బూస్ట్ డిఫెండర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బూస్ట్ డిఫెండర్స్
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్ఆఫ్ఘనిస్తాన్ హష్మతుల్లా షాహిదీ
కోచ్ఇంగ్లాండ్ ఆడమ్ హోలియోకే
యజమానిఆరిఫ్ అజీమ్ గ్రూప్
జట్టు సమాచారం
స్థాపితం2013
స్వంత మైదానంకాందహార్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, కాందహార్
సామర్థ్యం14,000
చరిత్ర
ష్పజీజా క్రికెట్ లీగ్ విజయాలు0
ఘాజీ అమానుల్లా ఖాన్ ప్రాంతీయ వన్డే టోర్నమెంట్ విజయాలు1 (2018)

బూస్ట్ డిఫెండర్స్ (బూస్ట్ రీజియన్) అనేది ఆఫ్ఘనిస్తాన్‌లోని ఎనిమిది ప్రాంతీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్లలో ఒకటి. ఈ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ దక్షిణ, నైరుతిలోని కాందహార్, హెల్మండ్, నిమ్రోజ్, ఉరుజ్గన్, జాబుల్ అనే క్రింది ప్రావిన్సులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. హెల్మండ్ ప్రావిన్స్‌లోని లష్కర్‌గా నగరం చారిత్రక పేరు బూస్ట్ పేరు మీదుగా ఈ బృందానికి పేరు పెట్టారు.

క్రికెట్ రంగం[మార్చు]

2017 నుండి ఫస్ట్-క్లాస్ హోదా కలిగిన అహ్మద్ షా అబ్దాలీ 4-రోజుల టోర్నమెంట్‌లో బూస్ట్ రీజియన్ పోటీపడుతుంది.[1] 2017 అక్టోబరులో, మిస్ ఐనాక్ రీజియన్‌పై 73 పరుగుల తేడాతో టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో గెలిచారు.[2]

2017[3] నుండి లిస్ట్ ఎ క్రికెట్ హోదా పొందిన ఘాజీ అమానుల్లా ఖాన్ ప్రాంతీయ వన్ డే టోర్నమెంట్‌లోనూ, బూస్ట్ డిఫెండర్స్ పేరును ఉపయోగించి ఆఫ్ఘన్ ష్పగేజా క్రికెట్ లీగ్ ట్వంటీ20 పోటీ (2017 నుండి ట్వంటీ20 హోదాను కలిగి ఉంది)లో కూడా ఆడతారు.

2018 జూలైలో, అబుదాబి టీ20 ట్రోఫీ మొదటి ఎడిషన్‌లో ఆడటానికి ఆహ్వానించబడిన ఆరు జట్లలో ఇవి ఒకటి.[4]

మూలాలు[మార్చు]

  1. "Afghanistan domestic competitions awarded first-class and List A status". ESPN Cricinfo. 4 February 2017. Retrieved 4 February 2017.
  2. "3rd Match, Alokozay Ahmad Shah Abdali 4-day Tournament at Kabul, Oct 26-29 2017". ESPN Cricinfo. Retrieved 29 October 2017.
  3. "ICC Recognizes Afghanistan's Domestic ODI Tournament As List A League". Bakhtar News. Retrieved 9 August 2017.
  4. "Abu Dhabi to host teams from six countries in T20 tournament". ESPN Cricinfo. Retrieved 4 July 2018.