బల్ల సరస్వతి
స్వరూపం
బల్ల సరస్వతి | |
---|---|
జననం | 1941, ఏప్రిల్ 4 లద్దునూరు, జనగామ జిల్లా, తెలంగాణ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయురాలు |
జీవిత భాగస్వామి | సోమయ్య |
పిల్లలు | నలుగురు పిల్లలు |
తల్లిదండ్రులు |
|
బల్ల సరస్వతి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రచయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయురాలు. కలెనేత పేరుతో తన ఆత్మకథను పుస్తకంగా తీసుకువచ్చింది.[1] ఆత్మకథలు రాసిన ఇద్దరు తెలుగు మహిళ రచయితల్లో సరస్వతి ఒకరు.[2]
జననం, విద్య
[మార్చు]సరస్వతి 1941 ఏప్రిల్ 4న పాశికంటి రామదాసు - లక్ష్మమ్మ దంపతులకు జనగాం జిల్లాలోని లద్దునూరు గ్రామంలో జన్మించింది.[3] 1957లో ఓల్డ్ సెవెంత్ పాసై, 1958లో టీచర్ ట్రైనింగ్ వెళ్ళింది. 1967 హెచ్.ఎస్.సీ., ఆ తరువాత పియూసి, సెకండరీ టీచర్ ట్రైనింగ్, బి.ఏ. డిగ్రీ, 1984లో బిఇడీ పూర్తిచేసింది.[4]
ఉద్యోగం
[మార్చు]1961లో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరి, 1999లో ఉద్యోగ విరమణ చేసింది.
కుటుంబం
[మార్చు]1958లో బల్ల సోమయ్యతో సరస్వతి వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు, ఏడుగురు మనవళ్ళు మనవరాళ్ళు, ఒక మునిమనవరాలు.
రచనలు
[మార్చు]- కలెనేత (ఆత్మ కథ): ఏడుతరాల తలపోత (03.04.2022)[5]
మూలాలు
[మార్చు]- ↑ "సామాజిక మార్పుల సమాహారమే ఏడు తరాల తలపోత". EENADU. 2022-04-04. Archived from the original on 2022-04-03. Retrieved 2022-12-31.
- ↑ ABN (2022-12-29). "వంశవృక్షాన్ని, వారి వృత్తుల్ని రచనలో చెప్పుకురావడం ఆమెకే సాధ్యమైంది..!". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-12-29. Retrieved 2022-12-31.
- ↑ "ఒక తరపు పోరాట గాథ". Sakshi. 2022-04-03. Archived from the original on 2022-04-27. Retrieved 2022-12-31.
- ↑ Desk, Teluputv (2022-06-09). "ఆత్మకథ : కలెనేత -ఇది అచ్చమైన 'ఏడుతరాల తలపోత' - దుర్గం రవిందర్". Telupu TV - Telugu News. Archived from the original on 2022-06-09. Retrieved 2022-12-31.
- ↑ "Kalenetha Book". www.amazon.in. 2022-12-31. Archived from the original on 2022-12-31. Retrieved 2022-12-31.