Jump to content

బెర్ట్రాండ్ రస్సెల్

వికీపీడియా నుండి
పాశ్చాత్య తత్త్వం
20వ శతాబ్దపు తత్త్వశాస్త్రం
1950లో రస్సెల్
పేరు: బెర్ట్రాండ్ ఆర్థర్ విలియం రస్సెల్, 3rd Earl Russell
జననం: {{{birth}}}
సిద్ధాంతం / సంప్రదాయం: Analytic philosophy
Nobel Prize in Literature
1950
ముఖ్య వ్యాపకాలు: Ethics, epistemology, logic, mathematics, philosophy of language, philosophy of science, religion
ప్రముఖ తత్వం: Analytic philosophy, logical atomism, theory of descriptions, knowledge by acquaintance and knowledge by description, Russell's paradox, Russell's teapot.
ప్రభావితం చేసినవారు: Euclid · Plato · Leibniz ·
Hume · Moore ·
Mill · Frege ·
Wittgenstein ·
Santayana · A.N. Whitehead ·
Paine · Peano ·
ప్రభావితమైనవారు: Wittgenstein · Ayer ·
Carnap · Gödel  ·
Popper · Quine ·
Chomsky · Austin · Kripke · Schlick · Tarski · Waismann · Davidson · Eddington · Turing · Arendt · Vuillemin · McDowell · Kumar ·
Evans  · Chisholm

బెర్ట్రాండ్ ఆర్థర్ విలియం రస్సెల్ (18 మే 1872 – 1970 ఫిబ్రవరి 2) ప్రముఖ బ్రిటీషు తత్త్వవేత్త, తార్కికుడు, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, సామ్యవాది, శాంతివాది, నాస్తికుడు. జీవితంలో చాలా భాగం ఇంగ్లాండులో గడిపినా రస్సెల్ వేల్స్ లో పుట్టాడు. అక్కడే మరణించాడు.[1] "Why I Am Not a Christian" అనే పేరుతో ఇతను వ్రాసిన గ్రంథం ఎందరో నాస్తికులని ప్రభావితం చేసింది.

జీవిత విశేషాలు

[మార్చు]

రస్సెల్ 1872 మే నెల 18వ తేదీన రేవెంస్క్రాప్ట్ లో జన్మించారు. వైకౌంట్ అంబర్లీ ద్వితీయ పుత్రుడు ఆయన లార్డ్ జాన్ రస్సెల్ మనుమడు. ఆయన తల్లిపేరు కేధరీన్. ఆమె స్టాన్లీ ప్రభువు సంతానం.రస్సెల్ కుటుంబీకులందరు ప్రతిభావంతులు.స్పృహణీయులు, లలితకళావేదులు, ఉద్దండ పండితులు.ఈ సర్వలక్షణాలు రస్సెల్ లో అభివ్యక్తి పొందాయి.రస్సెల్ జీవితం ఆయన చిన్ననాటి సంఘటనలతో అభికంగా ప్రభావితమైనది.రస్సెల్ తల్లి, తండ్రి ఆయన పుట్టుకకు మినుపే పాత ఆచారాలను, పద్దుతులను వదిలి పెట్టివేశారు.వారు ప్రాకృతిక విజ్ఞాన విధేయులు.భగవంతుడు ఉన్నాడని, పునర్జన్మలున్నాయని వారు నిరూపణ చేయడం కాని, లేక నిరూపణ చేయకపోవటం కాని సాధ్యం కాదన్నా తత్త్వాన్ని వారు అవలింబించారు. ప్రకృత శక్తులే యధార్ధం అన్న సిద్ధాంతాన్ని వారు అవలంబించారు. రస్సెల్ కు రెండవ యేటనే తల్లి చనిపోయింది. మూడోయేట తండ్రి చనిపోయాడు. ముత్తవ తల్లి పెంపకంలో పెరిగాడు. అమ్మమ్మ ఆచారవంతురాలు ప్యూరిటిన్ అని ఆమెను గూర్చి రస్సెల్ వ్రాసాడు.

