బద్రీ నారాయణ్
Jump to navigation
Jump to search
బద్రీ నారాయణ్ | |
---|---|
జననం | సికింద్రాబాద్, తెలంగాణ | 1929 జూలై 22
మరణం | 2013 సెప్టెంబరు 23 బెంగళూరు, కర్ణాటక | (వయసు 84)
జాతీయత | భారతీయుడు |
బద్రీ నారాయణ్ (1929, జూలై 22 - 2013, సెప్టెంబరు 23) తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు, రచయిత, కథకుడు.[1]
జననం
[మార్చు]నారాయణ్ 1929, జూలై 22న తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదులో జన్మించాడు.[2] 13 సంవత్సరాల వయస్సులో తన తల్లిని కోల్పోయిన నారాయణ్, అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు.
కళారంగం
[మార్చు]నారాయణ్ శిక్షణ లేకుండా పెయింటింగ్ వేయడం ప్రారంభించాడు. 1949లో తొలిసారిగా చిత్రకళా ప్రదర్శన నిర్వహించాడు. 1954లో సోలోగా చిత్రకళా ప్రదర్శన నిర్వహించాడు. దాదాపు 50కి పైగా సోలో ప్రదర్శనలు చేశాడు. పిల్లల పుస్తకాలకు చిత్రాలు గీశాడు. చిన్నచిన్న కథలు, పద్యాలు రాశాడు. ఇతడి గురించి ముంబై ఆల్ ఇండియా రేడియోలో డాక్యుమెంటరీ కూడా వచ్చింది.[3]
పురస్కారాలు
[మార్చు]- 1987: పద్మశ్రీ పురస్కారం
- 1990: మహారాష్ట్ర గౌరవ పురస్కారం
మరణం
[మార్చు]బద్రీ నారాయణ్ 2013, సెప్టెంబరు 23న అనారోగ్యం కారణంగా బెంగుళూరులోని ఒక ఆసుపత్రిలో మరణించాడు.
చిత్రకారుడిగా
[మార్చు]- శాంతా రామేశ్వర్ రావు రచించిన మహాభారతం; బద్రి నారాయణ్ దృష్టాంతాలు. (1985, ఓరియంట్ లాంగ్మన్)
- లక్ష్మీ లాల్ రచించిన రామాయణం, బద్రీ నారాయణ్ (1988, ఓరియంట్ లాంగ్మన్)
మూలాలు
[మార్చు]- ↑ "Paintings by Indian artists Purkhu and Badri Narayan will headline Neue Auctions' Feb. 20 online sale". ArtfixDaily (in ఇంగ్లీష్). Archived from the original on 2021-04-14. Retrieved 2022-01-27.
- ↑ "Badri Narayan and what it means to be a modern Indian artist". Mintlounge (in ఇంగ్లీష్). 2021-06-14. Archived from the original on 2022-01-07. Retrieved 2022-01-27.
- ↑ Das&, Soumitra. "Life of a modernist rooted in tradition". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-04-21. Retrieved 2022-01-27.
బయటి లింకులు
[మార్చు]- బద్రి నారాయణ్ ప్రొఫైల్, ఇంటర్వ్యూ, కళాఖండాలు
- కలర్ ఆఫ్ ఇండియా.కామ్ లో బద్రీ నారాయణ్
- ఇండియన్ ఆర్ట్ కల్చర్ లో బద్రీ నారాయణ్
- లలిత కళా అకాడమీ సేకరణలో చిత్రం
- ది ఆర్ట్స్ ట్రస్ట్ ఆన్లైన్ గ్యాలరీలో బద్రీ నారాయణ్ పెయింటింగ్స్ (ఆర్కైవ్ చేయబడింది)
- ది హిందూ వార్తాపత్రికలో బద్రీ నారాయణ్‌పై కథనం, పెయింటింగ్ చిత్రంతో సహా
- డెక్కన్ హెరాల్డ్‌లో కథనం
- బద్రి నారాయణ్ ద్వారా ఇల్లు, చెట్ల చిత్రం
- పిఎంఏలోని స్క్వేర్లు
- పిఎంఏలో ఉన్న వ్యక్తి