లంగా
Jump to navigation
Jump to search
లంగా భారతీయ స్త్రీలు ధరించే ఒక రకమైన దుస్తుల లో ఒకటి. లంగాకు నాడాలు ఉంటాయి. ముడి నడుముకి కుడివైపు వచ్చేలా కడతారు. ఈ ముడిని నడుము కుడి భాగం నుండి ఎడమ భుజం వైపుకి వెళ్ళే పైట కప్పివేస్తుంది. లంగాలు రెండు రకాలు. లోపలి లంగా, పై లంగా (పావడ/పరికిణీ) .
పెళ్ళైనవారు చీర లోపల కనిపించకుండా ధరిస్తారు. ఇది సామాన్యంగా నూలుతో చేసినదై ఉంటుంది.
అయితే పెళ్ళికి ముందు లంగా ఓణిలు కలిపి ధరించడం ఆంధ్రదేశంలో సాంప్రదాయంగా ఉండేది. ఇవి పండుగలలో పట్టుతో చేసి వివిధ రంగులలో అంచులతో అందంగా కనిపిస్తాయి. పైలంగాలను పైట లోపల, బయటికి కనిపించేలా (లోపలి లంగా పైన) ధరిస్తారు.
ఈ వ్యాసం జీవన విధానానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |