బైండోవర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బైండోవర్ ' లేదా బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్ భారతీయ శిక్షా స్మృతి ప్రకారం అమలయ్యే ఒక చట్టము.

వివరణ[మార్చు]

ఒక వ్యక్తి వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావిస్తే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తహసీల్దారు లేదా ఆర్డీవో ఎదుట ప్రవేశపెడుతారు. భారతీయ శిక్షా స్మృతి (ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) (సీఆర్‌సీ) 107, 108, 109, 110 సెక్షన్ల కింద ఈ బైండోవర్ కేసులను నమోదు చేస్తారు. చట్ట వ్యతిరేక చర్యలు చేపట్టబోనని బాండ్ పేపర్‌పై లిఖిత పూర్వకంగా హామీ తీసుకుంటారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తారు. ఆ వ్యక్తి మరల చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదు అందితే 24గంటల్లో అతన్ని అరెస్టుచేస్తారు. ఈ బైండోవర్ పత్రాలు ఆర్నెల్లు పోలీసుల వద్దే ఉంటాయి.

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బైండోవర్&oldid=1197260" నుండి వెలికితీశారు