బొడ్డురాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొడ్డురాయి (నాభిశిల))

బొడ్డురాయి అంటే గ్రామం మధ్యలో నిలువుగా నాటిన రాయి. కలరా మశూచి మొదలగు సాంక్రామిక సాంఘిక వ్యాధులు, పశువ్యాధులు సోకకుండా ఉండేందుకు గ్రామవాసులు ఈ రాయిని పూజిస్తారు. ఇది మహాలక్ష్మి అంశమైన శీతల దేవత ప్రతికృతిగా భావిస్తారు. గ్రామంలో అరిష్టము లేర్పడినప్పుడు, బైండ్ల (భవనీయ, శక్తి బ్రాహ్మణులు) పూజారులు శీతల యంత్రం బొడ్రాయి (నాభిశిల)అడుగుభాగనా ప్రతిష్టించి, ప్రాణప్రతిష్ట చేస్తారు.బొడ్రాయి అని కూడా అంటారు. ప్రతిష్ట అనంతరం పంచరంగుల చంద్రపటం వేసి బొడ్రాయి యొక్క కథానేపధ్యాన్ని జమిడీక వాయిద్యంతో బైండ్ల పూజారులు వివరిస్తారు. ఈ ప్రక్రియ అతంత ప్రతిష్టాత్మకమైనది, ఈ క్రతువులు కేవలం శాక్తేయ సంప్రదాయంలో శక్తి బ్రాహ్మణులైన బైండ్ల (భవనీయ ) పూజారులు మాత్రమే నిర్వహించాలి.[1]

1. బొడ్డురాయి - ధ్వజస్తంభమువంటిది. గ్రామంలో జరిగే శుభకార్యాలన్నిటిలో ఈ రాయి దగ్గరకు వచ్చి పూజాదులు చేసి వెళ్లుదురు. [మహబూబ్‌‍నగర్]

2. గ్రామ నడిబొడ్డున అరుగువలె అమర్చిన పెద్దబండ - దీనిని చవికవలె ఉపయోగింతురు. [నెల్లూరు]

మూలాలు[మార్చు]

  1. "A 'Bodrai' resurgence". The Statesman (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-09-26. Archived from the original on 2021-06-20. Retrieved 2020-08-28.

బాహ్య లంకెలు[మార్చు]