Jump to content

బాపు నవరసమాలిక

వికీపీడియా నుండి

బాపు నవరసమాలిక, కూర్పు:జి.వల్లీశ్వర్.ఏప్రిల్, 2024. ప్రచురణ కర్త: -ఎమెస్కో విజయకుమార్. బాపు సోదరుడు, భాగస్వామి కొల్లా సుధీర్ కుమార్, ఉమామహేశ్వరి దంపతుల కుమార్తె అరవింద్ వివాహం 4-4-24న జరిగిన సందర్భంగా ఈ చిన్న పొత్తం బాపు రంగుల బొమ్మలతో ప్రచురిం చబడింది. తొమ్మిది రసాలు, తొమ్మిది రంగులు బొమ్మలు. ప్రతి చిత్రానికి ఒక పుట నిండుగా వివరణ. నూతన దంపతులకు ఈ బొమ్మల పుస్తకం గొప్ప స్ఫూర్తినిస్తుందని, మానవజీవితం నవరసాలతో నిండినదని, ఏ రసం ఎప్పుడు మనసును ఆవరిస్తుందో తెలియదని, మనసుకు ఆనందం కలిగించే రసం ఆవరించినపుడు, ఉక్కిరిబిక్కిరి ఆవుతామని, శోకాన్ని కలిగించేదయితే, తల్లడిల్లిపోతామని, రౌద్రం వంటి రసానికి లొంగిపోతే అది మన జీవితాలను మార్చేస్తుందని, ఈ సూత్రాన్ని గ్రహించి మసలుకొనే దంపతులకు జీవితం ఎప్పుడూ చల్లని వెన్నెలలా ఉంటుందని ఈ చిన్న పుస్తకం ద్వారా సందేశం ఇస్తూ, విజయకుమార్ దీన్ని ప్రచురించి వివాహ ఆహ్వానంతోపాటు పంపించారు. ఇది ఎమెస్కో ప్రచురణ.2024.