బైపోలార్ డిజార్డర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బైపోలార్ డిజార్డర్
Classification and external resources
ICD-10F31
ICD-9296.0, 296.1, 296.4, 296.5, 296.6, 296.7, 296.8
OMIM125480 309200
DiseasesDB7812
MedlinePlus001528
eMedicinemed/229
MeSHD001714

జీవితంలో మానసికంగా కొన్ని హెచ్చుతగ్గులు సర్వసాధారణం. అయితే బైపోలార్ డిజార్డర్ (Bipolar disorder) ఉన్నవారిలో ఈ మానసిక అసమతౌల్యతలు విపరీతంగా ఉంటాయి. అంటే సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోనుకావడం, అలాగే బాధగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కుంగిపోవడం జరుగుతుంది. ఎక్కువ ఎగ్జయిట్‌మెంట్‌కు లోనుకావడాన్ని హైపోమేనియా (Hypomania) అంటారు.

హైపోమేనియాలో ఉన్న వ్యక్తి తనను తాను చాలా శక్తిమంతుడిగా భావిస్తాడు. తిండి, నిద్ర సరిగా లేకపోయినా ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గానే ఉంటాడు. అన్నిపనులూ వేగంగా ఉంటాయి. లైంగిక ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానం తగ్గిపోతుంది. ఒక పని చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో అన్న ఆలోచన రాకపోవడం వల్ల జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి.

కుంగిపోవడాన్ని బైపోలార్ డిప్రెషన్ అంటారు. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు చిరాకు పడటం, శక్తిహీనుడుగా అయిపోవడం, ఆకలి తగ్గడం లేదా పెరగడం, శరీరం బరువులో మార్పు, నిద్రలేమి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గిపోవడం వంటి మార్పులు జరుగుతాయి.

మేనియాకు చికిత్స తీసుకుంటున్నప్పుడు డిప్రెషన్, డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నప్పుడు మేనియాలోకి వెళ్లడం జరిగే అవకాశం ఉంటుంది. సరయిన కారణాన్ని కనిపెట్టి కాన్‌స్టిట్యూషన్ పద్ధతిలో హోమియో మందులు వాడుతూ సరయిన కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే సమస్యను సులభంగా పూర్తిగా తగ్గించవచ్చు.

ఈ సమస్య రావడానికి మానసిక పరమైన ఒత్తిడి ముఖ్యకారణం. సాధారణంగా ఆఫీసు ఒత్తిడి, ప్రేమవ్యవహారాలు, జీవితంలో ఓటమి, ఆత్మీయులను కోల్పోవడం వంటి కారణాలు ఉండవచ్చు. కొన్నిసార్లు మాదకద్రవ్యాలు వాడటం, ఇతర సమస్యలకు వాడుతున్న ఇంగ్లిష్ మందులు శరీర తత్వానికి సరిపడకపోవడం, తగినంత నిద్రలేకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది.

బయటి లింకులు[మార్చు]