షేర్వానీ
షేర్వానీ (ఉర్దూ: شیروانی ; హిందీ: शेरवानी) దక్షిణ ఆసియాలో ధరించే కోటు వంటి వస్త్రం. ఇది పాకిస్థాన్ దేశపు జాతీయ వస్త్రంగా గుర్తించబడిననూ ఉత్తర భారతదేశనికి చెందిన ముస్లిం రాచరిక వంశాల వారు కూడా దీనిని ధరించేవారు. పైజామాతో వేసుకొన్న కుర్తా పై కానీ, కమీజ్ తో బాటు ధరించే సల్వార్ పై కానీ దీనిని ధరిస్తారు. బ్రిటీషు ఫ్రాక్ కోట్ ని సల్వార్ కమీజ్ని కలిపి రూపొందించినదే ఈ షేర్వానీ.
చరిత్ర
[మార్చు]దక్షిణ ఆసియాలో ఆస్థాన దుస్తులుగా ఉద్భవించినవి షేర్వానీ 18 వ శతాబ్దంలో జనానికి చేరువయ్యే ముందు రాజులు, మంత్రులచే ధరించబడేది. తర్వాతి భూస్వాములు, ప్రధానంగా ముస్లిం లు, అటు పిమ్మట సాధారణ జనాలు దీనిని ధరించటం మొదలు పెట్టారు. ఉర్దూ భాష వలె, షేర్వానీ కూడా ముస్లిం లకు గుర్తింపు అయినది. పాకిస్థాన్, భారతదేశం ల స్వాతంత్ర్య సాధన పూర్వం అలీఘర్ మూవ్ మెంట్ లలో షేర్వానీ గుర్తింపుగా కనబడేది. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఇప్పటికీ దీని ధారణ ఉంది. హైదరాబాదు నిజాంలు, ఆస్థానులు కూడా దీనిని ధరించే వారు.
పాకిస్థాన్
[మార్చు]సంస్కృతి, ప్రత్యేకించి వస్త్రాల విషయంలో ఆంగ్లుల పట్ల ప్రభావితమైన ముహమ్మద్ అలీ జిన్నా పాకిస్థాన్ స్వాతంత్ర్య సాధన తర్వాత తరచుగా షేర్వానీని ధరిస్తూ దానినే జాతీయ వస్త్రంగా చేశాడు. అది వరకు ఆంగ్లులనే అనుకరించిన జిన్నా వద్ద 200 కు పైగా దర్జీల చే కుట్టించుకొనబడ్డ సూట్లు ఉండేవనీ, డిటాచబుల్ కాలర్లతో బాగా గంజి పెట్టిన చొక్కాలు ధరించేవాడనీ చెప్పుకోలు. చివరి రోజుల్లో జిన్నా ఎక్కువగా షేర్వానీ, కారాకుల్ టోపీ నే ధరించారు. కారాకుల్ టోపీ జిన్నా టోపీగా స్థిరపడిపోయింది. జిన్నాని అనుసరిస్తూ అక్కడి రాష్ట్రపతి, ప్రధాన మంత్రులతో బాటు ప్రభుత్వ అధికారులు అధిక సంఖ్యలో ప్రముఖ దినాలకు సల్వార్ కమీజ్ పై నల్లని షేర్వానీ ధరించటం మొదలు పెట్టారు. వివాహ వేడుకలలో వరుడు తలపాగాతో బాటు ఎంబ్రాయిడరీలు కల షేర్వానీని ధరించటం సాంప్రదాయంగా వస్తున్నది. పాకిస్థానీయులు ఎక్కువగా సల్వార్ కమీజ్ పై షేర్వానీ ధరించటం పై ఎక్కువ ఆసక్తి కనబరచగా భారతీయులు చుడీదార్ పై షేర్వానీ ధరించటం వైపు మొగ్గు చూపుతారు.
భారత్
[మార్చు]చలికాలంలో, సంప్రదాయిక దుస్తులుగా షేర్వానీని భారతదేశంలో రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, హైదరాబాద్కు చెందిన ముస్లింలు ధరిస్తారు. భారతీయ హిందువులు అచ్కన్ ధరించగా ముస్లింలు షేర్వానీ ధరిస్తారు. ఈ రెండూ ఇంచుమించు ఒకే రకంగా ఉన్ననూ షేర్వానీలు నడుము వద్ద నుండి క్రింద వరకు ఎక్కువ వదులుగా ఉంటాయి. హైదరాబాదీ నిజాంలు ధరించే షేర్వానీలు పొడవు ఎక్కువగా మోకాళ్ళ క్రిందవరకూ ఉండేవి.
ఉభయ బెంగాల్ లు
[మార్చు]బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ లలో వివాహాలతో బాటు సంగీత కచేరీలలో కూడా షేర్వానీని ధరిస్తారు.
సిలోన్
[మార్చు]బ్రిటీషు హయాంలోని సిలోన్ (శ్రీలంక) లో ముదలియార్ లు షేర్వానీని ధరించేవారు. విదేశాలలో శ్రీ లంక పౌరులు షేర్వానీని సాంప్రదాయిక దుస్తులుగా వాడుకని అక్కడి ప్రభుత్వం గుర్తించింది.
ఆధునిక షేర్వానీలు
[మార్చు]చిత్రమాలిక
[మార్చు]-
షేర్వానీ ధరించిన గాయకుడు సోనూ నిగం
-
షేర్వానీ ధరించిన ఒక హైదరాబాదీ ముస్లిం పెద్దమనిషి