Jump to content

బాపట్ల పట్టణాభివృద్థి సంస్థ

వికీపీడియా నుండి
బాపట్ల పట్టణాభివృద్థి సంస్థ
పల్నాడు పట్టణాభివృద్థి సంస్థ (BAUDA)
సంస్థ వివరాలు
స్థాపన 2022 డిసెంబరు 26
అధికార పరిధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రధానకార్యాలయం బాపట్ల
15°54′N 80°28′E / 15.90°N 80.46°E / 15.90; 80.46
Parent agency ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

బాపట్ల పట్టణాభివృద్థి సంస్థ, ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ యాక్ట్, 2016 (చట్టం నం.5 2016), సెక్షన్ 3లోని సబ్-సెక్షన్ (1) ద్వారా అమలులో ఉన్న అధికారాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థ (BAUDA) ఏర్పడింది. బాపట్ల పట్టణ అభివృద్ధి సంస్థ (BAUDA) ప్రధాన పరిపాలనా కేంద్రం బాపట్ల. 2022 డిసెంబరు 26 నుండి ఇది అమలులోకి వచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ జారీచేసింది.[1]

సంస్థ లక్ష్యాలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 భాగంగా బాపట్ల ప్రధాన కేంద్రంగా, బాపట్ల జిల్లా కొత్తగా ఏర్పడింది.[2][3] ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాబివృద్ధి సంస్థ ద్వారా పరిశ్రమలు, ఎగుమతులు, దిగుమతులు ఇతర అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్నిదృష్టిలో పెట్టుకుని వాటిని గుర్తించి పరిగణనలోకి తీసుకుంటుంది. దానిద్వారా ప్రత్యేకంగా ఆశించినంత వృద్ధిని సాధిస్తుంది.

కొన్ని ముఖ్యమైన లక్ష్యాలు

[మార్చు]
  • వివిధ ఆదాయ వర్గాలకు ఇళ్లు, ప్లాట్లు కేటాయించడం.
  • నగరం, చుట్టుపక్కల పట్టణాల అభివృద్ధిని నియంత్రించడం, పర్యవేక్షించడం.
  • పట్టణంలో కొత్త రోడ్లు వేయడం, రోడ్ల విస్తరణ పథకాలు అమలు చేయడం.
  • ఉద్యానవనాలు, క్రీడలు వంటి వినోద సౌకర్యాలను నిర్మించడం స్టేడియంలు, గ్యాలరీలు.
  • సమాజంలోని బలహీన వర్గాలకు మురికివాడల పునరావాసం వంటి గృహనిర్మాణ ప్రాజెక్టులను అమలు చేయడం.
  • మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్ (జెడ్‌పి) రూపొందించడం.

పట్టణాభివృద్థి సంస్థ అధికార పరిధి

[మార్చు]

బాపట్ల పట్టణాభివృద్థి సంస్థ 1864.09 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణములో, 8,70,074 మంది జనాభా కలిగి ఉంది.బాపట్ల పట్టణాభివృద్థి సంస్థ పరిధిలో బాపట్ల జిల్లాలోని 14 మండలాల్లోని 163 గ్రామాలు, 2 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం బాపట్ల.[4][5]

పట్టణాభివృద్థి సంస్థ పరిధి లోని ప్రాంతాలు

[మార్చు]

దిగువ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా గ్రామాలు, ప్రాంతాలు ఈ చట్టం ప్రయోజనం కోసం పట్టణాభివృద్ధి ప్రాంతంగా ఉంటుంది.ఈ ప్రాంతం బాపట్ల అభివృద్ధి ప్రాంతం (BAUDA)గా వ్యవహరిస్తారు.[6]

మూలాలు

[మార్చు]
  1. Government of Andhra Pradesh (2022-12-26). Andhra Pradesh Gazette, 2022-12-26, Extraordinary, Part PART I, Number 3363.
  2. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  3. telugu, NT News (2022-04-03). "ఏపీలో కొత్త జిల్లాలు.. గెజిట్‌ విడుదల చేసిన ప్రభుత్వం". Namasthe Telangana. Retrieved 2022-09-06.
  4. https://ia904705.us.archive.org/15/items/in.gazette.andhra.2022-12-26.17592/17592.pdf
  5. "14 మండలాలు.. 163 గ్రామాలు". web.archive.org. 2023-01-05. Archived from the original on 2023-01-05. Retrieved 2023-01-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. Government of Andhra Pradesh (2022-12-26). Andhra Pradesh Gazette, 2022-12-26, Extraordinary, Part PART I, Number 3363.

వెలుపలి లంకెలు

[మార్చు]