Jump to content

బిందు నానుభాయ్ దేశాయ్

వికీపీడియా నుండి
బిందు
బిందు
జననం
బిందు నానుభాయ్ దేశాయ్

(1941-04-17) 1941 ఏప్రిల్ 17 (వయసు 83)[1]
హనుమాన్ భాగదా, వల్సాద్ జిల్లా, గుజరాత్‌
వృత్తిసినిమా నటి, నృత్యకారిణి
క్రియాశీల సంవత్సరాలు1959–2008
జీవిత భాగస్వామిచంపక్లాల్ జవేరి

బిందు నానుభాయ్ దేశాయ్ (జననం జనవరి 17)[2] గుజరాత్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, నృత్యకారిణి.[1] తన నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్‌లో 160కి పైగా సినిమాల్లో నటించి, ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు నామినేట్ అయింది. 1970లో వచ్చిన కటి పతంగ్ సినిమాలో షబ్నమ్ పాత్రకు, ప్రేమ్ చోప్రా సరసన బిందు నటించిన సినిమాలతో గుర్తుండిపోతుంది.[3]

జననం

[మార్చు]

బిందు 1941, ఏప్రిల్ 17న సినీ నిర్మాత నానుభాయ్ దేశాయ్ - జ్యోత్స్న దంపతులకు గుజరాత్‌ రాష్ట్రం, వల్సాద్ జిల్లాలోని హనుమాన్ భాగదా అనే చిన్న గ్రామంలో జన్మించింది. 1954లో 13 ఏళ్ళ వయసులో బిందు తండ్రి మరణించగా, పెద్దకూతురు కావడంతో కుటుంబ పోషణ బాధ్యతనంతా బిందు స్వీకరించింది.[4]

సినిమారంగం

[మార్చు]

1962లో సినిమారంగంలోకి ప్రవేశించిన బిందు, అన్పధ్‌ అనే సినిమాలో తొలిసారిగా నటించింది. 1969లో ఇత్తెఫాక్, దో రాస్తే సినిమాలలో నటించగా ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. అంతేకాకుండా బిందు ఆ రెండు సినిమాలలో తన నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు మొదటిసారిగా నామినేషన్లను అందుకుంది.

1972లో దస్తాన్‌ సినిమాలో నటించి, మూడవసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది. 1973 అభిమాన్‌ సినిమాలో నటించగా, ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మరో విజయాన్ని సాధించడంతోపాటు నాలుగవసారి ఫిల్మ్‌ఫేర్ కు నామినేషన్‌ని అందుకుంది. ఆ తర్వాత 1974లో హవాస్, ఇంతిహాన్‌ సినిమాలలో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా వాణిజ్యపరంగా విజయవంతమవడంతోపాటు మరో రెండు ఫిల్మ్‌ఫేర్ నామినేషన్లను అందుకుంది. 1976లో అర్జున్ పండిట్‌ సినిమాలో నటించి, ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు చివరి నామినేషన్‌ను అందుకుంది.[2]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు సినిమా విభాగం ఫలితం
1970 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఇత్తెఫాక్ ఉత్తమ సహాయ నటి నామినేట్
1971 డు రాస్తే నామినేట్
1973 దస్తాన్ నామినేట్
1974 అభిమాన్ నామినేట్
1975 హవాస్ నామినేట్
ఇంతిహాన్ నామినేట్
1977 అర్జున్ పండిట్ నామినేట్

నటించిన సినిమాలు (కొన్ని)

