బాపట్ల హనుమంతరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాపట్ల హనుమంతరావు తెలుగు రచయిత. అతను షిర్డీ సాయిబాబా భక్తుడు. బాబాపై అనేక రచనలు చేసాడు. అందులో "ఏమి నిన్నుపేక్షింతునా? (శ్రీ సాయిబాబా చరిత్రము - భక్తుల వృత్తాంతములు)" ముఖ్యమైనది[1].

జీవిత విశేషాలు[మార్చు]

అతను 1902, సెప్టెంబరు 14న చెన్నపున్నమ్మ, వీరయ్య దంపతులకు బాపట్లలో జన్మించాడు. అతని తల్లి సంస్కృతాంధ్ర భాషలలో నైపుణ్యం గలిగినది. అతను తన తల్లి వద్ద నుంచి ప్రాచీన సంస్కృత వాజ్ఞ్మయము, పురాణేతిహాసాలను నేర్చుకున్నాడు. స్థానికంగా సెకండరీ విద్యనభ్యసించిన తరువాత అతను "ఉభయ భాషాప్రవీణ" కోర్సును పూర్తిచేసాడు. తరువాత సంస్కృత భాషలోని గ్రంథాలను తెలుగు లోనికి అనువదించటం ప్రారంభించాడు. 22 సంవత్సరముల వయస్సులో శ్రీ వేదవ్యాసుని "భగవద్గీత"ను సరళమైన తెలుగు పద్యాలుగా అనువదించి పండితుల ప్రశంసలందుకున్నారు. అతను చిన్నగంజాం గ్రామములో జిల్లా పరిషత్ హైస్కూల్ లో తెలుగు పండితునిగా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు.[2] అతను శ్రీ సాయిబాబా ఫై పలు రచనలు చేసి, కొన్నిటిని ప్రచురించి, భక్తులకు పంచి పెట్టిరి. ఆయన వ్రాసిన "ఏమీ!నిన్నుపేక్షింతునా!" (శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర -, భక్తుల అనుభవములు ) అను పుస్తకము, ఆంధ్రదేశములో శ్రీ సాయిబాబా వారి గురించి విస్తృత ప్రచారమునకు నాందిగా ఆవిష్కృతమయినది. అతను 1973 నవంబరు 7 న మరణించాడు.

అనువాదాలు[మార్చు]

 • శ్రీ ఆది శంకరాచార్యులవారి - ప్రభోధసుధాకరము
 • భజగోవిందము
 • శ్రీ నిగమాంతదేశికులవారి - శ్రీనివాస దయాశతకము
 • పాదుకా సహస్రము
 • శ్రీ లీలాశుకులవారి - శ్రీకృష్ణకర్ణామృతము
 • నారద భక్తిసూత్రములు (ప్రేమామృతము)

రచనలు[3][మార్చు]

 • ప్రేమామృతము
 • సాయి మననము[4]
 • సాయిబాబా పూజాస్తవములు
 • హనుమాన్ చాలీసా
 • వేంకటేశ్వర సుప్రభాత గీతములు వివరణ
 • ఆపదుద్ధారక శతకము
 • సాయి సుభాషితములు[5]
 • శ్రీ సాయి మననము[6]
 • సాయి కరుణ
 • సాయిబాబా కూడా దేవుడేనా ?[7]
 • సాయినాథ భోధామృతము[8]
 • ఏమీ, నిన్నుపేక్షింతునా-సాయిబాబా భక్తుల వృత్తాంతములు-4[9]
 • శ్రీభగవధ్గీతామృతం[10]

మూలాలు[మార్చు]

 1. బాపట్ల హనుమంతరావు (1976). ఏమి నిన్నుపేక్షింతునా? (శ్రీ సాయిబాబా చరిత్రము - భక్తుల వృత్తాంతములు) చతుర్థ సంపుటము.
 2. "శ్రీ హనుమ సాయి కుటీరమ్ ట్రస్ట్ - శ్రీ షిర్డీ సాయిబాబా మందిరము". www.srihanumasaikuteeram.org. Archived from the original on 2020-04-07. Retrieved 2020-04-07.
 3. "ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ (విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య) | Free Gurukul Education Foundation (Values,Skills Based Education)". www.freegurukul.org. Retrieved 2020-04-07.
 4. Sri Bapatla Hanumantha Rao Garu (1958). Sri Sai Mananamu (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)
 5. Bapatla Hanumantha Rao (1979). Sri Sai Subhashitamulu (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)
 6. Bapatla Hanumantha Rao (1953). Srisai Mananam (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)
 7. Baptla Hanumatharao (1960). Saibaba Kuda Devudena? (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)
 8. Sri Bapatla Hanumantha Rao (1968). Sri Sainadha Bodhamrutam (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)
 9. Baba, Sai. "బాపట్ల హనుమంతరావుగారి జీవితములో కొన్ని సంఘటనలు 1 – Sai Baba Leelas" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-04-07.
 10. Baptla Hanumantharao (1929). Srimadbagvathgithamrutham (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)

బాహ్య లంకెలు[మార్చు]