ఫోటోగ్రఫిక్ ప్లేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫోటోగ్రఫిక్ ప్లేట్ (ఆంగ్లం: Photographic plate) ఫిలిం రాకకు ముందు ఫోటోగ్రఫీలో మాధ్యమంగా ఉపయోగించబడేది. ప్లాస్టిక్ తో తయారు చేయబడే ఫిలిం స్థానే, కిటికీలకు ఉపయోగించే వాటికంటే పలుచగా ఉండే గాజుపలకలపై సిల్వర్ లవణాల మిశ్రమాన్ని పూసి కెమెరాలలో అమర్చి కెమెరా ద్వారా దానిని కాంతికి బహిర్గతం చేసి తర్వాత సంవర్థన చేసేవారు.

చరిత్ర[మార్చు]

స్థిరత్వం కలిగి ఉండటం, వంపుకు గురి కాకుండా ఉండటం వంటి లక్షణాలు కలిగి ఉండటం, పరిశోధనలకు ఉపయోగించే ఫోటోలకు కావలసిన నాణ్యతా ప్రమాణాలు, కేవలం ఫోటోగ్రఫిక్ ప్లేట్ ల పైనే సాధ్యపడటం వలన అప్పట్లో ఫోటోగ్రఫిక్ ప్లేట్ ల ఉపయోగం విరివిగా ఉండేది. మొదటి తరం ఫోటోగ్రఫిక్ ప్లేట్ లు కొలాయిడన్ ప్రక్రియను అవలంబించేవి. తడి ప్లేట్ ల ప్రక్రియ స్థానే 19వ శతాబ్దంలో పొడి ఫోటోగ్రఫిక్ ప్లేట్ లు వచ్చాయి. 20వ శతాబ్దం నాటికి పెద్ద పరిమాణం గల ఫిలిం లు ఉపయోగం లోకి వచ్చాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]