Jump to content

బొత్తం

వికీపీడియా నుండి
(బొత్తా నుండి దారిమార్పు చెందింది)
నాలుగు రంధ్రాలు గల ఒక తెల్ల బొత్తా
నాలుగు రంధ్రాలు గల ఒక తెల్ల బొత్తా

బొత్తా లేదా గుండీ ఒక వస్త్రపు రెండు భాగాలను కలిపి ఉంచే ఒక వస్త్ర పరికరము. వస్త్రపు ఒక భాగానికి బొత్తా దారంతో దానికున్న రంధ్రాల గుండా కుట్టబడి ఉండగా, మరొక భాగానికి ఈ బొత్తా సరిగ్గా ఇమిడేంత రంధ్రము ఉంటుంది. ఈ రంధ్రాన్నే కాజా అంటారు. సాధారణంగా బొత్తా ప్లాస్టిక్ తో చేయబడి ఉంటుంది. నాలుగు రంధ్రాల బొత్తాలు వాడుకలో ఎక్కువగా ఉన్ననూ, రెండు/మూడు రంధ్రాల బొత్తాలు కూడా లభ్యము.

ప్లాస్టిక్ వే కాకుండా లోహంతో చేసిన బొత్తాలు కూడా ఉంటాయి. నొక్కుడు బొత్తాలకి కాజాలు ఉండవు. కాజా స్థానంలో మధ్యన ఎత్తు గల మరొక బొత్తా ఉంటుంది. అసలు బొత్తాకి మధ్యన రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రం ఒక వైపుకే ఉంటుంది. రంధ్రమున్న బొత్తాని ఎత్తు ఉన్న బొత్తా పై నొక్కితే అది ఇమిడిపోతుంది. జీంస్ ప్యాంటు జిప్పు స్థానంలో (కాజాలు కలిగిన) లోహపు బొత్తాలని వినియోగిస్తారు. ఒకప్పుడు మర్మాయవాల భద్రత కై ప్యాంటుకి కూడా కాజాల బొత్తాలనే వినియోగించారు. తర్వాతి కాలంలో సౌకర్యార్థం జిప్పులే ప్రజాదరణ పొందాయి.[1]

బొత్తాల వినియోగం

[మార్చు]
  • షర్టు - మధ్య భాగం, బటన్ డౌన్ కాలర్, సింగిల్ కఫ్ (డబల్ కఫ్ లకి కఫ్ లింకులు వాడతారు)
  • ప్యాంటు, లాగు - నడుము భాగం (వీటి స్థానే కొండీలు కూడా వాడతారు), జిప్పు స్థానంలో
  • కోటు మధ్యలో, ల్యాపెల్/కఫ్ ల పైన (ఇవి అలంకార ప్రాయమే, వీటినే ఫాల్స్ బటంస్ అంటారు)
  • కుర్తా, పఠానీ, షేర్వానీలు

మూలాలు

[మార్చు]
  1. McNeil, Ian (1990). An encyclopaedia of the history of technology. Taylor & Francis. 852. ISBN 0-415-01306-2.
"https://te.wikipedia.org/w/index.php?title=బొత్తం&oldid=3849589" నుండి వెలికితీశారు