బండారు కరుణాకర ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బండారు కరుణాకర ప్రసాద్

బండారు కరుణాకర ప్రసాద్ (బి.పి.కరుణాకర్) తెలుగు కథా రచయిత, అధ్యయనశీలి.[1] బీహెచ్‌ఈఎల్‌ సంస్థ ఫైనాన్స్‌ శాఖలో మేనేజర్‌గా 2004లో పదవీ విరమణ చేశాడు. ‘బీపీ కరుణాకర్‌’ అనే కలం పేరుతో కథా రచనలు చేసిన ఆయన.. ‘కార్డు’ కథలు, ‘కాలమ్‌’ కథలు వంటి వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. అతని కలం నుంచి ‘అంబాలిస్‌’[2], ‘నిర్నిమిత్తం’, ‘రెల్లు’,[3] ‘డియర్‌’,[4] ‘రజితం[5]’ వంటి పలు కథాసంపుటిలు వెలువడ్డాయి. మరెన్నో కథలు పలు వార పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

జీవిత విశేషాలు[మార్చు]

అతనికి ఆధునిక కథాసాహిత్యం పట్ల ఆసక్తి, అనురక్తి ఉన్నందున ప్రపంచ కథా సాహిత్యంలోని గుర్తింపు పొందిన రచయితల రచనల్ని చాలా ఇష్టంగా చదివేవాడు. ఆ ప్రభావం కారణంగా కథాప్రక్రియ మీద పట్టు సంపాదించాడు. జీవితంలోని సూక్ష్మాతి సూక్ష్మాంశాల్ని తీసుకొని కథలు రాయగలిగే నేర్పు సంపాదించాడు. అలవోకగా చెబుతూనే జీవిత వాస్తవికతను, సమాజ వాస్తవికతను మానవ పోకడల్లోని వైరుధ్యాలను కరుణాకర్‌ చిత్రిస్తాడు. 'అంబాలీస్‌' (2008), 'నిర్నిమిత్తం' (2009), 'రాజితం' (2011) ఈ రచయిత ఇతర కథాసంపుటాలు. 'నిర్నిమిత్తం', 'రాజితం' సంపుటాల్లోని కథలు హిందీలోకి తర్జుమా చేయబడ్డాయి. 'రాజితం' కథలు కన్నడంలో కూడా అనువాదం చేయబడ్డాయి.[6]

కథలు రాయడంలోనే కాదు, స్నేహితులకి కథలు చెప్పడంలో కూడా నేర్పరి. అతని తాతగారు ఎసీ కిన్సింగర్, గుంటూరులోని లూథరన్ క్రైస్తవ నాయకులలో ఒకరు, గొప్ప గీత రచయిత.

అతను కథా రచయిత కొలకలూరి ఇనాక్, ఏసీ కాలేజ్ లో ట్యూటర్ గా ఉన్నప్పుడు అతని విద్యార్ధి.

అంబాలీస్ పుస్తకంలోని కథలు భారతి, ఆంధ్రసచిత్ర వార పత్రిక, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, ఆంధ్రజ్యోతి వారపత్రిక, ఉదయం వీక్లీ, విజయ మాసపత్రిక, కృష్ణా పత్రిక, చుక్కాని, సైనిక్‌సమాచార్‌ వారపత్రికలలో ప్రచురింపబడ్డాయి.

మరణం[మార్చు]

అతను కొంతకాలంగా హృద్రోగ సమస్యతో బాధపడుతూ 2020 జూలై 18న మరణించాడు.[7] అతనికి ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురు అమెరికా లో ఉంటుంది, చిన్న కూతురు హైదరాబాద్ సంగారెడ్డిలో ఉంటుంది.  ఆయన భార్య పేరు హేమలత. ఆమె అతని కంటే 23 సంవత్సరాల క్రితం మరణించింది. అతను విద్యా నగర్ లోని అనురాగ్ సదన్ అపార్టమెంట్ లో ఉండేవాడు. [8] అతని తల్లి అందుగల గ్రేస్‌ మనోరమా కిన్సింగర్‌, నాన్న బండారు ప్రేమానందం. అతని కుమార్తెలు బండారు జోనా విజయప్రియ, బండారు జయశ్రీ మనోరమ.

మూలాలు[మార్చు]

  1. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-07-24.
  2. "అంబాలీస్‌ బి.పి. కరుణాకర్‌,". sathyakam.com. Archived from the original on 2020-07-24.
  3. "Rellu". www.logili.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-24.
  4. "Dear(BP Karunakar)". www.telugubooks.in (in ఇంగ్లీష్). Archived from the original on 2020-07-24. Retrieved 2020-07-24.
  5. "రాజితం - బి.పి.కరుణాకర్ - కథా జగత్". sites.google.com. Retrieved 2020-07-24.
  6. "రెల్లు బి.పి. కరుణాకర్‌,". Archived from the original on 2020-07-24.
  7. "కథా రచయిత కరుణాకర్‌ కన్నుమూత". www.andhrajyothy.com. Retrieved 2020-07-24.
  8. "విద్యుద్గళం నిస్సార్‌కు నివాళి". Asianet News Network Pvt Ltd. Retrieved 2020-07-24.