పరికిణీ
పరికిణీ | |
"పరికిణీ" పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | తనికెళ్ళ భరణీ |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | కవితల సంకలనం |
ప్రచురణ: | |
విడుదల: | 2000 |
పరికిణీ తెలుగు సినిమా నటుడు, సాహిత్యకారుడు, దర్శకుడు తనికెళ్ల భరణి రాసిన కవితల సంకలనం. తత్త్వాలు, నాటకాలు, నాటికలు, సినిమా స్క్రిప్టు, సంగీతకారుల జీవితచిత్రాలు వంటి ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేసిన భరణి పరికిణీ పుస్తకం తన వచన కవిత్వంతో ప్రచురించాడు.
రచన నేపథ్యం
[మార్చు]పరికిణీ పుస్తకాన్ని 2000లో తొలి ప్రచురణ చేశారు. అనంతరం ఏప్రిల్ 2002లో ద్వితీయ ముద్రణ, 2007లో మూడవ ముద్రణ, జనవరి 2011లో నాలుగవ ముద్రణ పొందింది.
విశేషాలు
[మార్చు]మొదటి కవిత – “మధ్యతరగతి నటరాజు” లో మధ్యతరగతి వాడినీ, నటరాజునీ పోల్చి రాసాడు. వివిధాంశాలపైన, భరణి గారి కవితల సంకలనం ఇది. నవరసాల కవితలూ ఉన్నాయి. ''కన్నీటి బిందువుని మించిన కావ్యం నాకు కనపళ్ళేదు'' అని అనగలిగాడు భరణి. భరణి అనుభవ కవి. కవితలన్నీ అతడు మాట్లాడుతున్నట్టే ఉంటాయి. కాలరు బిగించుకుని మాట్లాడడు. కలలు వెదజల్లుతున్నట్టు, కన్నీళ్ళు ఆరబోసుకున్నట్టు మాట్లాడతాడు. ప్రతి కవిత కిందా అది రాసిన నేపథ్యం రాసాడు. [1] ఇవి నిజానికి భరణి అనుభవాల, అనుభూతుల నుండి రాలిన భావోద్వేగాలు. వీటిలో కవిత్వం మాత్రమే కాదు, కసి, కోపం, ద్వేషం, ప్రేమ, అసహనం, ఆప్యాయత, హాస్యం, భయం, వీరం అన్నీ కనిపిస్తాయి. మద్యతరగతి మనుషుల్లో కనిపించే చిత్రాలు, విచిత్రాలను తనదైన శైలిలో కళ్ళెదుట కనిపించేట్టు చేస్తారు భరణి. ఆయన శైలి మనతో మాట్లాడినట్టో లేదా నిలదీసి అడుగుతున్నట్టో అనిపిస్తుంది. అక్షరాలను ఆయుధాలుగా చేసి బాణాలుగా వదిలిన 26 కవితల ఈ సమాహారంలో ఒక్కో కవిత ఒక్కో సాక్ష్యం అనడం అతిశయోక్తి కాదు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Parikini - పరికిణీ by Tanikella Bharani - Parikini". anandbooks.com/ (in ఇంగ్లీష్). Archived from the original on 2020-02-13. Retrieved 2020-05-10.
- ↑ "ఎన్నెన్నో వర్ణాల పరికిణీ!". సారంగ (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-09-30. Retrieved 2020-05-10.
బయటి లింకులు
[మార్చు]http://kinige.com/kbook.php?id=122 Archived 2011-04-29 at the Wayback Machine