డు, ఐక్యరాజ్యసమితి ద్వారా వరల్డ్స్ సమ్మిట్ అవార్డులను కూడా ప్లాంటిక్స్ అందుకుంది.

సహకారులు

[మార్చు]

అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు, ఇంటర్-ప్రభుత్వ సంస్థలైన  ICRISAT  (ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ-అరిడ్ ట్రోపిక్స్), CIMMYT (అంతర్జాతీయ మొక్కజొన్న, గోధుమ అభివృద్ధి కేంద్రం), CABI (సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్స్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలతో సహకరిస్తుంది[10][11][12][13].

ప్రస్తావనలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "From identifying plant pests to picking fruit, AI is reinventing how farmers produce your food". Eco-Business (in ఇంగ్లీష్). Retrieved 2021-03-04.
  2. "6 'Change the World' Companies That Are Rising Stars". Fortune (in ఇంగ్లీష్). Retrieved 2021-03-04.
  3. Schiller, Ben (2017-09-21). "Machine Learning Helps Small Farmers Identify Plant Pests And Diseases". Fast Company (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-03-04.
  4. "Eine App für den grünen Daumen". HAZ – Hannoversche Allgemeine (in జర్మన్). Archived from the original on 2021-06-14. Retrieved 2021-03-04.
  5. "Plantix expands market reach through acquisition of the Swiss startup Salesbee Startupticker.ch | The Swiss Startup News channel". www.startupticker.ch. Retrieved 2021-03-04.
  6. "'Tell me phone, what's destroying my crops?'". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2017-10-12. Retrieved 2021-03-04.
  7. "Die App Plantix erkennt kranke Pflanzen". Auto und Technik | GQ (in జర్మన్). 2017-03-31. Retrieved 2021-03-04.
  8. "The Business of Climate Change". MIT Technology Review (in ఇంగ్లీష్). Retrieved 2021-03-04.
  9. Conroy, Gemma; Parletta, Natalie; Woolston, Chris (2020-11-25). "Germany's start-up scene is booming". Nature (in ఇంగ్లీష్). 587 (7835): S106–S109. doi:10.1038/d41586-020-03319-9.
  10. "Mobile App to Help Farmers Overcome Crop Damage – ICRISAT". www.icrisat.org. Archived from the original on 2020-06-23. Retrieved 2021-03-04.
  11. "Nepal Seed and Fertilizer Project (NSAF)". CIMMYT (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-03-27. Retrieved 2021-03-04.
  12. "CABI trials PEAT's smartphone app Plantix that identifies plant pests in the field". CABI.org (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2021-03-04.
  13. "AP Chief Minister N Chandrababu Naidu Launches Mobile App For Farmers In India". Business, Technology, Startups and Science News and Trends in India | IndianWeb2.com. Retrieved 2021-03-04.