బెరిబెరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బెరిబెరి (Beriberi) విటమిన్ బి1 లేదా థయామిన్ లోపం వల్ల మానవులలో సంభవించే వ్యాధి. ఈ విటమిన్ బియ్యం మీద ఉండే తవుడులో ఉంటుంది.

ఈ వ్యాధిలో తడి బెరిబెరి (Wet beriberi), పొడి బెరిబెరి (Dry beriberi) అని రెండు రకాలు. కండరాలు క్షీణించి, కాళ్ళు చేతులు పక్షవాతంతో పడిపోవడం పొడి బెరిబెరి లక్షణాలు. దేహకుహరంలో నీరుచేరి హృదయం ఉబ్బి కాలేయం నొక్కుకొని పోవడాం తడి బెరిబెరి లక్షణాలు. కొందరిలో రెండింటి లక్షణాలు కనబడవచ్చును.

మూలాలు[మార్చు]

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=బెరిబెరి&oldid=2950092" నుండి వెలికితీశారు