ఫిలడెల్ఫియా క్రోమోజోము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫిలడెల్ఫియా క్రోమోజోము (Philadelphia chromosome) క్రానిక్ మైలోసైటిక్ ల్యుకేమియా (Chronic Myelocytic Leukemia) అను ఒక రక్త కాన్సర్ వ్యాధిని కలిగించే క్రోమోజోముకు సంబంధించిన లోపం. 22వ క్రోమోజోములో పరిత్యాగము (Deletion) జరుగుట వలన ఈ వ్యాధి సంక్రమిస్తుందని మొదటిసారిగా నోవెల్, హంగర్ఫోర్ట్ అను శాస్త్రవేత్తలు ఫిలడెల్ఫియా (Philadelphia) లో ప్రకటించారు. కనుక ఈ లోపాన్ని ఫిలడెల్ఫియా క్రోమోజోము అని పిలుస్తారు. తరువాత జె. రౌలీ (J. Rowley) అను శాస్త్రవేత్త దీనికి సంబంధించిన కచ్ఛితమైన క్రోమోజోము అమరిక గూర్చి తెలియజేసాడు. 22వ క్రోమోజోము తాలూకు పొడవు భుజంలోని కొంతభాగం మరొక క్రోమోజోముకు, సాధారణంగఅ 9వ క్రోమోజోముకు అతుక్కుంటుంది.