Jump to content

బెగోనియేసి

వికీపీడియా నుండి

బెగోనియేసి
Begonia aconitifolia
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
బెగోనియేసి
ప్రజాతులు

బెగోనియా
Hillebrandia

బెగోనియేసి (Begoniaceae) ఒక పుష్పించు మొక్కల కుటుంబం. దీనిలోని సుమారు 2040 జాతులు ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో విస్తరించాయి.[1] దీనిలో రెండు ప్రజాతులు ఉన్నాయి : బెగోనియా (Begonia), Hillebrandia. వీటిని ఇండోర్ మొక్కలుగా ప్రసిద్ధిచెందాయి. ఈ మొక్కలు కొత్త ప్రపంచం (అమెరికాలు), పాత ప్రపంచం (ఆఫ్రికా–ఆసియా–యూరప్) లోని ఉపఉష్ణ మండలం, ఉష్ణ మండల ప్రాంతాల్లో పెరుగుతాయి.

ఈ కుటుంబంలోని దాదాపు అన్ని జాతులు బెగోనియా (Begonia) అనే ప్రజాతికి చెందుతాయి. ఇక ఈ కుటుంబంలో ఉన్న మరో ప్రజాతి హిల్లెబ్రాండియా (Hillebrandia) మాత్రమే. ఇది హవాయి దీవుల్లో మాత్రమే కనిపిస్తుంది, దీనిలో ఒకే ఒక్క జాతి ఉంది.

సింబగోనియా (Symbegonia) అనే ప్రజాతి 2003 లో బెగోనియా ప్రజాతిలోనే ఒక శాఖగా మార్చబడింది, ఎందుకంటే జన్యు అధ్యయనాలు (molecular phylogeny) అది బెగోనియా నుంచే అభివృద్ధి చెందిందని చూపించాయి.

లక్షణాలు

[మార్చు]

Begonia వంశానికి చెందిన మొక్కలు ప్రసిద్ధమైనవి, అందమైనవి, ఇంట్లో పెంచే మొక్కలుగా చాలా ప్రాచుర్యం పొందాయి.

బెగోనియా పుష్పాలు ముఖ్యంగా డబుల్ బెగోనియాకు చెందినవి,[2] గులాబీ పువ్వు వలె ఉండటం మూలంగా వీటిని గులాబీలాంటి గులాబీలు ("Roseform Roses") గా పరిగణిస్తారు.[3],[4][5]

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Christenhusz, M. J. M. & Byng, J. W. (2016). "The number of known plants species in the world and its annual increase". Phytotaxa. 261 (3). Magnolia Press: 201–217. Bibcode:2016Phytx.261..201C. doi:10.11646/phytotaxa.261.3.1.
  2. "Types of Begonias". www.longfield-gardens.com. Retrieved 2022-05-27.
  3. "Begonia 'Roseform Rose'". Gardenia.net. Retrieved 2022-05-27.
  4. "Surefire® Rose Begonia". Plant Addicts (in ఇంగ్లీష్). Retrieved 2022-05-27.
  5. "Begonia Rose ( Rose Begonia )". Backyard Gardener (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-09-18. Retrieved 2022-05-27.

బయటి లింకులు

[మార్చు]