బహుముఖం
బహుముఖం 2024లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.[1] హర్షివ్ కార్తీక్ కథానాయకుడుగా స్వీయ దర్శకత్వంలో క్రిస్టల్ మౌంటెన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన బహుముఖం చిత్రం 2024 ఏప్రిల్ 5న విడుదలైంది. హర్షివ్ కార్తీక్, స్వర్ణిమ సింగ్, మరియా మార్టినోవా ప్రధాన పాత్రల్లో నటించిన బహుముఖం చిత్రం సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్, ఇది USAలోని జార్జియా పరిసరాల్లోని అనేక ప్రదేశాలలో రూపొందించబడింది. [2] [3] [4]
కథ
[మార్చు]తన్వీర్ వాళ్ళది అమెరికాలో స్థిరపడిన ఫ్యామిలీ. తన్వీర్ వాళ్ళ అమ్మకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ యాక్టర్ కాలేకపోతుంది. దీంతో తల్లి కలని తాను నిజం చేయాలని చిన్నప్పుడే ఫిక్స్ అవుతాడు తన్వీర్. అయితే అనుకోకుండా జైలుకి వెళ్లి కొన్ని సంవత్సరాల తర్వాత బయటకి వస్తాడు. బయటకి వచ్చాక నటుడు అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన్వీర్ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొడతాయి. జైలు నుంచి బయటకు రావడంతో అతనికి ఓ కౌన్సిలర్ కూడా ఉంటుంది. ఓ సారి సైకో పాత్ర ఆడిషన్ ఇస్తే సరిగ్గా చేయలేదని విమర్శిస్తారు. దీంతో అతను ఎలాగైనా ఆ పాత్రని బాగా చేయాలని, మంచి నటుడు అవ్వాలని బాధపడుతూ, దానికోసం నిజమైన సైకోలా మారిపోయి హత్యలు చేస్తాడు. అసలు తన్వీర్ జైలుకి ఎందుకు వెళ్ళాడు? తన్వీర్ ఎందుకు సైకోలా మారిపోయాడు? అతను నటుడు అయ్యాడా? అనేవి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
నటీనటులు
[మార్చు]- హర్షివ్ కార్తీక్[5]
- స్వర్ణిమ సింగ్
- మరియా మార్టినోవా
- వివాన్ లాలం
- రఘు
- వీ భక్త
- వంశీ హరి
- రవి అవిరినేని
- డేనియల్ కర్రై
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: క్రిస్టల్ మౌంటెన్ ప్రొడక్షన్స్
- నిర్మాత: హర్షివ్ కార్తీక్[6]
- సహ నిర్మాత: అరవింద్ రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హర్షివ్ కార్తీక్
- సంగీతం: ఫణి కల్యాణ్
- సినిమాటోగ్రఫీ: ల్యూక్ ఫ్లెచర్
- మాటలు: రామస్వామి, హర్షివ్ కార్తీక్
- బ్యాగ్రౌండ్ స్కోర్: శ్రీ చరణ్ పాకాల
- ఎడిటింగ్: హర్షివ్ కార్తీక్, గ్యారీ బీహెచ్
సంగీతం
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "వశమయేన" | కిట్టు విస్సాప్రగడ | యశస్వి కొండేపూడి, సనా మొయిదుట్టి | 4:42 |
2. | "చిరునామ" | రామ్ మనోహర్ కడిమిచర్ల | ఫణి కళ్యాణ్ | 2:06 |
3. | "రాధా గోపాల" | రామ్ మనోహర్ కడిమిచర్ల | అదితి భావరాజు, హైమత్ మహమ్మద్ | 1:47 |
మూలాలు
[మార్చు]- ↑ NT News (25 February 2024). "సస్పెన్స్ థ్రిల్లర్ 'బహుముఖం'". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ Chitrajyothy (24 February 2024). "'బహుముఖం' మూవీ టీజర్". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ V6 Velugu (22 March 2024). "నువ్వు పెయిన్ కిల్లర్వి కాదు,సైకో కిల్లర్వి..విలక్షణమైన బహుముఖం". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Chitrajyothy (27 March 2024). "ఈ వారం థియేటర్లలోకి వస్తున్న సినిమాలివే.. అందరి ఎదురుచూపు దాని కోసమే! | These movies are hitting the theaters this March Last week ktr". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ A. B. P. Desam (28 January 2024). "అమెరికాలో తీసిన 100 పర్సెంట్ పక్కా తెలుగు సినిమా". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ Chitrajyothy (2 April 2024). "ఆడిషన్‌కు వెళ్లిన మానసిక రోగికి.. అవమానం జరిగితే? ఎంతవరకూ వెళ్తాడనేదే ఈ సినిమా | Bahumukham Movie Actor Director HarShiv Karthik Special Interview ktr". Archived from the original on 29 April 2024. Retrieved 29 April 2024.