బత్తుల సాయన్న వెంకటరావు
బత్తుల సాయన్న వెంకటరావు (బి.ఎస్. వెంకటరావు) తెలంగాణ ప్రాంత సంఘ సంస్కర్త, రాజకీయ నాయకులు.[1] హైదరాబాదు సంస్థానంలో దళితోద్యమానికి పునాదులు వేసిన భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామితో పాటు, బి.ఎస్.వెంకట్రావును కలిపి దళితత్రయంగా పరిగణిస్తారు.
జననం
[మార్చు]బత్తుల సాయన్న వెంకటరావు సాయన్న, ముత్తమ్మ దంపతులకు 1896, డిసెంబర్ 11 న సికింద్రాబాదు లోని, న్యూబోయిగూడలో జన్మించారు.
విద్యాభ్యాసం
[మార్చు]వెంకటరావు పెద్దగా చదువుకోలేదు. ఎన్నో అవంతరాల మధ్య ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు.
ఉద్యోగం
[మార్చు]బతుకుదెరువు కోసం శిల్పాలు చెక్కడం నేర్చుకున్నారు. మహారాష్ట్ర లోని పూణేలో ఎన్నో శిల్పాలు చెక్కారు. నిజాంలో ఇంజినీర్ స్థాయిదాకా ఎదుగుతూ తమ సేవలు అందించారు.
జీవిత విశేషాలు
[మార్చు]సమాజ సేవనే జీవితధ్యేయం బతికారు. తన జీవిత ధ్యేయానికి ఉద్యోగం ఒక అడ్డంకి అవుతున్నందని ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం హైదరాబాదుకి వచ్చి, సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. సామాజిక దురాచారాలను రూపుమాపడం, దేవదాసితనం, కుల వైషమ్యాలను నిర్మూలించడం, దళితులలో విద్యాభివృద్ధి చేయడం మొదలైనవి చేశారు. అప్పటి హైదరాబాదు రాష్ట్రంలో అంటరాని ప్రజలపక్షాన ఉద్యమిస్తున్న భాగ్యరెడ్డివర్మ ప్రభావం, దళితుల జీవితాలలో వెలుగురేఖలు ప్రసరిస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి వెంకటరావు మీద ఉంది.
తన మేధా సంపత్తిపై ఆధారపడి సామాజిక ఉద్యమాలు నిర్మించడం, రాజకీయ వ్యూహంతో ప్రభుత్వాన్ని ఒప్పించడం, తనకున్న వనరులను ఆర్థిక సంపత్తితో అణగారిన దళిత ప్రజలను ఆదుకోవడం వంటి త్రిముఖ వ్యూహాంతో ఉద్యమమార్గాన్ని ఎంచుకొని ప్రజలకోసం శ్రమించారు. హైదరాబాద్‌లో అనేక సంఘాలు స్థాపించారు. 1926లో ఆదిహిందూ మహాసభను ఏర్పాటుచేసి, మద్యపానానికి వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించారు.
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, వేదిక-అభిప్రాయం (11 December 2014). "సామాజిక న్యాయ శిల్పి బీఎస్". Archived from the original on 11 మార్చి 2019. Retrieved 11 March 2019.