బెస్ట్ యాక్టర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెస్ట్ యాక్టర్స్‌
దర్శకత్వంఅరుణ్ ప‌వ‌ర్
రచనఅరుణ్ ప‌వ‌ర్
నిర్మాతకుమార్ అన్నంరెడ్డి
తారాగణం
  • నందు
  • మ‌ధు నంద‌న్‌
  • వర్షిణి
  • అభిషెక్ మ‌హ‌ర్షి
ఛాయాగ్రహణంవిశ్వ.డి.బి
కూర్పుఉద్దవ్‌.ఎస్‌.బి
సంగీతంజేబి
నిర్మాణ
సంస్థ
మారుతి టీం వ‌ర్క్స్
విడుదల తేదీ
28 ఆగష్టు 2015
దేశం భారతదేశం
భాషతెలుగు

బెస్ట్ యాక్టర్స్‌ 2015లో విడుదలైన తెలుగు సినిమా. మారుతి టీం వ‌ర్క్స్ బ్యానర్ పై కుమార్ అన్నంరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అరుణ్ ప‌వ‌ర్ దర్శకత్వం వహించాడు. నందు, మ‌ధు నంద‌న్‌, అభిషెక్ మ‌హ‌ర్షి, న‌వీద్ , మ‌దురిమ‌, కేషా క్రాంతి, షామిలి, భార్గవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 28 ఆగష్టు 2015న విడుదలైంది.[1]

నందు(నందు), మధు(మధు), అభి(అభి), కృష్ణ(నవీద్)లు చిన్ననాటి స్నేహితులు. నందు ఫ్యాషన్ డిజైనర్. ప్రేమ, పెళ్లి అనే వాటిని నమ్మకుండా అమ్మాయిలతో జల్సా చేస్తుంటాడు. మధు తన ఆఫీస్ లో కోరుకున్న ప్రమోషన్ కోసం, తాను ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమను చెప్పలేక బాధపడుతుంటాడు. ఇక మూడేళ్లుగా ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నో చెప్పడంతో బాధపడుతుంటాడు కృష్ణ. దర్శకుడిగా మారి ఇండస్ట్రీని మార్చేయ్యాలని చాలా అవకాశాల కోసం తిరిగి తిరిగి విసుగెత్తిపోతాడు అభి. ఇలా ఒక్కొక్కరు వారి వారి సమస్యలతో బాధపడుతున్న వీళ్లంతా ఎంజాయ్ మెంట్ కోసం గోవా వెళ్తారు. అక్కడ మీనాక్షి అయ్యర్(క్రతీ)తో కృష్ణకు పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారుతుంది. ఇక నందు, మధులకు జయసుధ(మధురిమ), జయప్రద(కేశ కంబటి)లు పరిచయం కావడం, రెండో రోజుకే వారి మధ్య అన్నీ అయిపోవడం జరిగిపోతాయి. సీన్ కట్ చేస్తే... తర్వాత రోజు నుంచి వారు కనపడరు. కానీ నందు, మధులకు కాల్ చేసి మాలో ఒకరికి ఎయిడ్స్ వుంది.. కాబట్టి.. మీ ఇద్దరిలో కూడా ఒకరికి ఎయిడ్స్ అని చెప్పి కాల్ కట్ చేస్తారు. అసలు జయప్రద, జయసుధలు ఎవరు? నందు, మధులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]
  • నందు
  • మ‌ధు నంద‌న్‌
  • వర్షిణి
  • అభిషెక్ మ‌హ‌ర్షి
  • న‌వీద్
  • మ‌దురిమ‌
  • కేషా క్రాంతి
  • షామిలి
  • భార్గవి

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: మారుతి టీం వ‌ర్క్స్
  • నిర్మాత: కుమార్ అన్నంరెడ్డి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అరుణ్ ప‌వ‌ర్
  • సంగీతం: జేబి
  • సినిమాటోగ్రఫీ: విశ్వ.డి.బి
  • ఎడిటర్: ఉద్దవ్‌.ఎస్‌.బి

మూలాలు

[మార్చు]
  1. The Times of India (2015). "Best Actors Movie Review {2.5/5}: Critic Review of Best Actors by Times of India". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  2. IndiaGlitz (29 August 2015). "Best Actors Telugu Movie Review - తెలుగు News". Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.