ఫీలే ల్యాండర్
![]() ఫీలే తోకచుక్కను సమీపిస్తున్నట్లుగా చూచిస్తున్న దృష్టాంతచిత్రము | |
మిషన్ రకం | తోకచుక్క లాండర్ |
---|---|
నిర్వహించే సంస్థ | యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ |
COSPAR ID | PHILAE |
మిషన్ కాలము | 1–6 వారాలు (ప్రణాళిక) |
అంతరిక్షనౌక లక్షణాలు | |
ప్రారంభ ద్రవ్యరాశి | 100 కి.గ్రా. (220 పౌ.)[1] |
పే లోడ్ ద్రవ్యరాశి | 21 కి.గ్రా. (46 పౌ.)[1] |
కొలతలు | 1 × 1 × 0.8 మీ. (3.3 × 3.3 × 2.6 అ.)[1] |
శక్తి | 3 ఆస్ట్రోనామికల్ యూనిట్ (AU) వద్ద 32 వాట్స్[2] |
మిషన్ ప్రారంభం | |
ప్రారంభ తేదీ | 2 March 2004, 07:17 | UTC
రాకెట్ | అరైన్ 5G+ V-158 |
ప్రారంభించిన స్థలం | గుయానా స్పేస్ సెంటర్ ELA-3 |
Contractor | ఏరియానిస్పేస్ |
67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో lander | |
Landing date | 12 నవంబరు 2014 15:35 UTC |
Instruments | |
APX Alpha: Alpha Particle X-ray Spectrometer ÇIVA: Comet nucleus Infrared and Visible Analyzer CONSERT COmet Nucleus Sounding Experiment by Radiowave Transmission COSAC: COmetary SAmpling and Composition MUPUS: Multi-Purpose Sensors for Surface and Subsurface Science PTOLEMY: gas chromatograph and medium resolution mass spectrometer ROLIS: ROsetta Lander Imaging System ROMAP: ROsetta lander MAgnetometer and Plasma monitor SD2: Sample and Distribution Device SESAME: Surface Electric Sounding and Acoustic Monitoring Experiment |
తోకచుక్కపై దిగిన తొలి ల్యాండర్ ఫీలే ల్యాండర్. ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈసా) కు చెందిన రోసెట్టా వ్యోమనౌక 2004లో నింగిలోకి వెళ్లి పదేళ్లుగా ‘67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’ అనే తోకచుక్కను వెంటాడుతూ 2014 సెప్టెంబరులో దాని సమీపంలోకి చేరి దాని చుట్టూ తిరుగుతూ నవంబరు 12, 2014 న ఈ ల్యాండర్ ను తోకచుక్కపై జారవిడిచింది. ఖగోళ చరిత్రలో తొలిసారిగా తోకచుక్కను చేరుకున్న ఈ ఘటన ఒక అద్భుత ఘట్టంగా ఆవిష్కృతం అయింది. ఈ ఘటనతో ఒక తోకచుక్కపై తొలిసారిగా వ్యోమనౌకను చేర్చిన ఘనతను ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈసా) సొంతం చేసుకుంది. 450 కోట్ల ఏళ్ల క్రితం సౌరకుటుంబం ఏర్పడినప్పటి పరిస్థితుల గురించి తెలుసుకొనేందుకు తోకచుక్కలపై అధ్యయనం సహకరిస్తుందని ఈసా సుమారు 160 కోట్ల డాలర్ల ఖర్చుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
ప్రతి ఆరున్నరేళ్లకోసారి సూర్యుడిని చుట్టి వస్తున్న 67పీ తోకచుక్క సెకనుకు 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 12 గంటలకు ఒకసారి తనచుట్టూ తాను తిరుగుతోంది. 67పీ తోకచుక్కపై ల్యాండర్ ను దించడానికి రోసెట్టా వ్యోమనౌక దాని చుట్టూ తిరుగుతూనే తోకచుక్క సమీపానికి వెళ్లి ఈ ల్యాండర్ ను జారవిడిచింది. తోకచుక్కను చేరుకున్న ఈ ల్యాండర్ తోకచుక్కపై తన మరలను దించి గట్టిగా పట్టుకున్నది.
చిత్రమాలిక[మార్చు]
ఇవి కూడా చూడండి[మార్చు]
- రోసెట్టా వ్యోమనౌక - తోకచుక్కపై దిగిన తొలి ఫీలే ల్యాండర్ ను వదలిన వ్యోమనౌక రోసెట్టా .
మూలాలు[మార్చు]
- సాక్షి దినపత్రిక - 13-11-2014 - (తోకచుక్కపై తొలి అడుగు!)
- ↑ 1.0 1.1 1.2 "PHILAE". National Space Science Data Center. Retrieved 28 January 2014.
- ↑ "Philae lander fact sheet" (PDF). DLR. Retrieved 28 January 2014.