బి. భక్తవత్సలు నాయుడు
స్వరూపం
బి. భక్తవత్సలు నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు, మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యుడు. 1952 నుండి 1962 వరకు మద్రాసు శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశాడు.[1][2]
భక్తవత్సలు నాయడు తమిళనాడు శాసనసభ మాజీ సభ్యుడు. 1952 ఎన్నికలలో అరక్కోణం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా తమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యాడు.[3] 1957లో షోలింగూర్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రేసు పార్టీ తరఫున పోటీ చేసి, స్వతంత్ర అభ్యర్ధి ఎం.సుబ్రమణియన్ నాయకర్ ను ఓడించి, శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు.
భక్తవత్సలు నాయుడు, వెల్లూరు జిల్లాలోని మిన్నల్ సమీపంలోని, మేల్‌కలత్తూర్ గ్రామంలో 1900, మే 25న జన్మించాడు. ఈయన విద్యాభ్యాసమంతా మద్రాసులో సాగింది. చిన్నవయసులోనే ప్రజా జీవితంలో అడుగుపెట్టి, తొలుత రాణీపేట్ తాలూకా బోర్డుకు ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Tamil Nadu Legislative Assembly: Details of terms of successive Legislative Assemblies constituted under the Constitution of India". Government of Tamil Nadu. Archived from the original on 2009-03-03.
- ↑ "Tamil Nadu Legislative Assembly: Details of terms of successive Legislative Assemblies constituted under the Constitution of India". Government of India. Archived from the original on 2009-04-09. Retrieved 2009-04-04.
- ↑ 1951/52 Madras State Election Results, Election Commission of India