ఫిలిం స్వాప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫిలిం స్వాప్ (ఆంగ్లం: Film Swap) అనగా ఒకే ఫిలిం చుట్టను ఇద్దరు ఫోటోగ్రఫర్లు తమ తమ కెమెరాలలో రెండు వేర్వేరు చోట్ల వేర్వేరు ప్రదేశాలను చిత్రీకరించి ఊహకందని ఛాయాచిత్రాలను సృష్టించటం. ఒకరు చిత్రీకరించిన ఫిలిం పైనే మరొకరు మరల చిత్రీకరించటం వలన రెండు ఛాయాచిత్రాలు ఒకే మారు కనబడటం వలన వీక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఫిలిం ఫోటోగ్రఫర్లు సాంఘిక మాధ్యమాల ద్వారా చేతులు కలిపి ఫిలిం లను స్వాప్ చేసి వాటి ఫలితాలను అవే సాంఘిక మాధ్యమాలలో పోస్టు చేస్తూ ఉంటారు.

చిక్కులు

[మార్చు]
  • ఒకే ఫిలిం రెండు మార్లు, లేక అంతకన్నా ఎక్కువ మార్లు బహిర్గతం కావటం వలన అది అతిబహిర్గతం అయి (Overexpose), అసలు ఏ ఛాయాచిత్రం కనబడకపోయే సమస్య
  • ఒకరి కెమెరా వెడల్పు ఎక్కువ ఉండటం, మరొకరిది తక్కువ ఉండటం వలన ఖచ్చితంగా ఒకరు ఫ్రేం చేసిన చోటే మరొకరు ఫ్రేం చేయలేక పోవటం. (ఇలా చేయలేక పోవటం వలన కూడా ఒక్కో మారు ఆసక్తికర పరిణామాలు ఎదురు కావటం)

35ఎంఎం ఫిలిం

[మార్చు]
  • ఒక మారు ఫిలిం చుట్ట మొత్తం పూర్తి అయిన తర్వాత, రివైండ్ చేసే సమయంలో ఫిలిం చుట్ట మొత్తం క్యాసెట్ లోపలికి వెళ్ళిపోయే ప్రమాదం. దీని వలన తదుపరి ఫిలిం స్వాపర్ ప్రత్యేకమైన పరికరం ఉంటే తప్పితే ఆ ఫిలిం ను మరల కెమెరాలోకి ఇమడ్చలేరు

120 ఫిలిం

[మార్చు]
  • ఒక మారు ఫిలిం చుట్ట మొత్తం పూర్తి అయిన తర్వాత, దీనిని రివైండ్ చేసే సౌలభ్యం ఉండదు.

చిట్కాలు

[మార్చు]
ఫిలిం స్వాపర్ లు ఒకే ఫ్రేం పై రెండు బహిర్గతాలు సరిగా కూర్చటానికి ఉపయోగించే చిట్కా. దీనినే మార్కింగ్ అంటారు.
  • అతిబహిర్గతాన్ని నివారించటానికి ఉద్దేశ్యపూర్వకంగానే మితబహిర్గతాన్ని (Underexposure) వాడటం. (ఉదా: ఫిలిం వేగం ISO100 అయితే కెమెరా వేగాన్ని ISO200 కు కూర్చటం. దీని వలన కావలసిన బహిర్గతం కన్నా ఫిలిం తక్కువ బహిర్గతానికి గురౌతుంది. రెండు మార్లు అర్థ బహిర్గతానికి లోను కావటం వలన అతిబహిర్గత ముప్పు తప్పుతుంది.)
  • స్కెచ్ పెన్/మార్కర్ తో మొదటి ఛాయాచిత్రకారుడు, ఫ్రేం ను ఎక్కడ కూర్చాడో అక్కడ రెండు సమాంతర గీతలు గీయటం. అవే గీతలను అనుసరిస్తూ రెండవ ఛాయాచిత్రకారుడు కూడా, ఫిలిం చుట్టను అక్కడే కూర్చటం
  • 35ఎంఎం ఫిలిం రివైండ్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్త వహిస్తూ ఫిలిం లీడర్ లోపలికి వెళ్ళకుండా రివైండ్ చేయటం. ఫిలిం అంతా రివైండ్ అయ్యే సమయంలో రివైండ్ లీవర్ బిగుతుగా ఉంటుంది. ఫిలిం లీడర్ రాగానే కొద్దిగా వదులు అవుతుంది.
  • 120 ఫిలిం ను డార్క్ రూంలో తెరచి వ్యతిరేక దిశలో చుట్టి, మరల ఉపయోగించటం

ఉదాహరణలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బాహ్య లంకెలు

[మార్చు]