Jump to content

థైమస్ గ్రంథి

వికీపీడియా నుండి
(బాలగ్రంధి నుండి దారిమార్పు చెందింది)
థైమస్ గ్రంథి
Thymus
The thymus of a full-term fetus, exposed in situ.
గ్రే'స్ subject #274 1273
ధమని derived from internal mammary artery, superior thyroid artery, and inferior thyroid artery
నాడి vagus
లింఫు tracheobronchial , parasternal
Precursor third branchial pouch
MeSH Thymus+gland
Dorlands/Elsevier t_10/12807749

బాలగ్రంధి (థైమస్ గ్రంధి) ఛాతీలో ఉండే ఒక అవయవం.

  • థైమస్ గ్రంధి శోషరస వ్యవస్థలో (లింఫోయిడ్ వ్యవస్థ) గోచరించే ప్రాథమిక లింఫ్ అవయవం.
  • ఉరోః కుహర ప్రాంతంలో ఊర్ధ్వ భాగాన ఉరోస్థి వెనుక వైపున, హృదయానికి ముందు భాగంలో, రెండు ఊపిరితిత్తుల మధ్యన పిరమిడ్ ఆకృతిలో గోచరిస్తుంది.[1]  
  • థైమస్ ఆకృతి ,  థైమ్ ఆకు (thyme leaf) రూపాన్ని పోలి ఉండడం మూలాన ఈ గ్రంథికి  " థైమస్ " అను పేరు పెట్టడం జరిగింది.[2] పింక్ రంగు లో ఉంటుంది.[3]  
  • థైమస్ గ్రంధి  రెండు లంబికల నిర్మాణం. రెండు లంబికలు  ' ఇస్థమస్(isthmus) ' ద్వారా కలుపబడిఉంటాయి.  ప్రతి లంబికలో  అనేక లఘు లంబికలుంటాయి. ప్రతి లఘు లంబిక రెండు స్తరాలతో నిర్మితం. వెలుపలి స్తరాన్ని 'వల్కలం(cortex) ' అనీ , లోపలి స్తరాన్ని 'దవ్వ(medulla)' అనీ వ్యవహరిస్తారు. వల్కల భాగమంతా అపరిపక్వ 'లింఫోసైట్ల '(immature lymphocytes)తోనూ, దవ్వ భాగం అంతా ప్రౌఢ 'లింఫోసైట్ల '(mature lymphocytes)తోను నిండి ఉంటుంది. వల్కలభాగంలోని 'అపరిపక్వ లింఫోసైట్లు', పరిపక్వత చెందిన తరువాత దవ్వ ను చేరుకుంటాయి.[2]
  • వల్కలంలో అపరిపక్వ లింఫోసైట్ లతో పాటు 'రెటిక్యూ లార్'  కణాలుంటాయి. ఇవి పెద్దవిగా ఉండి, వల లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఆ వలలో లింఫోసైట్లు ఇమిడి ఉంటాయి.
  • దవ్వ భాగంలో రక్తకణాలు, రెటిక్యూలార్ కణాలు, పరిపక్వ లింఫోసైట్ లు  ఉంటాయి. వీటితోపాటు ప్రత్యేకమైన  ' హాసెల్స్  కార్ప సెల్స్ '(Hassall’s corpuscles)ఉంటాయి.[1]  వీటి విధులు ఇంకను నిర్ధారింపబడలేదు . వీటిని వయసు మీరి, క్షీణిస్తున్న కణాలు గా భావిస్తున్నారు.[4]  
  • శైశవ దశలలో, అనగా చిన్న వయసులో, బాగా అభివృద్ధి  చెంది, ప్రౌఢ దశకు చేరుకోగానే ఎక్కువ పరిమాణాన్ని పెంచుకొని, ఆ తరువాత క్రమేపీ క్షీణిస్తుంది. తరువాత ఆ భాగమంతా క్రొవ్వుతో నిండిపోతుంది . ఈ క్షీణతను  ' థైమిక్  ఇన్వల్యుషన్(thymic involution) ' అంటారు.[2]

   థైమస్ గ్రంధి - విధులు

[మార్చు]
  •   థైమస్ గ్రంధి రెండు విధులలో పాల్గొంటుంది. రోగనిరోధకత్వాన్ని  పెంపొందింప చేయటంలోనూ, హార్మోన్ల తయారీలోనూ ప్రముఖంగా పాల్గొంటుంది.
  •   ఎముక మూలుగ (bone marrow) లో తయారయిన అపరిపక్వ  టి -లింఫోసైట్ లను ,పరిపక్వ  టి -లింఫోసైట్ కణాలుగా రూపుదిద్దడంలో పాత్ర వహిస్తాయి.[5] ఇవి రక్త ప్రసారం వెంబడి ప్రయాణించి లింఫ్ కణుపులను(lymph nodes), ప్లీహం(spleen) ను చేరి పనితనాన్ని ప్రారంభిస్తాయి. ముఖ్యంగా కణ సంబంధ నిరోధకత్వం లో పాల్గొని అనేక వ్యాధికారక జీవరాసుల బారి  నుంచి శరీరాన్ని రక్షిస్తాయి[6] .                         
  •   థైమస్ గ్రంధి లో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు వరుసగా  ' థైమోపొయిటిన్(thymopoietin) ', ' థై ములిన్(thymulin) ', ' థైమో సిన్(thymosin) ', 'థై మిక్ హుమోరల్ కారకం(thymic humoral factor(THF))' .    థైమోపొయిటిన్ ', ' థై ములిన్' లు  టి - కణాల విభేధన లోను , టి - కణాల సామర్ధ్యాన్ని పెంపొందించటంలోనూ దోహదం చేస్తాయి. 'థైమో సిన్ 'అసంక్రామ్య అనుక్రియల వేగవంతం చేయడంలోనూ, కొన్ని 'పిట్యూటరీ హార్మోన్ల '  ప్రేరణకు తోడ్పడుతుంది. థైమిక్ హుమోరల్ కారకం(THF) ముఖ్యంగా వైరస్ ల నాశనానికి  తోడ్పడే అసంక్రామ్య చర్యలను వేగవంతం చేస్తాయి [7]
  •  థైమస్ పనితనం జీవితకాలం ఉండదు. శరీరంలో ఇది చురుకుగా పనిచేస్తున్నప్పుడు, శరీరాన్ని 'ఆటో ఇమ్మ్యూనిటి(auto-immunity)'  కి గురి కాకుండా రక్షిస్తుంది.[7]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Clinical Science" by Dr. Mythili Dheemahi, first edition:2005-'06 ,161-163
  2. 2.0 2.1 2.2 An overview of Thymus gland by Lynne Eldridge,MD- verywellhealth.com
  3. The thyroid gland structure: teachmeanatomy.info/thorax/organs/thymus
  4. Thymus structure and function : microbenotes.com
  5. Thyroid gland-anatomy: innerbody.com
  6. Overview of the Thymus Gland : thoughtco.com
  7. 7.0 7.1 An over view of Thymus: endocrineweb.com