[మార్చు]
  • శాంతన్ (1959)
  • ఏక్ ఫూల్ చార్ కాంటే (1960)
  • అన్పధ్ (1962)
  • అయా సావన్ ఝూమ్ కే (1969)
  • నటీజ (1969)
  • ఇత్తెఫాక్ (1969)
  • దో రాస్తే (1969)
  • కటి పతంగ్ (1970)
  • ప్రీత్ కి డోరి (1971)
  • అమర్ ప్రేమ్ (1971)
  • దుష్మన్ (1971)
  • హసీనోన్ కా దేవతా (1971)
  • దస్తాన్ (1972)
  • దిల్ కా రాజా (1972)
  • ఏక్ బెచారా (1972)
  • గరం మసాలా (1972)
  • రాజా జాని (1972)
  • మేరే జీవన్ సాథీ (1972)
  • ధర్మ (1973)
  • జంజీర్ (1973)
  • గై ఔర్ గోరీ (1973)
  • గెహ్రీ చాల్ (1973)
  • జోషిలా (1973)
  • అన్హోనీ (1973)
  • అభిమాన్ (1973)
  • సూరజ్ ఔర్ చందా (1973)
  • హవాస్ (1974)
  • ఫ్రీ లవ్ (1974)
  • ఇంతిహాన్ (1974)
  • పగ్లీ (1974)
  • ప్రేమ్ నగర్ (1974)
  • బంగారద పంజర (1974 కన్నడ చిత్రం)
  • చైతాలి (1975)
  • దఫా 302 (1975)
  • జగ్గు (1975)
  • సేవక్ (1975)
  • ధోతీ లోటా ఔర్ చౌపటీ (1975)
  • ఆజ్ కా మహాత్మా (1976)
  • అర్జున్ పండిట్ (1976)
  • శంకర్ శంభు (1976)
  • శంకర్ దాదా (1976)
  • షేక్ (1976)
  • దస్ నంబ్రి (1976)
  • నెహ్లే పెహ్ దేహ్లా (1976)
  • థీఫ్ ఆఫ్ బాగ్దాద్ (1977)
  • దో చెహెరే (1977)
  • హీరా ఔర్ పత్తర్ (1977)
  • చక్కర్ పే చక్కర్ (1977)
  • చల మురారి హీరో బన్నె (1977)
  • చల్తా పుర్జా (1977)
  • మహా బద్మాష్ (1977)
  • బాండీ (1978)
  • చోర్ హో తో ఐసా (1978)
  • డెస్ పార్దేస్ (1978)
  • గంగా కీ సౌగంధ్ (1978)
  • బేషరమ్ (1978)
  • జలాన్ (1978)
  • తృష్ణ (1978)
  • ఫండేబాజ్ (1978)
  • రాహు కేతు (1978)
  • రామ్ కసమ్ (1978)
  • అమర్ దీప్ (1979)
  • నల్లతోరు కుటుంబం (1979 తమిళ చిత్రం)
  • ఇన్‌స్పెక్టర్ ఈగిల్ (1979)
  • అల్లాదినమ్ అర్పుత విళక్కుం (1979 తమిళం-మలయాళం ద్విభాషా)
  • ఖండాన్ (1979)
  • సర్కారీ మెహమాన్ (1979)
  • అగ్రిమెంట్ (1980)
  • జ్వాలాముఖి (1980)
  • షాన్ (1980)
  • నసీబ్ (1981)
  • లావారిస్ (1981)
  • ప్రేమ్ రోగ్ (1982)
  • జమ్నాగా హీరో (1983)
  • విడాకులు (1984)
  • పైసా యే పైసా (1985)
  • ఆజ్ కా దౌర్ (1985)
  • కర్మ (1986)
  • హిఫాజత్ (1987)
  • బివి హో తో ఐసి (1988)
  • కిషన్ కన్హయ్య (1990)
  • ఘర్ హో తో ఐసా (1990)
  • హనీమూన్ (1992)
  • షోలా ఔర్ షబ్నం (1992)
  • ఆంఖేన్ (1993)
  • ఆసూ బనే అంగారే (1993)
  • రూప్ కీ రాణి చోరోన్ కా రాజా (1993)
  • ఛోటీ బహూ (1994)
  • క్రాంతివీర్ (1994)
  • హమ్ ఆప్కే హై కౌన్..! (1994)
  • జుద్వా (1997)
  • బనారసి బాబు (1997)
  • ఎహ్సాస్ ఈజ్ తారా (1998)
  • ఆంటీ నం. 1 (1998)
  • జానం సంఝా కరో (1999)
  • ప్యార్ కోయి ఖేల్ నహిన్ (1999)
  • సూర్యవంశం (1999)
  • మేరే యార్ కీ షాదీ హై (2002)
  • మై హూ నా (2004)
  • ఓం శాంతి ఓం (2007)
  • మెహబూబా (2008)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "बिंदु की कहानी... खुद की जुबानी". Hindi Webdunia Dot Com (in ఇంగ్లీష్). 2018-02-21. Retrieved 2023-01-08.
  2. 2.0 2.1 Tripathy, Rupali (2021-01-21). "Celebrating "Bindu" Nanubhai Desai- The Glam Queen of the 70s". The Talented Indian (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-08.
  3. "Shabnam Still Gets Fan Mail". Indian Express. 4 December 2010. Retrieved 2023-01-08.
  4. "Bindu Desai Biography". bollycurry.com. Retrieved 2023-01-08.

బయటి లింకులు

[మార్చు]