ఫోర్ సీజన్స్ హోటల్-ముంబయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Four Seasons Hotel, Mumbai
The Four Seasons, Mumbai.jpg
Four Seasons Tower Mumbai
సాధారణ సమాచారం
ప్రదేశం144 Dr. E Moses Road, Worli, Mumbai, India[1]
పూర్తి చేయబడినది2008
ప్రారంభం2008
వ్యయంUS$100 million[2]
ఎత్తు
పైకప్పు146 మీ. (479 అ.)[3]
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య37
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిJohn Arzarian of Lohan Associates

భారతదేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఉన్న ప్రముఖ ఐదు నక్షత్ర హోటళ్లలో ఫోర్ సీజన్స్ అనేది కూడా ఒక ఫైవ్ స్టార్ హోటల్. ఇది టొరొంటో ఆధారిత ఫోర్ సీజన్స్ విలాసవంతమైన హోటళ్లు & రిసార్ట్స్ గ్రూపునకు చెందిన హోటళ్లలో ముంబయిలోని ఫోర్ సీజన్స్ హోటల్ కూడా ఒకటి.[4] ముంబయిలోని వర్లీ ప్రాంతంలో 144, డాక్టర్ మోసెస్ రోడ్ లో ఫోర్ సీజన్స్ హోటల్ ఉంది.[5] ఈ హోటల్ లో ప్రస్తుతం 202 విలాసవంతమైన గదులు, అతిథిగృహాలు ఉన్నాయి.[6] భారతదేశంలోనే అతి పెద్ద రూఫ్ టాప్ బార్ ఈ హోటల్లో ఉంది.[7][8][9] ఈ హోటల్ పై భాగం (రూఫ్) 146 మీటర్లు (479 అడుగులు) ఎత్తున నిర్మించారు. ఈ హోటల్ నిర్మాణం కోసం 100 మిలయన్ల అమెరికన్ డాలర్లు ఖర్చు చేశారు. లోహన్ అసోసియేట్ నిర్మాణ సంస్థకు చెందిన జాన్ ఆర్జారియన్ అనే ఆర్కిటెక్టర్ ఈ హోటల్ కు అర్టిటెక్చర్ గా పనిచేశారు.

చరిత్ర[మార్చు]

హాంకాంగ్ కు చెందిన లోహన్ ఆసోసియేట్స్ యొక్క జాన్ ఆర్జరియన్ డిజైన్ చేసిన 37 అంతస్తులు గల ఈ భవన నిర్మాణం 2008 సంవత్సరంలో పూర్తి చేశారు. ఈ హోటల్ అంతర్గత నిర్మాణాలను బిల్కీ-లినాస్ అనే అర్టిటెక్టర్ డిజైన్ చేశారు.[10] భవనంలోని గోడలు, ఇతర సివిల్ నిర్మాణాలన్నీ కేవలం ఏడాదిన్నరలో పూర్తి చేశారు. ఈ హోటల్ స్లాబ్ (డాబా) వేయడానికి 8 రోజులు పట్టింది. ముంబయి నగరంలో 37 అంతస్తుల ఇంత పెద్ద భవనాన్ని ఇంత తక్కువ కాలంలో నిర్మించడం చాలా విశేషమైన విషయమని చాలా మంది చెప్పుకుంటారు. తక్కువ సమయంలో ఇంత పెద్ద భవనాలను నిర్మించడం భారతదేశంలో చాలా అరుదు. వాటిలో ఫోర్ సీజన్ హోటల్ కూడా ఒకటి. న్యూ ఢిల్లీకి చెందిన అహ్లువాలియా కన్ స్ట్రక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ యొక్క జనరల్ మేనేజర్ శ్రీ సంజీవ్ గార్గ్ ఈ ప్రాజెక్టు మొత్తాన్ని విజయవంతంగా నిర్వహించారు.

రెస్టారెంట్లు[మార్చు]

ఫోర్ సీజన్ హోటల్ కు అనుబంధంగా ఈ క్రింద పేర్కొన్న రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వేటికవే ప్రత్యేకత కలిగి ఉన్నాయి.:

 • కెఫే ప్రాటో & బార్[11]
 • పూల్ డెక్
 • సాన్-క్వీ

సేవలు[మార్చు]

దస్త్రం:Four Seasons Hotel Mumbai.jpeg
ఫోర్ సీజన్స్ హోటల్-ముంబయి

ఈ హోటల్లో అనేక రకాల విలాసవంతమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులకు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా హోటల్ బుకింగ్ నుంచి గదిలో దిగేదాకా అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను సిబ్బంది అందిస్తారు. హోటల్లో బాల్ రూం, రేయిన్ ఫారెస్ట్ తో పాటు అందమైన తోటలు, బీచ్ వాలీబాల్ కోర్టు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.[12]

వినియోగదారులు కోరుకున్న విధంగా అన్ని సౌకర్యాలతో పాటు ఊహికందని కూడా ఎన్నో విశేషాలు ఇక్కడ ఉన్నాయి. ఈ హోటల్లోని పిరమిడ్స్ వద్ద ఉన్న బెడౌన్ టెంట్ లో రాత్రి జరిగే పార్టీలు, స్కై వాకింగ్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ముంబయి ఫోర్ సీజన్ హోటల్లో విలాసవంతమైన స్నానాల గదులు, ఫ్లోరింగ్ నుంచి సీలింగ్ దాకా అదునాతనమైన డెకరేషన్లు, కిటికీల నుంచి వచ్చే సహజ కాంతి వంటివి ప్రత్యేక ఆకర్షణలు. ఒక్కో అంతస్తులో కేవలం 8 గెస్టు రూంలు మాత్రమే ఉంటాయి. అంతేకాదు.[13]

