లాగు

వికీపీడియా నుండి
(నాడాలు కలిగిన లాగు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
లాగు

లాగు లేదా నిక్కరు (knickers) అనునది నడుము నుండి తొడల లేదా మోకాళ్ళ పై/క్రింద లేదా పిక్కల పై/క్రింద వరకు రెండు కాళ్ళను విడివిడిగా చుట్టే వస్త్రము. (ఎట్టి పరిస్థితులలోనూ ఇవి మొత్తం కాళ్ళకి ఆచ్ఛాదననివ్వవు). పాశ్చాత్యదేశాలలో ఇవి చిన్నపిల్లలతో బాటు స్త్రీపురుషులు సమానంగా ధరించిననూ, భారతదేశంలో ఒకప్పుడు ఇవి కేవలం బాలుర దుస్తులు మాత్రమే. పాశ్చాత్య నాగరిక ప్రభావంతోతో ఈ కాలంలో జీంస్ తో చేసిన లాగులు, బాక్సర్ షార్ట్ లు, బెర్మూడా షార్ట్ లు, త్రీ-ఫోర్త్స్ వంటి విభిన్న లాగులు చిన్నపిల్లల్తో బాటు భారతదేశంలోనూ స్త్రీపురుషులు సమానంగా ధరిస్తున్నారు. వెచ్చని వాతావరణాలలో, గాలి ఎక్కువగా సోకే అవసరం ఉన్నప్పుడు, కాళ్ళకు ఆసాంతం ఆచ్ఛాదన అవసరం లేనప్పుడు వివిధ రకాల లాగులను వాడుతూ ఉంటారు.

బాలుర నిక్కరు[మార్చు]

ఉదరభాగం వద్ద రెండు బొత్తాలు కానీ కొండీలు (హుక్స్) గానీ ఉంటాయి. తొడల వరకు ఉంటాయి. అత్యధిక పాఠశాలలకి సాధారణంగా తెల్ల రంగు చొక్కా ముదురు నీలం రంగు నిక్కరులు యూనిఫాంగా ఉంటాయి. సౌకర్యం కోసం ఇంటి వద్ద/ఆటలాడే సమయాలలో వేసుకొనే వాటికి బొత్తాలు/కొండీల బదులుగా ఎలాస్టిక్ కూడా ఉండవచ్చును. ఒక్కోమారు ఎదిగే పిల్లలకి బిగుతు అయ్యే సమస్యను అధిగమించటానికి ముందు వైపు బొత్తాలు/కొండీలు ఉన్ననూ వెనుక వైపు కొంత/పూర్తిగా ఎలాస్టిక్ ఉంటుంది. మూత్రవిసర్జన చేసుకొనుటకు వీలుగా ఉదరభాగం క్రింద బొత్తాలు, జిప్ తో కూడిన ఓపెనింగ్ ఉంటుంది.

బాక్సరు షార్ట్[మార్చు]

సాధారణంగా ఇవి పురుషుల లోదుస్తులు అయిననూ ఇంట్లో ఉన్నప్పుడు, అసాంప్రదాయిక సందర్భాలలో వీటిని స్త్రీలు పురుషులు పిల్లలు సమానంగా ధరిస్తారు. వీటి అసాంప్రదాయిక ధారణ కేవలం మహానగరాలలో ఉంది. గడులు, చారలు, ఇతర డిజైనులలోనూ ఇవి లభ్యం.

ఉదరభాగం వద్ద బొత్తాలు, కొండీలు ఉండవు. కేవలం ఎలాస్టిక్ మాత్రం ఉంటుంది. మూత్రవిసర్జన నిమిత్తం ఒకే ఒక బొత్తా ఉంటుంది. తొడల వరకే ఉంటాయి. గజ్జెలలో చర్మవ్యాధులు సోకినప్పుడు (ఆ ప్రాంతంలో గాలి బాగా సోకటానికి) వైద్యులు బిగుతుగా ఉన్న ఎలాస్టిక్ డ్రాయర్లకి ప్రత్యాన్మాయంగా వీటిని/వీటిని పోలిన వాటిని ధరించమని సలహా ఇస్తారు.

చాలా కార్టూనులలో, సినిమాలలో ప్యాంటు మరచిపోయిన పురుషులు వీటిని ధరించటం హాస్యాస్పదంగా చూపుతుంటారు.

బెర్మూడా షార్ట్[మార్చు]

ఇవి మోకాళ్ళ వరకూ ఉంటాయి. బెర్మూడా దేశంలో ఇవి సాంప్రదాయికమైననూ, భారతదేశంలో ఇవి అసాంప్రదాయికాలే

త్రీ-ఫోర్త్[మార్చు]

ఇవి పిక్కల వరకూ ఉంటాయి. ఆధునిక యువత (స్త్రీ/పురుషులిరువురూ) వీటిని ధరించటం చాలా ఇష్టపడతారు. ఒక్కోమారు స్త్రీలకు ప్రత్యేకంగా రూపొందించిన వీటికి బెల్-బాటం ఫిట్టింగ్ తో రూపొందిస్తారు. వీటికి ఇస్త్రీ అవసరం అవుతుంది.

నాడాలు కలిగిన లాగు[మార్చు]

నాడాలు కలిగిన లాగు భారతదేశ పురుషుల లోదుస్తులలో ఒకటి. దీనిని పంచె/లుంగీల లోపల ధరిస్తారు. సాధారణంగా ఇది నీలి రంగులో ఉండి వాటి మీద వేర్వేరు రంగుల చారలు ఉన్ననూ (పైజామాలు కుట్టే గుడ్డ), రంగులు చారలు పూర్తిగా వ్యక్తిగ్తతం. వీటికి నాడాలు ఉంటాయి. వాటిని లాగటం వలన ఇది బిగుతు అవుతుంది. కావలసినంత బిగుతు అయ్యేంతవరకు లాగి తర్వాత జారకుండా ఈ నాడాలు ముడి వేయాలి. ఇవి తొడల వరకే ఉంటాయి. సాధారణంగా తొడల వద్ద (బాక్సరు షార్టు వలె) వదులుగా ఉండి, జేబులు లేకుండా ఉంటాయి. కొందరు వ్యక్తిగతంగా నడుముకిరువైపులా జేబులు పెట్టించుకొంటారు.

తెల్లని పంచెలు మరీ దళసరిగా ఉన్నప్పుడు కానీ, నీళ్ళలో తడిచినపుడు గానీ, ఆడ్డపంచె కట్టినప్పుడు గానీ, ఇవి కనబడుతుంటాయి.

నడుము వద్ద ఎలాస్టిక్ ఉన్న బాక్సరు షర్టులు పట్టణాలలో విరివిగా లభ్యం కావటంతో, నాడాలు కట్టుకోవలసిన అవసరం లేకపోవటంతో, కొందరు వీటికి దూరం అయిననూ, పంచెలు వాడేవారు, గ్రామాలలో ఇంకనూ వీటిని ఉపయోగిస్తున్నారు.

  • సినిమాలలో ఎవరైనా తారలను లోదుస్తులతో చూపాలనుకున్నపుడు వీటిని వాడుతుండేవారు, జైలు సన్నివేసాల సందర్భంలోనూ ఈ లాగూలను వాడుతుంటారు. ఉదాహరణగా అల్లురామలింగయ్య లాంటి వారు పలు చిత్రాలలో వీటితో కనిపించడం జరిగింది.

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=లాగు&oldid=2988306" నుండి వెలికితీశారు