బలవర్ధక బియ్యం
బలవర్ధక బియ్యం లేదా కృత్రిమ బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) ( fortified rice) అనేది సాధారణ బియ్యంతో కూడా కొన్ని పోషకాలను జోడించి తయారుచేయబడిన బియ్యం. దీన్ని సాధారణ అన్నంలానే వండుకోవచ్చు తినవచ్చు, అయితే దీనిని కొందరు కొందరు ప్లాస్టిక్ రైస్ అని మరికొందరు కల్తీలు జరుగుతున్నట్టు అపోహ పడుతున్నారు.[1] ఈ పోషకాలు సాధారణంగా ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు. బలవర్ధక బియ్యం తయారు చేయడానికి అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. ఒక సాధారణ పద్ధతిలో, బియ్యాన్ని ఉడికించే ముందు దానికి పోషకాలు జోడించబడతాయి. మరొక పద్ధతిలో, బియ్యాన్ని ఉడికించిన తర్వాత దానికి పోషకాలు జోడించబడతాయి.బలవర్ధక బియ్యం అన్ని వయసులవారికి మంచి ఆరోగ్యకరమైన ఆహారం. ఇది పిల్లలకు, వృద్ధులకు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది.[2] భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ బలవర్ధక బియ్యాన్ని కొన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నది.[3] పోర్టిఫైడ్ బియ్యాన్ని నిల్వ చేసేటప్పుడు అట్టి గదిలో నీరు గానీ, చెమ్మగాని ఉండకుండా చూడాలి, లేకపోతే ఈ బియ్యములో ఉన్న మినరల్స్‌తో కూడిన పోషకాల వలన బూజు పట్టే అవకాశం ఉండవచ్చు.[4]
బలవర్ధక బియ్యం అనేక రకాల పోషకాలను అందిస్తుంది. ఇది ప్రోటీన్ కోసం మంచి మూలం, ఇది కండరాల నిర్మాణం, మరమ్మత్తులో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది..[4] పోషకాహార లోపాన్ని నివారించడానికి ఒక ప్రభావవంతమైన మార్గం.
తయారీ ప్రక్రియ
[మార్చు]బియ్యంలో పోషక విలువను పెంచడానికి విటమిన్లు, ఖనిజాలను జత చేసే ప్రక్రియను బలవర్ధకం (Fortification) అంటారు. విరిగిన బియ్యం లేదా ఇతర పదార్ధాలను బియ్యం ఆకారంలో ఉండే గుళికలుగా మార్చేందుకు వీలు కల్పించే బియ్యం తయారీ యంత్రాలు ఉన్నాయి. భారతదేశంలో పంపిణీ చేయబడే బలవర్ధక బియ్యం తయారీ ప్రక్రియలో ప్రధానంగా రెండు దశలు ఉన్నాయి:
మొదటి దశ బియ్యాన్ని పిండి చేయడం
మొదట బియ్యాన్ని శుభ్రం చేసి, నీటిలో నానబెట్టి, తర్వాత తొక్క తీసివేస్తారు. తరువాత, బియ్యాన్ని పిండిగా మార్చుతారు. ఈ పిండిని "బియ్యపు పిండి" అంటారు.
రెండవ దశ బియ్యపు పిండిలో విటమిన్లు, ఖనిజాలను కలపడం
ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ) ఆమోదించిన మోతాదులో విటమిన్లు, ఖనిజాలను బియ్యపు పిండిలో కలపడం జరుగుతుంది. ఈ విటమిన్లు, ఖనిజాలు ముఖ్యంగా ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ బి12, విటమిన్ డి మొదలైనవి.
ఈ రెండు దశలను పూర్తి చేసిన తర్వాత, బియ్యపు పిండిని మళ్లీ గింజలుగా మార్చుతారు. ఈ గింజలే బలవర్ధక బియ్యం.
మూలాలు
[మార్చు]- ↑ "ప్రజలందరికీ బలవర్ధక బియ్యం". Sakshi. 2023-10-08. Retrieved 2023-10-30.
- ↑ ABN (2023-04-01). "'రేషన్'పై బలవర్ధక బియ్యం". Andhrajyothy Telugu News. Retrieved 2023-10-30.
- ↑ "బలవర్ధక బియ్యం..ఆరోగ్య భారతం". EENADU. Retrieved 2023-10-30.
- ↑ 4.0 4.1 Chary, Anil (2023-07-06). "పోర్టిఫైడ్ రైస్ బలవర్ధక బియ్యం". Mana Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-10-30.