బాబు గేను సైద్
బాబు గేను సైద్ | |
---|---|
జననం | 1908 జనవరి 1 మహారాష్ట్ర, పూణే జిల్లా, అంబెగావ్ తాలూకా |
మరణం | 1930 డిసెంబరు 12Bombay, British India | (వయసు 22)
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | బాబు గేను |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారత స్వాతంత్ర్యోద్యమం |
బాబు గేను సైద్ (1908 జనవరి 1 – 1930 డిసెంబర్ 12) ముంబైలో ఒక మిల్లు కార్మికుడు. భారతీయ వస్త్రాల వ్యాపారానికి గండి కొట్టే బ్రిటిష్ వస్తువులు, బట్టల అక్రమ వాణిజ్యానికి వ్యతిరేకంగా నిరసన చేసాడు.
బాబు గేను సైద్ మహాలుంగే పద్వాల్‌లోని ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు; అతను బొంబాయిలోని ఒక కాటన్ మిల్లులో పని చేసేవాడు. విదేశీ వస్త్రం దిగుమతికి వ్యతిరేకంగా భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారులు నిర్వహించిన నిరసనల్లో అతను చురుగ్గా పాల్గొన్నాడు.
1930 డిసెంబర్ 12 న, మాంచెస్టర్‌కి చెందిన జార్జ్ ఫ్రేజియర్ అనే బట్టల వ్యాపారి ఫోర్ట్ ప్రాంతంలో పాత హనుమాన్ గల్లీలోని తన దుకాణం నుండి ముంబాయి పోర్టుకు అనేక విదేశీ దుస్తులను తరలిస్తున్నాడు. అతని అభ్యర్థన మేరకు అతనికి పోలీసు రక్షణ నిచ్చారు. ట్రక్కును తరలించవద్దని కార్యకర్తలు వేడుకున్నారు, కాని పోలీసులు నిరసనకారులను పక్కకు నెట్టేసి, ట్రక్కును కదిలించారు. కల్బాదేవి రోడ్డులోని భంగ్వాడీ దగ్గర, బాబు గేను మహాత్మాగాంధీ నినాదాలు చేస్తూ ట్రక్కు ముందు నిలబడ్డాడు. బాబు జెను మీదుగా ట్రక్కును నడపమని పోలీసు అధికారి డ్రైవరును ఆదేశించాడు, కాని ఆ డ్రైవరు భారతీయుడు, అందుచేత అతను నిరాకరించి, "నేను భారతీయుడిని, అతను కూడా భారతీయుడే, కాబట్టి, మేమిద్దరం సోదరులం. నా సోదరుడిని నేను చంపవచ్చా?" అని అడిగాడు. ఆ తర్వాత, ఆంగ్ల పోలీసు అధికారి తానే డ్రైవర్ సీటుపై కూర్చుని బాబు గేను మీదుగా ట్రక్కును నడుపాడు. ట్రక్కు కింద పడి చితికిపోయి అతడు మరణించాడు. ఇది ముంబై అంతటా తీవ్ర ఆగ్రహం రేకెత్తించింది. సమ్మెలు, నిరసనలకు దారితీసింది.[1]
షహీద్ బాబు గేను పేరిట గల స్మారకాలు:
- మహారాష్ట్రలోని నవీ ముంబైలోని బాబు గేను మైదానం
- మహారాష్ట్ర, పూణే జిల్లాలోని మహాలుంగే పడ్వాల్‌లో, బాబు గేను వాడి
- పూణేలో బాబు గేను చౌక్
- దక్షిణ ఢిల్లీలో షహీద్ బాబు గేను రోడ్డు
- ముంబై, పరేల్ లోని KEM హాస్పిటల్‌లో ఒక మూలకు బాబు గేను పేరు పెట్టారు, అతని విగ్రహం కింద హుతాత్మా బాబు గేను అని రాసారు.
- పూణేలోని బుధవారపేటలో హుతాత్మా బాబు గేను గణపతి.
మూలాలు
[మార్చు]- ↑ "Diamond Maharashtra Sankritikosh (మరాఠీ: डायमंड महाराष्ट्र संस्कृतीकोश)," Durga Dixit, Pune, India, Diamond Publications, 2009, ISBN 978-81-8483-080-4.