కేంబ్రిడ్జ్కి వెళ్ళేంతవరకు విద్యాభ్యాసం అంతా ఇంట్లోనే గడిచింది.ఆజీవితం సుఖమైనది కాదు.బాహ్య ప్రపంచంలోకి ఆయన విడుదల అప్పుడే, అనగా కేంబ్రిడ్జ్ లో ప్రవేశించినప్పుడే. అది కొత్త ప్రపంచం అని చెప్పుకున్నాడు రస్సెల్.అందులో అంతులేని ఉల్లాసము ఆనందము అన్నాదన్నాడు.ఆప్రపంచంలో ఆయనకి మంచి స్నేహితులు దొరికారు. లోవెస్ డికింసన్, డా.ట్రావెల్యాన్, మెక్ టెగ్గార్గ్, జి.ఇ.మూర్ లవంటి వారు స్నేహితులయ్యారు. వీరిలో చివరి ఇద్దరి ప్రభావము రస్సెల్ పై అధికం.అందువలన ఆయన హెగిలియన్ అయినాడు.అయితే మూర్ రస్సెల్ ను హెగిలియన్ వ్యామోహం లోంచి బయటకి లాగాడు.

1890లో రస్సెల్ ట్రినిటీ కాలేజీలో చేరాడు.1893లో చివరి పరీక్షలో 7వవాడుగా వచ్చాడు.అందుకు కారణం ఆయన్ గణితశాస్త్రం మీద ఎక్కువ మక్కువ చూపడం వలనే మిగవాటిని తప్ప. కేంబ్రిడ్జ్ ని వదిలి వెళ్ళాక ఆయన పారిస్ లో బ్రిటీష్ రాయబారి కార్యాలయంలో గౌరవోద్యోగం చేశారు. ఆతరువాత బెర్లిన్ కు వళ్ళారు.అక్కడ సమాజ సమస్యలను ఆర్థిక సమస్యలను అధ్యయనం చేసారు.వాటిని 1896లో 6 ఉపన్యాసాలుగా వ్రాసారు.

-గణిత శాస్త్ర-తత్త్వ శాస్త్ర- రాజకీయ రచనలు

[మార్చు]

1895లో ట్రినిటీ కాలేజీ లెక్చరరుగా ఎన్నిక అయినారు.అక్కడ ఉన్నప్పుడు Essay on the Foundation of Geometry అన్న గ్రంథాన్ని ప్రకటించారు.గణిత శాస్త్రంలో, తత్త్వ శాస్త్రంలో ఆయనుకున్న శిక్షణ, ప్రజ్ఞ ప్రాటవం ఆయనచేత ఇంకో గ్రంథాన్ని వ్రాయటానికి ఉపకరించాయి. Critical Exposition of the Philosophy of Leibniz వ్రాసారు. ఇది 1900 లో ప్రచురితమైనది. లైబ్నిజ్ ను రస్సెల్ సార్వకాలికులైన మహాతత్త్వవేత్తలలో ఒకరు అన్నారు.

