ఫాంటమ్ లింబ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎడమ ముందుకాలు తీసేసిన నెలల తర్వాత ఓ పిల్లి ఎడమ ముందుకాలితో చెత్త తీసివేసేందుకు ప్రయత్నించే దృశ్యం

పాంటమ్ లింబ్ అంటే ఛేదించిన లేదా లేని కాలు/చేయి ఇంకా శరీరాన్ని అంటిపెట్టుకునేవుందనీ, ఇంకా మిగతా శరీరభాగాలతో సక్రమంగా కదులుతోందనే అనుభూతి కలగడం.[1][2][3] అంగచ్ఛేదన అనుభవం ఉన్నవారిలో దాదాపుగా 60 నుంచి 80% వ్యక్తులకు ఫాంటమ్ అనుభూతులు వారి ఛేదించిన కాలు/చేయికి సంబంధించి కలుగుతుంది, అలానే ఈ అనుభూతుల్లో అత్యధికం నొప్పితో కూడినవి.[4] ఫాంటమ్ అనుభూతులు చేతులు, కాళ్ళే కాకుండా ఇతర శరీరభాగాలు తీసివేసినప్పుడు కూడా కలగవచ్చు, ఉదాహరణకు వక్షోజ కాన్సర్ కారణంగా వక్షోజాలు తీసివేసినప్పుడూ[5], దంతం తీసివేసినప్పుడు (ఫాంటం పన్నుపోటు)[6] లేదా కన్ను తీసేసినప్పుడూ(ఫాంటమ్ ఐ సిండ్రోమ్)[7][8]. విరిగిన ఎముకలకు కూడా ఈ స్థితి గాయం తగిలిన సంవత్సరాల అనంతరం కలగినట్టు నమోదయ్యింది.[9] పోయిన కాలుసేతులు అప్పుడప్పుడు చిన్నవైనట్టు, వంకర తిరిగి, బాధాకరమైన స్థితిలో ఉన్నట్టు అనుభవం కలగుతుంటుంది. అప్పుడప్పుడు ఆందోళన, ఒత్తిడి, వాతావరణంలోని మార్పుల వల్ల నొప్పి తీవ్రం అవుతుంది. చాలాసార్లు ఫాంటమ్ లింబ్ నొప్పి వస్తూపోతూంటుంది. కాలం గడిచే కొద్దీ సాధారణంగా నొప్పిలోని తీవ్రత, తరచుదనం బాగా తగ్గిపోతూంటుంది.[10]

అన్ని ఫాంటమ్ లింబ్స్ బాధాకరం కావు, రోగులు లేని శరీరభాగానికి దురద, పట్టేయడం వంటివి అనుభవించవచ్చు, లేదా దాంతో వస్తువుల తీయాలని, అడుగేయాలని చూడొచ్చు. ఉదాహరణకు, రామచంద్రన్, బ్లకెస్లీ ఆయా శరీరభాగాలను రోగులు వర్ణించే తీరుకు అవి ఉండాల్సిన తీరుకు సంబంధం ఉండదని వివరించారు, ఒక రోగి తన ఫాంటమ్ చేయి ఆరు అంగుళాలు చిన్నగా ఉందని తెలిపింది.[11]

చేతులు/కాళ్ళు లేకుండా జన్మించినవారు, పక్షవాతం వల్ల పనిచేయనివారూ కూడా కొద్ది తేడాతో ఫాంటమ్ నొప్పి అనే కొద్ది తేడా అనుభూతి పొందుతూంటారు.[12] లేని చేయి/కాలును ఉత్తేజితం చేసే నరంలో నొప్పి కలిగినప్పుడు ఫాంటమ్ నొప్పి ఏర్పడుతుంది. బర్నింగ్ సెన్సేషన్ వంటిది ఏర్పడుతూంటుంది, ఇది కొంతమందికి చాలా బాధాకరమైనది అవుతూంటుంది, అనుభూతి విషయంలో వ్యక్తుల మధ్య విస్తృతమైన తేడాలుంటాయి. కొందరు వెచ్చదనం, చల్లదనం, దురద, నొక్కడం, జలదరించడం వంటివి అనుభూతి చెందుతూంటారు.[3][11]

మూలాలు[మార్చు]

 1. Mitchell, S. W. (1871). "Phantom limbs". Lippincott's Magazine of Popular Literature and Science. 8: 563–569.
 2. Melzack, R. (1992). "Phantom limbs" (PDF). Scientific American (April): 120–126.
 3. 3.0 3.1 Ramchandran, VS; Hirstein, William (1998). "The perception of phantom limbs" (PDF). Brain. 121 (9): 1603–1630. doi:10.1093/brain/121.9.1603. PMID 9762952.
 4. Sherman, R. A., Sherman, C.J. & Parker, L. (1984). "Chronic phantom and stump pain among American veterans: Results of a survey". Pain. 18: 83–95. doi:10.1016/0304-3959(84)90128-3.CS1 maint: multiple names: authors list (link)
 5. Ahmed, A.; Bhatnagar, S.; Rana, S. P.; Ahmad, S. M.; Joshi, S.; Mishra, S. (2014). "Prevalence of phantom breast pain and sensation among postmastectomy patients suffering from breast cancer: a prospective study". Pain Pract. 14 (2): E17-28. doi:10.1111/papr.12089. PMID 23789788. Retrieved 10 June 2015.
 6. Marbach, J. J.; Raphael, K. G. (2000). "Phantom tooth pain: a new look at an old dilemma". Pain Med. 1 (1): 68–77. PMID 15101965. Retrieved 10 June 2015.
 7. Sörös, P.; Vo, O.; Husstedt, I.-W.; Evers, S.; Gerding, H. (2003). "Phantom eye syndrome: Its prevalence, phenomenology, and putative mechanisms". Neurology. 60 (9): 1542–1543. PMID 12743251. Retrieved 10 June 2015.
 8. Andreotti, A. M.; Goiato, M. C.; Pellizzer, E. P.; Pesqueira, A. A.; Guiotti, A. M.; Gennari-Filho, H.; dos Santos, D. M. (2014). "Phantom eye syndrome: A review of the literature". ScientificWorldJournal. 2014: 686493. doi:10.1155/2014/686493. PMID 25548790. Retrieved 10 June 2015.
 9. http://www.dailymail.co.uk/health/article-1378581/Phantom-pain-Teenager-broke-foot-7-years-ago-takes-painkillers.html
 10. Nikolajsen, L. & Jensen, T. S. (2006). Wall & Melzack's Textbook of Pain (5th ed.). Elsevier. pp. 961–971. Unknown parameter |editors= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 11. 11.0 11.1 Ramachandran, V. S. & Blakeslee, S. (1998). Phantoms in the Brain: Probing the Mysteries of the Human Mind. William Morrow & Company. ISBN 0-688-15247-3.CS1 maint: multiple names: authors list (link)
 12. Saadah, E. S. & Melzack, R. (1994). "Phantom limb experiences in congenital limb-deficient adults". Cortex. 30 (3): 479–485. doi:10.1016/s0010-9452(13)80343-7.CS1 maint: multiple names: authors list (link)