బి.వై. విజయేంద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బి.వై. విజయేంద్ర

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
13 మే 2023
ముందు బి.ఎస్.యడ్యూరప్ప
నియోజకవర్గం షికారిపుర

భారతీయ జనతా పార్టీ
కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
10 నవంబర్ 2023
ముందు నళిన్ కుమార్ కటీల్

వ్యక్తిగత వివరాలు

జననం (1975-11-05) 1975 నవంబరు 5 (వయసు 48)
షికారిపూర్ , కర్ణాటక , భారతదేశం
జాతీయత భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ప్రేమ
సంతానం మైత్రి, ఝాన్సీ

బూకనకెరె యడియూరప్ప విజయేంద్ర భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప కుమారుడు.[1] విజయేంద్ర 10 నవంబర్ 2023 నుండి కర్ణాటక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

బి.వై. విజయేంద్ర తన తండ్రి బి.ఎస్.యడ్యూరప్ప అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో బీజేపీ యువమోర్చ బెంగళూరు కార్యదర్శిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2019లో భారతీయ జనతా యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, 2020లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా[3] వివిధ హోదాల్లో పని చేసి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో షికారిపుర నియోజకవర్గం[4] నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

విజయేంద్రను 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు 10 నవంబర్ 2023న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఉత్తర్వులు జారీ చేశాడు.[5][6]

మూలాలు[మార్చు]

  1. EENADU (11 May 2024). "భాజపా కర్ణాటక అధ్యక్షుడిగా యడియూరప్ప తనయుడు". Archived from the original on 11 May 2024. Retrieved 11 May 2024.
  2. The Hindu (15 November 2023). "B.Y. Vijayendra takes over as BJP State chief, vows to win all 28 Lok Sabha seats in Karnataka" (in Indian English). Archived from the original on 11 May 2024. Retrieved 11 May 2024.
  3. NDTV (1 August 2020). "BS Yediyurappa's Son Appointed As Karnataka BJP Vice President". Archived from the original on 11 May 2024. Retrieved 11 May 2024.
  4. The Times of India (14 April 2023). "Karnataka elections: Who is BY Vijayendra, Yediyurappa's son who is contesting from Shikaripura". Archived from the original on 11 May 2024. Retrieved 11 May 2024.
  5. The Hindu (10 November 2023). "Vijayendra appointed State BJP president" (in Indian English). Archived from the original on 11 May 2024. Retrieved 11 May 2024.
  6. The Times of India (11 November 2023). "BY Vijayendra: Greenhorn politician who defied all odds is now Karnataka BJP chief". Archived from the original on 11 May 2024. Retrieved 11 May 2024.