1900లో పారిస్ లో గణితశాస్త్ర మహాసభలు జరిగినప్పుడు ఆశాస్త్రంలో పియానో అన్న శాస్త్రజ్ఞని గ్రంథాలను రస్సెల్ గణితశాస్త్ర పండితుల దృష్టికి తీసుకువచ్చారు.1903లో ప్రీజ్ చెప్పింది గమనించాలన్నారు. పియానో, లైబ్నిజ్ ప్రభావం రస్సెల్ పై అధికంగా చెల్లుతూ వచ్చింది. 1903లో ఆప్రచోదనం మూలంగా The principles of Mathematics అన్న గ్రంథాన్ని ప్రచురించారు.ఆదిలో రస్సెల్ దీనిని రెండు భాగాలుగా ప్రచురిద్దామనుకున్నారు. మొదటి భాగం ప్రచురించిన తరువాత తన అధ్యన ఫలితాల నిగమార్ధాన్ని నిరూపిస్తూ రెండోభాగం ప్రచురిద్దామనుకున్నారు.ఈ కార్యం అయితే జరుపబడిందికాని, అది వేరే గ్రంథంగా వచ్చింది. ఏ.ఎస్.నైట్ హెడ్ తో కలిసి ఆయన ఆగ్రంధం రచించారు. అదే Principia Mathematica అన్న పేరుమీద 10 సం. వ్రాసినారు.1910లో మొదటి భాగము, 1912లో రెండవ భాగము, 1913 లో మూడవ భాగము ప్రచురితమైనాయి. 1908లో రస్సెల్ కి రాయల్ సొసైటి సభ్యత్వం వచ్చింది. వారు రస్సెల్ కి ఈ గ్రంథ రచనకి గాను గ్రాంటులు ఇచ్చారు. ఇంతకు మునుపు ఏగ్రంధము చెప్పనంతగా గణితశాస్త్రము తర్క శాస్త్రము అనుసంధానము గురుంచి ఇందులో వివరణ ఇచ్చారు రస్సెల్.

తత్త్వశాస్త్ర ప్రపంచంలో రస్సెల్ సాధించిన మహావిషయాలు చాలా పేరెన్నిక గన్నవి. బ్రిటన్ కి సంబంధించినంత వరకు రస్సెల్ కుముందు, రస్సెల్ కి తరువాత తత్త్వశాస్త్రము అనడంలో అతిశయోక్తిలేదు.రస్సెల్ కు ముందు తర్క పద్ధతి, వ్యాకరణం బాధకు, కారక ప్రక్రియా వైపరీత్యానికి వాక్య రచనా విచార వాదనకు గురి అయిపోతూ ఉండేది.1905లో Mind అనే దానిలో నిర్దేసించటం గురించి (On Denoting) అన్న వ్యాసాన్ని ప్రకటించారు. అందులో అతి ముఖ్యమైన దార్సనికి సిద్ధాంతాన్ని నిరూపించి ఉన్నారు. Theory of Descriptious అంటారు.

50 సంవత్సరాలపాటు రస్సెల్ చేసిన తాత్త్విక రచనలలో రస్సెల్ తన తర్క పద్ధతిలోని వైనాశికశక్తిని ఉపయోగించి సాంప్రదాయిక తాత్త్విక సమస్యలను, సాంప్రదాయిక తాత్త్విక దర్శనాలను పరీక్ష చేసారు. లాక్, బెర్కిలీ, హ్యూంలు ఎట్లా అనుభవ ప్రామాణిక వాదులో రస్సెల్ కూడా అనుభవ ప్రామాణికవాది.అయితే వారికి విభిన్నంగా రస్సెల్ గణిత శాస్త్ర సిద్ధాంతాలను, శక్తివంతమైన తార్కిక పద్ధతిని ప్రాతిపదికలు చేసుకున్నారు.అనుభవ ప్రామాణిక విజ్ఞానమును, అనుమతి విజ్ఞానముని వీనినే తాను అంగీకరించగలనని రస్సెల్ అన్నారు. రాజకీయ తత్త్వశాస్త్ర రంగం లోకి ప్రవేశించటానికి ఇది ఉపకరించబడింది.

