బయోలాజికల్ ఇ
రకం | ప్రైవేట్ కంపెనీ |
---|---|
పరిశ్రమ | బయోటెక్నాలజీ, బయోఫార్మాస్యూటికల్స్ |
స్థాపన | 1953 |
స్థాపకుడు | దాట్ల వెంకట కృష్ణం రాజు |
ప్రధాన కార్యాలయం | జూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
కీలక వ్యక్తులు | మహిమా దాట్ల (మేనేజింగ్ డైరెక్టర్)[1] |
ఉద్యోగుల సంఖ్య | 2500 |
వెబ్‌సైట్ | www |
బయోలాజికల్ ఇ. లిమిటెడ్ (ఆంగ్లం: Biological E. Limited, ) (బయోఇ అని కూడా పిలుస్తారు) తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో ఉన్న భారతీయ బయోటెక్నాలజీ, బయోఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇది వ్యాక్సిన్ ఉత్పత్తి రంగంలో తక్కువ-ధరలతో ప్రత్యేకత సంతరించుకుంది.[2]
కరోనా టీకాల తయారీ కోసం అమెరికాకు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (డీఎఫ్‌సీ) నుంచి 50 మిలియన్ డాలర్ల సహాయంతో కార్బెవాక్స్ టీకాను తయారుచేసారు. వీటికి 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకు అత్యవసర వినియోగానికి జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) అనుమతి లభించింది.[3] జీనోమ్ వ్యాలీలో కూడా తన కార్యకలాపాలును ప్రారంభించింది.
చరిత్ర
[మార్చు]ఈ సంస్థను 1953లో డాక్టర్ డి.వి.కె. రాజు, జి.ఎ.ఎన్. రాజు కలిసి బయోలాజికల్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించారు. భారతదేశంలో బయోలాజికల్ ఉత్పత్తులను తయారు చేసిన మొదటి ప్రైవేట్ రంగ సంస్థలలో ఇది ఒకటి.[4] ఇది భారతదేశంలో హెపారిన్ ఉత్పత్తిని ముందుగా చేసింది.[5]
1960వ, 70వ దశకాలలో బయోలాజికల్ ఇ దగ్గు, డైజెస్టివ్ ఎంజైమ్‌లలో సూత్రీకరణల (formulations) ను అభివృద్ధి చేసింది. యాంటీ-టెటానస్ సీరమ్‌ను తయారు చేయడం ప్రారంభించింది. క్షయ వ్యాధి (Tuberculosis) కి మందులు, అలాగే టిటి, డిటిపి వ్యాక్సిన్‌లను కూడా మొదలుపెట్టింది.[6]
బయోలాజికల్ ఇ తక్కువ-ధర వ్యాక్సిన్‌ల తయారీలో ప్రఖ్యాతిగాంచింది. ఈ కంపెనీ 2008లో దాని ప్రధాన వ్యాక్సిన్ ఉత్పత్తి అయిన పెంటావాలెంట్ (DTP Hib HepB) తయారీని ప్రారంభించింది.[6] అంతర్జాతీయ అభివృద్ధి, సహాయ సంస్థలయిన డబ్ల్యూ.హెచ్.ఒ, యునిసెఫ్, బి.ఎమ్.జి.ఎఫ్ వంటి వాటికి బయోలాజికల్ ఇ వ్యాక్సిన్‌ల ప్రధాన సరఫరాదారు.[6]
కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి
[మార్చు]కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి సమయంలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్, డైనవాక్స్ టెక్నాలజీస్ లతో బయోలాజికల్ ఇ ఒప్పందం కుదుర్చుకుంది.[7][8] కార్బెవాక్స్[9] (Corbevax) /బయో ఇ కోవిడ్-19 వ్యాక్సిన్ 2021లో నెలకు 75 నుండి 80 మిలియన్ డోస్‌లను తయారు చేసింది. క్వాడ్ (Quadrilateral Security Dialogue) చొరవతో 2022 చివరి నాటికి ఒక బిలియన్ డోస్‌లకు ఉత్పత్తి చేరుకుంటుందని అంచనా వేసారు.[10][11] 2020 ఆగస్టులో ఈ కంపెనీ తన హైదరాబాదు ఫెసిలిటీ యూనిట్లో రెండో వ్యాక్సిన్ తయారు చేయడానికి జాన్సన్ & జాన్సన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.[12] 2021 ఫిబ్రవరిలో ఏటా 600 మిలియన్ డోస్‌ల సింగిల్-డోస్ జాన్సెన్ వ్యాక్సిన్ (Janssen COVID-19 vaccine) ను ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది.[13][14]
మూలాలు
[మార్చు]- ↑ "Hyderabad's Biological E: The Dark Horse In India's Vaccine Race". Forbes India (in ఇంగ్లీష్). Retrieved 24 May 2021.
- ↑ "Biological E cuts children's vaccine price by 30%". thehindubusinessline.com/. Retrieved 19 April 2013.
- ↑ "బయోలాజికల్-ఇ మరో రూ.1800 కోట్ల పెట్టుబడి". web.archive.org. 2022-07-25. Archived from the original on 2022-07-25. Retrieved 2022-07-25.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Biological E Limited" (PDF). icra.in. Retrieved 13 March 2012.
- ↑ "Setting up manufacturing facilities for Pneumococcal Conjugate Vaccine" (PDF). www.tdb.gov.in. Technology Development Board. Retrieved 25 April 2021. This article incorporates text from this source, which is in the public domain.
- ↑ 6.0 6.1 6.2 "Setting up manufacturing facilities for Pneumococcal Conjugate Vaccine" (PDF). www.tdb.gov.in. Technology Development Board. Retrieved 25 April 2021. This article incorporates text from this source, which is in the public domain.
- ↑ Leo, Leroy (16 November 2020). "Biological E initiates human trials of vaccine". mint.
- ↑ "Coronavirus | Biological E. inks pacts with Johnson & Johnson, Baylor College of Medicine on vaccine". The Hindu (in Indian English). 13 August 2020. Retrieved 21 March 2021.
- ↑ Bharadwaj, Swati (3 June 2021). "Bio E to get Rs 1,500 crore advance from government to reserve 30 crore doses of Corbevax". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 3 June 2021. Retrieved 2021-06-03.
- ↑ "Meet Bio E: India's Oldest Private Vaccine Maker Making 1 Billion Covid Doses". IndiaTimes (in Indian English). 2021-05-02. Retrieved 24 May 2021.
- ↑ "Biological E covid vaccine: Biological E set for Covid vaccine rollout by August". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 24 May 2021.
- ↑ "Biological E to manufacture Janssen's Covid-19 vaccine". www.pharmaceutical-technology.com. Retrieved 24 May 2021.
- ↑ "Biological E looking to make 600 million Johnson and Johnson vaccine shots a year". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 21 March 2021.
- ↑ Leo, Leroy (20 March 2021). "Biological E: The mass producer of Johnson & Johnson vaccine". mint (in ఇంగ్లీష్). Retrieved 21 March 2021.