బెహరా కమలమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బెహరా కమలమ్మ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆధ్యాత్మిక యోగిని.

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె జనవరి 13 1904 న ఆచార్య మహా మహోపాధ్యాయ కొక్కొండ వెంకటరత్నం పంతులుకు ద్వితీయ పుత్రికగా జన్మించింది. ఈమె అయిదు సంవత్సరముల వయసులో ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు అరికాలులో ఉన్న 'చక్ర ముద్ర'ను గాంచి, ఆమె తండ్రి భవిష్యత్తులో 'కమల' అను నామధేయంతో పిలవబడి, తమ ఆరాధ్య దేవత అయిన "తనుమధ్యాంబ" పీఠమునకు వారసురాలు కాగలదని పలికారు.

ఆమెకు ఎనిమిదవ వ సంవత్సరంలో అంబాజీపేట వాస్తవ్యులు బెహరా సత్యనారాయణతో వివాహం జరిగింది. ఆ తరువాత కొంతకాలానికి వీరివురు మద్రాసు పట్టణంలోని "తిరువత్తియారు" నందుగల శ్రీ బాలాత్రిపురసుందరీ అమ్మవారిని దర్శించుకున్న పిదప అక్కడే తపస్సు గావించుచున్న బాలాజీ, శ్యామలరావు అను ఇద్దరు యోగిపుంగవులు వీరికి "మంత్రదీక్ష"ను ప్రసాదించారు.నాటి నుండి దంపతులిరివురు దేవిని ఉపాసిస్తూ సుఖజీవనం సాగించారు.

స్వప్న విశేషం[మార్చు]

1957వ సంవత్సరంలో అమ్మవారు కమలమ్మ కలలో ప్రత్యక్షమై "అన్నపూర్ణా సమేత శ్రీ ప్రతాప విశ్వేశ్వరస్వామి ఆలయ ప్రాంగణములోనే నీ నివాసం, నా నివాసం కూడా! నీకు నా సామీప్యం ప్రసాదిస్తాను.నా భక్తులకు సహయం చేస్తూ, నన్ను సేవిస్తు తరిస్తావు" అని దీవించి అంతర్దానం అయ్యింది. కమలమ్మ అమ్మవారి పీఠాన్ని దేవాలయపు సత్రపు గదిలో ఉత్తరముఖంగా దేవాలయంలోని శివునికి అభిముఖంగా ప్రతిష్ఠించారు.

ఆశ్రమ సేవలు- బోధనలు[మార్చు]

కమలమ్రు గృహస్థాశ్రమంలో ఉండి ముక్తి పొంది తరించటయే సులభోపాయమని, సన్యాసులుగా జీవించి ఉండవలసిన పనిలేదని స్వయంగా ఆచరించి చూపించింది. భక్తులనుండి ధనం అశించిన యెడల ఆ పని వారికి నెరవేరదని కూడా చెబుతూ ఉండేవారు. ఈనాటి వరకు పీఠము అదే నిస్వార్ద సేవలను అందించడం అదొక అద్భుతమైన విశేషం. మూఢచారాలను వదిలి, మనసు విశాలం చేసికొని కాలానుగుణంగా నడుచుకొవాలని ఆమె బోధించింది. "వక్రము లేని మనసే శ్రీ చక్రం" అని ఉద్బోధిస్తూ మనోనైర్మలాన్ని సాధించడమే ఆధ్యాత్మిక ఆచరణమని వివరించింది.ఆర్దికంగాను, ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను వెనుకబడిన ఎంతోమంది స్త్రీలను తమ ఉపదేశాలద్వారా, ఆచరణ ద్వారా చైతన్యవంతులను చేసారు. స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం కావాలని చెబూతూ స్వయంగా తన కుమార్తెలను కూడా సుమారు 1950వ సంవత్సరం ముందే స్కూలు ఫైనల్ వరుకూ చదివించి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశపెట్టారు. తనను అశ్రయించిన వారిని స్వయంగా తీర్దయాత్రలను చేయించడం ద్వారా వారి వారి గ్రహస్ధితులను మెరుగుపరచి మానసిక ధైర్యాన్ని, శక్తిని పెంపొందింపచేస్తూండేవారు. తాను స్వయంగా, మద్రాసు నగర పరమగురువులైన బాలజీ, శ్యామలరావు ల వద్ద మంత్రదీక్షనుపొంది, నియమబద్దంగా అనుష్టించి గురువులయొక్క ప్రాముఖ్యాన్ని చాటిచెప్పారు. ప్రజలు హిందూ ధర్మ శాస్త్రాలను, సామాజిక విలువలను పాటించాలని చెప్పేవారు. ఆమె భగవంతుని కీర్తనల ద్వారా చేరడం సులభమని స్వయంగా భక్తి గీతాలను వ్రాసి గానం చేస్తూ అమ్మవారిని ప్రసన్నం చేసేవారు.సాటి మనిషికి ఉపకారము చేయడంలో ఉన్న సంతృప్తి, తద్వారా పొందే ప్రతిఫలమే పుణ్యమనీ, జీవితాంతం పుణ్యకార్యాలు చేసి తరించడం ముక్తికి మార్గమని బోధించారు.

అస్తమయం[మార్చు]

1977 వ సంవత్సరం డిసెంబర్ 13వ తేదీ న (మార్గశిర శుద్ధ చవితి) బ్రహ్మరంద్రం ద్వారా, ప్రాణోత్ర్కమణం జరిగి, ఆమె అనంతశక్తిలో ఐక్యం అయినది. దీనినే శాస్త్ర ప్రకారంగా కపాలమోక్షం అని కూడా వ్యవహరిస్తారు. ఈ స్థితి సిద్దపురుషులకు, పునీతమైన దైవాంశ సంభూతులకు మాత్రమే సంభవం

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]