1947లో Philosophy and Politics అన్న గ్రంథం వ్రాసినారు. అందులో రస్సెల్ ఇలా వ్రాసారు: " ప్రజాస్వామ్యానికి సిద్దాంతరూపమైన ప్రాతిపదికను చేకూర్చకలిగిన దర్సనం ఒక్కటే ఉన్నది.అది అనుభవ ప్రామాణ్యవాదం (Empiricism). ప్రజాస్వామ్యం యొక్క మనస్థితికి అదే తగిన తత్త్వం.ఈఅనుభవ ప్రామాణ్యవాద ప్రధమ దార్సికుడు, దానికి వ్యవస్థాపకుడు అయిన లాక్, స్వేచ్చకు, సహనానికి-దానికి ఎంత సంబంధం ఉన్నదో స్పష్టంగా ప్రదర్సించారు. దీనిని బట్టి ఉదార దృష్టి యొక్క సారభూతమైన తత్త్వం-ఒకరు ఏమి అభిప్రాయాలను కలిగి ఉన్నారు అన్నదానిలో లెదు, ఆ అభిప్రాయాలను ఏట్లా అవలంబనం చేయటం జరుగుచున్నది అన్నదానిలో ఉన్నది.పిడివాద పద్దతిలో కాక, వానిని తత్కాలోపయుక్తంగాను, పరీక్షార్ధంగాను మాత్రమే వహించాలి" అని రస్సెల్ స్పష్టం చేసారు.

1907లో రస్సెల్ పార్లమెంటుకు నుంచున్నారు.గెలవలేదు. ఆయనకు ఏదో మంచి చేయాలనే తహ తహ ఒకటి ఉంది. దానిని అభివ్యక్తం కల్గాలి అంటే 1914-1918 ప్రాంతం దాకా ఆయన వేచి ఉండవలసి వచ్చింది. అది యుద్ధ కాలం. ఆ కాలంలో ఆయన శాంతివాద ఉద్యమంలో తులమునకలై ఉన్నారు.ఆ ఉద్యమం ఫలితాలు విపరీతంగా పరిణమించాయి.దేశంలో పెద్ద తుఫాను చెలరేగింది. ఆతుఫానుకు ఆయన కేంద్రంగా అయిపోయారు. ఎందుకంటే ఈ ఉద్యమానికి సంబందిచి రచించిన ఒక కరపత్రం తానే వ్రాసానని ఒప్పుకొనడం మూలాన ఇది జరిగింది.వంద పౌనుల జరిమాన ప్రభుత్వం రస్సెల్ కి విధించింది. ట్రినిటీ కాలేజీ లెక్చరరు పదవినుంచి తొలగించారు.ఆయన గ్రంథభాండాగారాన్ని పట్టుకొనారు. 1916లో ఆయన హార్వార్డ్ లో ఉపన్యాసాలుల్ ఇవ్వవలసి ఉంది.కాని పాస్పోర్టు ఇవ్వలేదు.అదే సం.సెప్టెంబరులో రస్సెల్ మీద ఇంకో నిషేధం విధించబడింది.నిషిద్ధ ప్రాంతాలలో ఆయన ప్రవేశించరాదన్నారు.1918లో ఆయనకు 6 నెలలు జైలు శిక్ష విధించారు. ఖైదులో ఉండగా ఆయన "Introduction to Mathematical Philosophy" అన్న గ్రంథాన్ని వ్రాశారు.

యుద్ధం ముగిసింది. ఆతర్వాత రస్సెల్ తన మనస్సుచేత మానవలోకానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని గురుంచి స్పృశించటం మొదలుపెట్టారు.1920లో రష్యాకు వెళ్ళి వచ్చారు.బ్రిటిష్ కార్మికపక్షం తరపున ఆదేశం వెళ్ళిన ఒక ప్రతినిధి వర్గంలో సభ్యుడిగా వెళ్ళారు.ఆయనకి అక్కడ చలామణి అవుతున్న సైనిక నియతృత్వం నచ్చలేదు. 1921లో Analysis of Mind లో వాటిని ప్రస్తావించారు.

1920లో చైనాకు వెళ్ళారు.పెంకింగ్ లో తత్త్వశాస్త్ర అధ్యాపకులుగా పనిచేసారు.The Problems of China అన్న గ్రంథాన్ని వ్రాసారు.చైనానుంచి తిరిగి వచ్చాక మళ్ళా పార్లమెంటుకి నిలబడ్డారు.1922లో 1923లో కాని ఎన్నిక కాలేదు.A,B,C of Relativity (1923), A,B,C of Relativity (1925) అన్న రెండు గ్రంథాల నడుమ The Prospects of Industrial Civilization అన్న గ్రంథాన్ని రస్సెల్ తన రెండవ భార్యతో కలిసి రచించారు.

