బిగ్ డేటా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బిగ్ డేటా అనే పదాన్ని సాధారణంగా సాంప్రదాయక సాఫ్టువేర్లు భరించలేనంత పెద్దమొత్తంలో డేటాను సూచించడానికి వాడుతున్నారు. ఇందులో ప్రధాన సమస్యలు అంత పెద్ద మొత్తంలో డేటాను ఒడిసి పట్టడం, భద్రపరచడం, విశ్లేషించడం, శుద్ధి చేయడం, వెతకడం, పంచుకోవడం, బదిలీ చేయడం, అందులోని సమాచారం కోసం ప్రశ్నించడం, వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచడం మొదలైనవి. ప్రస్తుతం బిగ్ డేటా అంటే కేవలం దానిని విశ్లేషించి రాబోయే మార్పులు గురించి తెలుసుకోవడం అనే భావనే ఎక్కువగా వాడుకలో ఉంది కానీ డేటా పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు.

సమాజంలోకి కొత్తగా ప్రవేశిస్తున్న అధునాతన సమాచార సాంకేతిక పరికరాలు, సాఫ్టువేరు లాగ్స్, కెమెరాలు, మైక్రోఫోన్లు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాలు లాంటి ద్వారా సమాచారం అత్యంత వేగంగా పోగుపడుతోంది. 1980 నుంచి సమాచార నిల్వ సామర్థ్యం ప్రతి 40 నెలలకూ రెట్టింపవుతూ వస్తోంది.[1] డేటా చాలా ముఖ్యమైన విషయం

మూలాలు[మార్చు]

  1. Hilbert, Martin; López, Priscila (2011). "The World's Technological Capacity to Store, Communicate, and Compute Information". Science. 332 (6025): 60–65. doi:10.1126/science.1200970. PMID 21310967. {{cite journal}}: Invalid |ref=harv (help)
"https://te.wikipedia.org/w/index.php?title=బిగ్_డేటా&oldid=3383974" నుండి వెలికితీశారు