బైలంపుడి
స్వరూపం
బైలంపుడి | |
---|---|
దర్శకత్వం | అనిల్ పీజే రాజ్ |
రచన | అనిల్ పీజే రాజ్ |
నిర్మాత | బ్రహ్మానంద రెడ్డి |
తారాగణం | హరీష్ వినయ్ తనిష్క్ రాజన్ బ్రహ్మానంద రెడ్డి |
ఛాయాగ్రహణం | అనిల్ పీజే రాజ్ |
కూర్పు | జేపీ (జానకిరామ్ రామరాజు) |
సంగీతం | సుభాష్ ఆనంద్ |
నిర్మాణ సంస్థ | తార క్రియేషన్స్ |
విడుదల తేదీ | జూలై 27, 2019 |
సినిమా నిడివి | 118 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బైలంపుడి 2019లో విడుదలైన తెలుగు సినిమా.[1] తార క్రియేషన్స్ బ్యానర్ పై బ్రహ్మానందరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అనిల్ పీజే రాజ్ దర్శకత్వం వహించాడు. హరీష్ వినయ్, తనిష్క తివారి, బ్రహ్మానంద రెడ్డి, సుచిత్ర, గణి, గోవింద్, నటరాజ్, నరి, నాగార్జున, సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 27 జులై 2019న విడుదలైంది.[2]
కథ
[మార్చు]బైలంపుడి గ్రామంలో గ్రామ పెద్ద గురు నారాయణ్ (బ్రహ్మానందరెడ్డి) ఊర్లోవారందరికి భయంతో కూడిన గౌరవం. గురు నారాయణ్ దగ్గర పెరుగుతున్న కళ్యాణి (తనిష్క్ రాజన్) అదే ఊరిలో ఆటో నడిపే రవి (హరీష్ వినయ్) ని ఇష్టపడుతుంది. ఈ క్రమంలో రవి స్నేహితుల్లో ఒకరు హత్యకు గురవుతాడు. అసలు రవి స్నేహితుడ్ని చంపిందెవరు ? ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- హరీష్ వినయ్
- తనిష్క తివారి
- బ్రహ్మానంద రెడ్డి
- సుచిత్ర
- గణి
- గోవింద్
- నటరాజ్
- నరి
- నాగార్జున
- సెబాస్టియన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: తార క్రియేషన్స్
- నిర్మాత: బ్రహ్మానంద రెడ్డి [3]
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: అనిల్ పీజే రాజ్ [4]
- సంగీతం: సుభాష్ ఆనంద్
- సినిమాటోగ్రఫీ: అనిల్ పిజి రాజ్
- మాటలు: సాయి
- ఎడిటర్: జానకిరామ్
- ఫైట్స్: కృష్ణం రాజ్
- ఆర్ట్: ఉత్తమ్‌కుమార్
- కొరియోగ్రఫీ: ఘోరా,
- పాటలు: రామారావు,
- పిఆర్వో: వంగాల కుమారస్వామి
మూలాలు
[మార్చు]- ↑ Reddy (25 October 2018). "పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో..." Archived from the original on 27 సెప్టెంబరు 2021. Retrieved 27 September 2021.
- ↑ The Times of India (27 July 2019). "Bailampudi Movie: Showtimes". Archived from the original on 27 సెప్టెంబరు 2021. Retrieved 27 September 2021.
- ↑ Mana Telangana (28 July 2019). "ఇక్కడ యుద్ధం చేయాలి... గెలవడానికి కాదు, బతకడానికి!". Archived from the original on 27 సెప్టెంబరు 2021. Retrieved 27 September 2021.
- ↑ Sakshi (4 August 2019). "'యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా'". Archived from the original on 27 సెప్టెంబరు 2021. Retrieved 27 September 2021.