1927లో రస్సెల్ దంపతులు ఒక పాఠశాలను నడపటం మొదలు పెట్టారు.ఆరోజుల్లో రస్సెల్ విద్యను గూర్చి పుస్తకాలు On Education (1926), Education and the Social Order (1932) వ్రాశారు.ఆగ్రంధాలలో అధునాతన విద్యాధర్మాలను అతిశయ పద్ధతిలో వివ్వృతం చేయబడినాయి. ఈ రెండు గ్రంథాల రచనకు నడుమ ఆయన ఇంకో మహత్వపూర్ణకమైన గ్రంథాన్ని రచించారు.The Analysis of Matter ఈ గ్రంథంలో వర్తమాన పదార్ధ విజ్ఞాన శాస్త్రం అంతా ఎంతో సుందరవంతముగా సమీక్ష చేయబడింది. అటుపై మరికొన్ని గ్రంథాలు వ్రాసారు. An Outline of Philosophy, Sceptical Essays, Marriage and Morals, Conquest of Happiness అన్నవి.

1934లో వెలువడిన రస్సెల్ మహాగ్రంధం Freedom and Organization అన్నది.ఇది త్రకవిషయము.తాత్త్విక విషయము కల్గింది కాదు. పూర్తిగా రాజకీయాలకు, ఆర్థిక విషయాలకు సంబంధించింది.19వ శతాబ్దంలో అమెరికా ఐరోపా దేశాలలో జరిగిన ఆర్థిక రాజకీయమార్పులను మహత్వపూర్ణంగా ఇందులో విశ్లేషించారు.రస్సెల్ వ్రాసిన The History of Western Philosophy ఎంత గొప్పదో ఇదీ అంత గొప్పదే.

అటుపై హిట్లరిజం పుట్టింది.రస్సెల్ శాంతవాదం వదిలి పెట్టారు. Power అన్న గ్రంథం రచించారు.అధికారం అన్నదానియొక్క లక్షణాలను గుణాలను విశ్లేషించటానికి ప్రయత్నించారు. 20వ శతాబ్దం ఎదుర్కొంటున్న రాజకీయ సమస్యలను విశ్లేషించి గమినించగల రాజకీయ చింతాసంభారం అందులో కనిపించలేదు.అది ఆయనలో కొరవడింది అని చెప్పవచ్చును.1948-49 లో ఆయన ఇచ్చిన Reeth ఉపన్యాసాలలో ఈకొరత స్ఫస్పుటంగా కనిపిస్తుంది.Authority and the Individual అన్న విషయంపై ఆయన ప్రసంగాలు ఇచ్చారు.అందులో కూడా ఆయన ప్రతిభ కనిపించదు.

వృద్ధాప్యము

[మార్చు]

1950లో ఆయనకు నోబెల్ బహుమతి ఇచ్చారు.ఒకానొక అమెరికన్ విశ్వవిద్యాలయంలో ఒకానొక విద్యాపీఠాన్ని అధిష్ఠించటానికి ఏవిధంగాను పనికిరాడని కోర్టులద్వారా ప్రకటింపబడిన ఆయనను 1953లో New York National Institute of Arts and Letters గౌరవ సభ్యత్వానికి ఎన్నుకొన్నారు.ఆయన అప్పుడు వృద్ధుడు. వృద్ధుడిగా అప్పటికే మన్నలను పొదవలసిన వయస్సులో, ఆయన భావన వేరుగా ఉండేది.హైడ్రోజన్ బాంబును పగలగొట్టి పరీక్ష చేసినప్పుడు, ఆయన చేసిన రేడియో ప్రసంగములో ఆయన దానిని విమర్సించారు " మానవుణ్ణి, మానవతను మరిచి పోవద్దు. తక్కినదంతా మరిచిపోండి.ఇబ్బంది లేదు.అట్లా మీరు చేయగలిగితే అప్పుడు స్వర్గానికి నిచ్చెనలు వేయబడతాయి.అట్లా చేయని పక్షంలో విశ్వ సంహారం తప్ప మీముందు ఏమీ మిగలదు" ఇది ఆయన హెచ్చరిక.దీనినే ఆతరువాతి కాలంలో ఆయన పునరుద్ఘాటిస్తూ పరమపదించారు.

