బల్లికురవ మండలం రామాంజనేయపురం గ్రామం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామాంజనేయపురం అనేపేరుతో తెలుగు రాష్ట్రాల్లో వందలాది గ్రామాలున్నాయి . అయితే, ఇక్కడ మనం చెప్పుకునే రామాంజనేయపురం ఉమ్మడి ప్రకాశం జిల్లా.. ఇప్పటి బాపట్ల జిల్లాలోని బల్లికురవ మండలానికి చెందిన గ్రామం .

ఈ గ్రామానికి మారాబత్తుని ఆంజనేయులు ( మాజీ సర్పంచ్ ) గారు బీజం వేశారు .

దాదాపు 350 సంవత్సరాల క్రితం బేస్తవారిపేట తాలూకాలోని ఏక్ నామ్ పేట (నేకునాంబాద్) గ్రామం నుంచి ముక్తేశ్వరానికి వలస వచ్చిన మారాబత్తుని వారాధి గారి మునిమనవడు అయిన మారాబత్తుని వెంకయ్య గారి మునిమనవడే ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారి తండ్రిపేరు కూడా వెంకయ్యే.

రామాంజనేయపురం గ్రామంలో మారాబత్తుని వెంకట రమణయ్య గారి ఏకైక కుమారుడు మారాబత్తుని శ్రీనివాసరావు గారికి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి మారాబత్తుని ప్రసన్నబాబు ( అలియాస్ ప్రసన్నకిషోర్ రంగా), చిన్నబ్బాయి బ్రహ్మనాయుడు. వీరిద్దరూ మీడియా రంగంలో పేరుగాంచారు .  

రామాంజనేయపురం గ్రామం చుట్టుపక్కల కొండలే ఉంటాయి . బొగ్గులకొండ, దొడ్డికొండ, ఎర్రగొండ, ఊరగొండ పెద్ద కొండలు కాగా... మిగతా చిన్నచిన్న కొండలు కూడా గ్రామం చుట్టూ ఉన్నాయి .

దొడ్డి కొండపై 700 ఏండ్ల క్రితం విద్యల భాస్కరరావు కట్టిన శివాలయం ఉంది .

రామాంజనేయపురం గ్రామాన్ని ముక్తేశ్వరం పంచాయతీ నుంచి వేరుచేసి , ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలాకాలం నుంచి వినిపిస్తోంది .

రామాంజనేయపురానికి చుట్టుపక్కల బూసావారిపాలెం, మక్కెనవారిపాలెం, కొమ్మాలపాడు, గుడిపాడు కాలనీ గ్రామాలు ఉన్నాయి .

రామాంజనేయపురం గ్రామంలో నాలుగున్నర దశాబ్దాలక్రితం మారాబత్తుని కోటిలింగం గారి జ్ఞాపకార్థం.. ఆయన సతీమణి మారాబత్తుని వెంకటకోటమ్మ గారు ఆరోజుల్లోనే తొమ్మిది ఎకరాల పొలం అమ్మేసి, సత్రం కట్టించారు .

యాచకులకు, వూరూరా తిరిగి నాటకాలు వేసుకునేవారికీ, ఎందరో అభాగ్యులకు ఎన్నో ఏళ్లపాటు ఆ సత్రం ఆశ్రయం ఇవ్వగా... తదనంతర కాలంలో శిథిలావస్థకు చేరుకుంది .

అయితే, మారాబత్తుని లక్ష్మీకృపయ్య గారి పెద్ద కుమారుడు మారాబత్తుని ఆంజనేయులు గారు సత్రాన్ని మళ్ళీ బాగు చేయించి  , సత్రం ఎదురుగా ఉన్న రావిచెట్టుకు అరుగు కట్టించి ,  దాన్నొక రచ్చబండలా తీర్చిదిద్దారు .

ముచ్చట్లకు అడ్డాగా ఆ అరుగు మారిపోయింది .

మారాబత్తుని వెంకట రమణయ్య గారు, మారాబత్తుని అనంత పద్మనాభయ్య గారు ఇద్దరూ గజబలులు. ఆ ఇద్దరూ ఇప్పుడు లేరు.