అతిథుల శారీరక దృఢత్వం, శరీర మర్ధన కోసం 314 చదరపు మీటర్ల వైశాల్యంలో ఫిట్ నెస్ సెంటర్ కూడా ఫోర్ సీజన్ హోటల్లో ఉంది. మొత్తం 202 గెస్ట్ రూంలు, 34వ అంతస్తులో ఓపెన్ ఎయిర్ బార్ వంటి ఎన్నో సదుపాయాలున్నాయి. స్నానాల గదుల్లో షవర్లు, టబ్ లవంటి అన్ని సౌకర్యాలుంటాయి. ఈ హోటల్లోని సూట్లు కుటుంబ సభ్యులు విడిది చేయడానికి, వ్యాపార వేత్తల సమావేశాలకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా హైటెక్ వినోద కార్యక్రమాలకు ఈ హోటల్ నెలవుగా ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఉండే సూట్లలో పిల్లల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తారు. ఈ హోటల్లో గదులన్నీ మనసుకు ప్రశాంతను కలిగించే రంగుల్లో ఉంటాయి.

అదేవిధంగా పూర్తి స్థాయిలో విశ్రాంతిని కలిగించే మొత్తటి ఫోమ్ తో కూడిన పరుపులతో బెడ్స్ ఉంటాయి. అడగడుగునా విలాసవంతంగా ఉండే ప్రతి గదిలో టెలిఫోన్ సౌకర్యం, హోటల్ ఆవరణలో విశాలమైన పార్కింగ్ స్థలం వంటి సౌకర్యాలున్న ఫైవ్ స్టార్ హోటల్ ఇది. 5 నక్షత్రాల ఈ హోటళ్లో వ్యాపారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకునేందుకు ఆడియో, వీడియో పరికరాలున్నాయి. అదేవిధంగా హోటల్లో నుంచి అరేబియన్ అందాలను వీక్షించడం సరికొత్త అనుభూతినిస్తుంది. అదేవిధంగా ముంబయి సముద్ర తీర దృశ్యాలను హోటల్ గదులనుంచే నేరుగా తిలకించవచ్చు.

బయటి లింకులు[మార్చు]

విభాగాలు[మార్చు]

 • ముంబయి నగరంలోని ఆకాశహర్మ్యాలు
 • ముంబయి నగరంలోని హోటళ్లు
 • ఆసియా ఖండంలోని కొన్ని భాగాల హోటళ్లు
 • భారతదేశంలోని భవనములు, కొన్ని ముఖ్యమైన నిర్మాణాలు

సూచనలు[మార్చు]

 1. "Mumbai Hotel Rates | Hotel Packages | Room Reservations | Four Seasons Mumbai". Fourseasons.com. Retrieved 2010-09-15. CS1 maint: discouraged parameter (link)
 2. "Riches rise from Mumbai slum clearance". Rediff.com. 2004-12-31. Retrieved 2010-09-15. CS1 maint: discouraged parameter (link)
 3. Emporis GmbH. "Four Seasons Mumbai, Mumbai, India". Emporis.com. Retrieved 2010-09-15. CS1 maint: discouraged parameter (link)
 4. "Four Seasons Hotels coming to Mumbai". TheHinduBusinessLine. 2003-10-26. Retrieved 2010-09-15. CS1 maint: discouraged parameter (link)
 5. "The most comfortable bed in town - Insider". livemint.com. 2008-02-22. Retrieved 2010-09-15. CS1 maint: discouraged parameter (link)
 6. "Four Seasons to add six more properties". Business-standard.com. 2009-06-23. Retrieved 2010-09-15. CS1 maint: discouraged parameter (link)
 7. "Introducing Aer, India's Highest Rooftop Bar.2009 Hotel News - Four Seasons Hotel Mumbai - Hotel Press Kits - Press Room - Four Seasons Hotels and Resorts". Press.fourseasons.com. 2009-12-03. Retrieved 2010-09-15. CS1 maint: discouraged parameter (link)
 8. "View from the top - Insider". livemint.com. 2009-12-04. Retrieved 2010-09-15. CS1 maint: discouraged parameter (link)
 9. "Four Seasons Hotel Mumbai opens breathtaking Aer bar". Easier. 2009-12-07. Retrieved 2010-09-15. CS1 maint: discouraged parameter (link)
 10. "Four Seasons Hotel opens in Mumbai - Construction & Industry". ArabianBusiness.com. 2008-06-29. Retrieved 2010-09-15. CS1 maint: discouraged parameter (link)
 11. "Mumbai Restaurant-Pubs In Mumbai-Four Seasons Hotel Mumbai". Fourseasons.com. Retrieved 2013-12-06. CS1 maint: discouraged parameter (link)
 12. "Facilities Of Four Seasons Hotel Mumbai". cleartrip.com.
 13. "Accommodations". Fourseasons.com.