1958లో అణ్వస్త్రధారణ నిరాసోద్యమ ప్రారంభానికి ఆయన సహాయపడ్డారు.ఆ ఉద్యమం ఫిబ్రవరి నెలలో ప్రారంభం చేయబడింది.1960 సెప్టెంబరు నెలలో ఆణ్వస్త్రధారణ నిరసనోద్యమం మరీ మడికట్టుగా నడుస్తూ ఉండటంపట్ల చికాకుపుట్టి, ఆఉద్యమ అగ్రసేనాధిపతి కాల్సిన్ తో పనిచేయటం కష్టం అనిపించి రస్సెల్ అందులోంచి చీలిపోయారు. దీనినే 100 మంది సంఘం అంటారు.

1961లో ఆయన్ 80 ఏళ్ళ వయస్సులో అణ్వస్త్రధారణ శాసన ధిక్కారం చేసారు. శాంతికి భంగం కలిగిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని 100 మంది సంఘం సభ్యులను క్కోర్టుకు ఎక్కించారు. అందుకుగాను ఆయనకు రెండు నెలల కారాగార శిక్ష విధించగా ఆయన లాయరు అభ్యర్ధన మేరకు 7 రోజులకు కుదించారు.43 సం.క్రితం ఆయన అదే జైలులో శిక్ష అనుభవించారు.

1963 ప్రారంభంలో రస్సెల్ 100 మంది సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.తాను వేరే పనులలో నిమగ్నం అయి ఉన్నానని అది కూడా దీనికి సంబంధించినదే అని ప్రసంగంలో పేర్కొన్నారు.ఈ సం.లో నే రస్సెల్ రెండు ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసారు.ఒకటి బెర్ట్రాండ్ రస్సెల్ శాంతి ఫౌండేషను. రెండవది అంట్లాంటిక్ శాంతి ఫౌండేషన్. రెండు సంస్థలు కూడా అణ్వస్త్ర ప్రమాదాన్ని గురుంచి మతర్జాతీయమైన ప్రతిఘటను సాధించటం కోసం పనిచేస్తున్నవే.

రస్సెల్ తన జీవతం చివరి దశ ఉత్తరవేల్స్ లోని తన జానపద నివాసములో దాదాపు ఏకాంతనివాసం ఉంటూవచ్చారు.బయట ప్రపంచంలో ఏమైన పనులు చేయవలసి ఉంటే ఆయన తన కార్యదర్సి రాల్ఫ్ కు అధికారం ఇచ్చారు.ఆ బయటి పనులలో కొన్నిటికి ఆయన తన పేరు ఇచ్చి ఉన్నారు.వానిలో అంతర్జాతీయ యుద్ధ నేరాల న్యాయస్థానం. దానిని ప్రథమసమావేశానికి ఆయన పాల్గొన్నారు అందులో అమెరికాను దోషిగా నిర్ణయిస్తూ తీర్పు వచ్చింది. ఇట్లా చివరి రోజులలో పలు తగాదాలతో కొందరికి ప్రచోదనంగాను, కొందరికి దుస్సాధ్యమైన పనులుగా, కొందరికి ప్రీతిగా గడిపారు. చివరికి బెర్ట్రాండ్ ఆర్థర్ విలియం రస్సెల్ 1970 ఫిబ్రవరి 2న తన స్వగృహంలో 97వ యేట పరమపదించారు.


మూలాలు

[మార్చు]
  1. Hestler, Anna (2001). Wales. Marshall Cavendish. pp. 53. ISBN 076141195X.

1970 ఆంధ్రపత్రిక సంవత్సర సంచిక.