బరాక్-1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బరాక్ I
బరాక్ 1
రకంతక్కువ పరిధి భూమి నుండి గాల్లోకి క్షిపణి
అభివృద్ధి చేసిన దేశంఇజ్రాయిల్
ఉత్పత్తి చరిత్ర
తయారీదారుIsrael Aerospace Industries &
Rafael Advanced Defense Systems
విశిష్టతలు
బరువు98 కి.గ్రా.[1]
పొడవు2.1 మీ.[1]
వ్యాసం170 మి.మీ.[1]
వార్‌హెడ్22 కి.గ్రా.[1] శకలాలతో కూడిన వార్‌హెడ్
పేలుడు
మెకానిజమ్
ప్రాక్సిమిటీ ఫ్యూజు[1]

వింగ్‌స్పాన్685 మి.మీ.[1]
ఆపరేషను
పరిధి
0.5-12 కి.మీ.[1]
ఫ్లైటు ఎత్తు5.5 కి.మీ.[1]
వేగంమ్యాక్ 2.1 (720 m/s)[1]
గైడెన్స్
వ్యవస్థ
Radar CLOS guidance
లాంచి
ప్లాట్‌ఫారం
Surface Ship

బరాక్ (హీబ్రూలో మెరుపు అని అర్థం) ఇజ్రాయిల్ అబివృద్ధి చేసిన భూమి నుండి గాల్లోకి ప్రయోగించే క్షిపణి. ఇది విమానాలు, నౌకావ్యతిరేక క్షిపణులు, మానవరహిత ఆకాశ వాహనాలకు వ్యతిరేకంగా నౌకలనుండి ప్రయోగించే క్షిపణి.

స్థూలంగా

[మార్చు]

నౌకలకు అతి దగ్గరగా వచ్చిన దాడిని ఎదుర్కొనే ఆయుధ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, దాని స్థానంలో ఉపయోగించేందుకూ బరాక్-1 క్షిపణిని రూపొందించారు.ఈ క్షిపణులను 8 సెళ్ళ కంటెయినరులో ఉంచి, నిట్టనిలువుగా పైకి ప్రయోగిస్తారు. దీని C3I రాడారు వ్యవస్థ 360-డిగ్రీల కవరేజి ఇస్తుంది. నౌకకు 500 మీ. దగ్గరగా వచ్చిన శత్రు క్షిపణిని కూడా ఇది కూల్చగలదు. ఒక్కో బరాక్ వ్యవస్థ వెల $2.4 కోట్లు. విమానాలు, క్షిపణులతో పాటు అలల్ని రాసుకుంటూ దూసుకొచ్చే క్షిపణులను కూడ ఇది కూల్చగలదు.[2]

వివాదం

[మార్చు]

భారత్ బరాక్-1 కొనుగోలు అవినీతి, అధిక ధరల కారణంగా వివాదాస్పదమైంది. ఆరోపణలపై 2006 లో సీబీఐ విచారణ జరిపి అనేక మందిని అరెస్టు చేసింది. 2013 నాటికి అగు సాక్ష్యాల లేమి కారణంగా దర్యాప్తు అసంపూర్తిగానే ఉంది. కేసును మూసివేసే స్థాయికి చేరుకుంది..[2][3] 2013 డిసెంబరు 23 న రక్షణ కొనుగోళ్ళ మండలి  రు. 880 కోట్ల విలువైన 262 బరాక్-1 క్షిపణుల కొనుగోలుకు ఆమోదముద్ర వేసింది.[4]

ఆపరేటర్లు

[మార్చు]
బరాక్-1 ను వాడుతున్న దేశాలు - నీలంరంగులో

వాడుతున్న దేశాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "Barak missile" (PDF). Rafael.co.il. Archived from the original (PDF) on 2012-02-29. Retrieved 2012-11-18.
  2. 2.0 2.1 "Dubious deal". The Hindu. Retrieved 22 December 2013.[permanent dead link]
  3. "Israel rejects bribery charge, Barak missile probe may end". The Hindustan Times. 21 December 2013. Archived from the original on 21 డిసెంబరు 2013. Retrieved 22 December 2013.
  4. 4.0 4.1 "Defence ministry finally clears Barak missile deal with Israel". The Times of India. 23 December 2013. Retrieved 23 December 2013.
  5. "Four major acquisitions for the Navy and the Army approved". The Hindu. 24 December 2013. Retrieved 24 December 2013.

బయటి లింకులు

[మార్చు]
బరాక్-1 క్షిపణిని ప్రయోగిస్తున్న RSS Vengeance
"https://te.wikipedia.org/w/index.php?title=బరాక్-1&oldid=3891282" నుండి వెలికితీశారు