మైక్రో మిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక డెనిం మైక్రో స్కర్ట్
మైక్రోస్కర్ట్ ధరించిన ఒక యువతి

మైక్రో స్కర్ట్ లేదా మైక్రో-మినీ స్కర్ట్ అత్యంత పొట్టిదైన స్కర్ట్. 8 అంగుళాల పొడవుండి ఇది మినీస్కర్టు కంటే కూడా కురుచైనది. ఇంత తక్కువ పొడవుతో మైక్రో స్కర్ట్, తొడలను, పిరుదుల క్రింది భాగంతో పాటు కొంత వరకు లోదుస్తులు (అండర్‌వేర్‌) ను కూడా బహిర్గతం చేస్తుంది. పిరుదులు, లోదుస్తులను బహిర్గత పరచకుండా ఉండేందుకు మైక్రో స్కర్టులను కొన్ని సందర్భాలలో టైట్లు, లెగ్గింగులు, షార్టులు లేదా బ్లూమర్లతో పాటు ధరించడం ఆనవాయితీ. కానీ వట్టి కాళ్లతో కూడా మైక్రో స్కర్టును ధరించే అలవాటు కూడా ఉంది. వీటిని ప్రధానంగా యుక్త వయసులోని అమ్మాయిలు తమ కొంటెతనాన్ని ప్రదర్శించడానికి మరియు ఆటపట్టించడానికి ధరిస్తూ ఉంటారు. అది కూడా కొన్ని సామాజిక సందర్భాలలో, తగినటువంటి బాడీ లాంగ్వేజ్‌తో సరితూగే సమయాల్లో మాత్రమే ఇటువంటి ