బంటు రీతి కొలువు (కీర్తన)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బంటు రీతి కొలువు అనేది కర్ణాటక సంగీత వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి రచించిన కీర్తన. ఈ కీర్తనను నీతిమతి రాగం జన్యమైన హంసనాదం రాగం, ఆదితాళం లో గానం చేస్తారు.[1]

కీర్తన[మార్చు]

పల్లవి

బంటు రీతి కొలువు ఈయవయ్య రామా | (బంటు)

అనుపల్లవి

తుంట వింటి వాని మొదలైన మదా- |
దుల గొట్టి నేల గూల జేయు నిజ || (బంటు)

చరణం

రోమాంచ మను ఘన కంచుకము |
రామ భక్తుడను ముద్ర బిళ్ళయు ||
రామ నామ మను వర ఖడ్గ మివి |
రాజిల్లు నయ్య త్యాగరాజుని కే || (బంటు)

అర్థం[మార్చు]

ఈ కీర్తనలో త్యాగరాజు తనకు కామ, క్రోధ మదాదులను కొనగోటితో సంహరించగల బంటురీతి కొలువు (సైనికుడు వంటి ఉద్యోగం) ఇమ్మని రామున్ని ప్రార్ధిస్తూ రామ నామమనే ఖడ్గాన్ని, రామభక్తుడనే ముద్రబిళ్ళను, రోమాంచమనే ఘన కంచుకమ (రామనామం తలవగానే ఆనంద పారవశ్యం తో ఒంటిపై  నిక్కబొడుచుకొన్న వెంట్రుకలు అనే కవచం) ఇవ్వమని అడుగుతున్నాడు.[2]

భారతీయ సంస్కృతి[మార్చు]

పూర్తి పాఠం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. కర్ణాటిక్ సైట్ లో బంటు రీతి కీర్తన సాహిత్యం.
  2. abcd (2013-04-16). "బంటు రీతి కొలువు ఈయవయ్య రామా……". అభిప్రాయం. Retrieved 2021-06-02.
  3. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి కచేరీలో గానం చేసిన బంటురీతి కీర్తన.