ఫలూన్ గాంగ్ (UK: /ˌfɑːlʊnˈɡɒŋ,ˌfæl-,-ˈɡʊŋ/, US: /ˌfɑːlʊnˈɡɔːŋ,ˌfæl-/) [1] లేదా ఫలూన్ దఫా (/-ˈdɑːfə/; మందరిన్ చైనీస్ భాష: [fɑ̀lǔn tɑ̂fɑ̀]; చైనా దేశంలోని ఒక వర్గం పాటించే ఆధునిక మత విశ్వాసం. ఈ మతం చైనాలో నిషేధించింది, చాలా పీడించింది. కానీ, చైనాలో లక్షలు భాతకుడు, విదేశలోని కూడా. ఇటీవల, కొన్ని మీడియా ఒర్గానిజాతిఒన్స్ (మధ్యమ వ్యాపారాలు) పచ్చిమా దేశలోని ఫలూన్ గాంగ్ తో సంబాధలు వివాదాస్పదలు అయ్యింది, కారణం మితవాదపక్ష కుట్రసిద్ధాంతలు (right-wing conspiracy theories) ప్రసారం చేయు.
బౌద్ధులు చేసే క్విగాంగ్ అనే ఒక రకమైన నృత్యం, యోగా వంటివి సాధన చేస్తూ శాంతియుతంగా జీవించే ఒక వర్గం ప్రజలను ఫలూన్ గాంగ్ అంటారు. 1992లో లీహోంగ్జీ అనే వ్యక్తి తొలుత ఈ ఫలూన్‌గాంగ్ ఆలోచనకు ప్రాణం పోశారు. ఇదొక ఆధ్యాత్మిక ఉద్యమంలా మొదలైంది. దీనిని ఆచరిస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చైనా ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. అనతికాలంలోనే ఫలూన్‌గాంగ్‌లో 7కోట్ల మంది సభ్యులయ్యారు. దీంతో చైనాలోని అధికార కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి ఇది ముప్పుగా మారుతుందనే భయం మొదలైంది. ఫలితంగా ఫలూన్ గాంగ్‌ను చైనా నిషేధించింది. దీనికి వ్యతిరేకంగా 1999లో 10వేల మంది సభ్యులతో ఆందోళన నిర్వహించారు. దీంతో చైనా వీరిని జైళ్లలో బంధించింది.