బాన్పో వంతెన

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బాన్పో బ్రిడ్జ్
반포대교
దేనిపై నిర్మింపబడినది హాన్ నది (కొరియా)
ప్రదేశం సియోల్, దక్షిణ కొరియా
నిర్వహించువారు సియోల్ మెట్రోపాలిటన్ హంగాంగ్ ప్రాజెక్ట్ హెడ్‌క్వార్టర్స్
సాంకేతిక నమూనా దే హాన్ కన్సల్టెంట్స్ కంపెనీ, లిమిటెడ్.
మొత్తం పొడవు 1,495 m (4,905 ft)[1]
వెడల్పు 25 m (82 ft)[1]
నిర్మించినవారు బ్యుక్‌సన్ ఇంజనీరింగ్ & కన్స్ట్రక్షన్ కంపెనీ, లిమిటెడ్.[2]
నిర్మాణ ప్రారంభం జనవరి 11, 1980[2]
నిర్మాణం పూర్తి జూన్ 25, 1982[2]
నిర్మాణ వ్యయం 21.5[2]
రోజువారీ రద్దీ 103,925 (2009)[3]
Preceded by హన్నం బ్రిడ్జ్
Followed by డాంగ్‌జాక్ బ్రిడ్జ్
భౌగోళికాంశాలు 37°30′56″N 126°59′46″E / 37.5155°N 126.9960°E / 37.5155; 126.9960Coordinates: 37°30′56″N 126°59′46″E / 37.5155°N 126.9960°E / 37.5155; 126.9960

బాన్పో వంతెన (కొరియన్: 반포대교; హంజా: 盤浦大橋) అనునది దక్షిణ కొరియా దిగువ సియోల్ లో హాన్ నది మీద సియోచో మరియు యోన్గ్సన్ జిల్లాలను కలిపే ఒక ప్రధాన వంతెన. డబుల్ డెక్ వంతెన యొక్క ఎగువ భాగంలో రూపొందించబడిన ఈ బ్రిడ్జి జమ్స్ బ్రిడ్జి పైన ఉంటుంది, ఇది దక్షిణ కొరియా లో నిర్మించబడిన మొట్టమొదది డబుల్ డెక్ వంతెన. అధిక వర్షపాత కాలంలో నీటిమట్టం పెరిగినపుడు నీటి మట్టానికి దగ్గరగా ఉన్న దిగువ డెక్ జమ్స్ వంతెన ముంపునకు గురయ్యేలా రూపొందించబడింది. ఇనుప దూలము వంతెనలా నిర్మించిన ఈ వంతెన 1982లో పూర్తయింది.

మూన్‌లైట్ రెయిన్‌బో ఫౌంటెయిన్[మార్చు]

సియోల్‌లోని హన్ నది మీద నిర్మించిన బాన్పో వంతెనకు ఇరువైపులా ఏర్పాటు చేసిన "మూన్‌లైట్ రెయిన్‌బో ఫౌంటెయిన్" 1140 మీటర్ల పొడవు ఉంటుంది. దీని పొడవునా అమర్చిన పదివేల ఎల్‌ఇడి బల్బులతో కూడిన రంధ్రాల నుంచి నిమిషానికి 190 టన్నుల నీరు వంతెన నుంచి 43 మీటర్ల దూరానికి చిమ్మబడుతూ పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. ఈ బ్రిడ్జి ఫౌంటెయిన్ ప్రపంచంలో పొడవైన ఫౌంటెయిన్ బ్రిడ్జిగా గిన్నిస్ బుక్‌ లోకి ఎక్కింది.

మూలాలు[మార్చు]

  • ఈనాడు ఆదివారం - 13-07-2014 నాటి వెనుక పేజి