ఫాల్కిర్క్ చక్రము
స్వరూపం
ఫాల్కిర్క్ చక్రము స్కాట్లాండ్ లో నిర్మింపబడిన ఒక అత్యద్భుతమైన వంతెన. ఈ వంతెన ప్రత్యేకత ఏమిటంటే ఇది పడవలనే పైకి లేపగలదు .2014లో ఈ అద్భుతాన్ని సందర్శించిన పర్యాటకుల సంఖ్య 50 లక్షలు దాటడంతో మళ్లీ ఇది వార్తల్లోకి ఎక్కింది.
విశేషాలు
[మార్చు]- చూడ్డానికి వంతెనలా ఉంటుంది. కానీ వంతెన కాదు. మరేంటీ అంటే పడవల్ని అమాంతం పైకి లేపి ఎత్తయిన ప్రదేశానికి పంపే ఒక చక్రమని చెప్పాలి. పేరు 'ది ఫాల్కిర్క్ వీల్'. పైగా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నది ప్రపంచంలోనే ఇదొక్కటే కావడం విశేషం. స్కాట్లాండ్‌లోని ఫాల్కిర్క్ అనే వూరికి దగ్గరుంది కాబట్టి దీనికీ పేరు.
- దీని ఉపయోగమేమిటంటే... స్కాట్లాండ్‌లో ఫోర్త్, క్త్లెడ్ అనే రెండు కాలువలు ఉన్నాయి. అయితే ఒకటి కిందుంటే మరోటి చాలా ఎత్తయిన ప్రాంతంలో ఉంది. వీటిని ఎప్పుడో 18వ శతాబ్దంలో నిర్మించారు. ఈ కాలువలు గతంలో కలిసే ఉండేవి. పనామా కాలువలో ఉన్నట్లు బోట్లను కాస్త పైకెత్తడానికి ఉపయోగించే 'లాక్స్' వ్యవస్థ ద్వారా అప్పుడు వీటిల్లో బోట్లు తిరిగేవి. కానీ 1930లో వాటిని తీసేసి కాలువలను వేరు చేశారు. మళ్లీ వీటిని కలపాల్సి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 2002లో ఈ వంతెనను నిర్మించారు.
- వంతెనపై భారీ బోట్లు కూడా తిరగడానికి వీలయ్యేలా కాలువను కట్టారు. వంతెనకు ఒకవైపు భారీ చక్రాన్ని అమర్చారు. దీన్నే 'బోట్ లిఫ్ట్' అంటారు. అయితే గొప్పతనమంతా ఈ చక్రానిదే. ఇది క్షణాల్లో కింది కాలువలో ఉన్న పడవలను పైకి ఎత్తగలదు. పైనున్న వాటిని కిందికి దింపగలదు.
- పడవలు కాలువలో ప్రయాణం చేసి ఈ చక్రంలోకి వచ్చి ఆగుతాయి. అప్పుడు ఈ చక్రం పడవలను 79 అడుగుల ఎత్తుకు లేపి, పైన వంతెనపై ఉన్న కాలువలోకి పంపుతుంది. ఈ చక్రం రెండువైపులా కలిపి 8 పడవలను మోయగలదు. 5 రౌండ్లయ్యాక ఇది తిరిగే దిశ మార్చుకుంటుంది.
- ఫాల్కిరిక్ వీల్‌ను 21వ శతాబ్దపు ఇంజినీరింగ్ వింతగా చెబుతారు. పైగా రోజూ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని చూడ్డానికి వేలాది పర్యాటకులు వస్తారు. వారు కూడా బోట్లలో కూర్చొని ఈ చక్రంలో తిరుగుతారు. కాలువలో కాసేపు చక్కర్లు కొట్టి వస్తారు. ఇప్పటి వరకు దీన్ని సందర్శించిన వారి సంఖ్య 55 లక్షలకు చేరింది.
చిత్రమాలిక
[మార్చు]-
A timelapse of the wheel rotation. This video covers a time period of 10 minutes
-
Animation showing how the wheel turns. The direction of rotation changes every five cycles.
-
View of the aqueduct and top of the wheel.
బయటి లంకెలు
[మార్చు]Wikimedia Commons has media related to Falkirk Wheel.
- అధికారిక వెబ్‌సైటు
- bankieland (May 18, 2013). "Falkirk Wheel, Central Scotland in operation" (video). YouTube. Retrieved April 1, 2014.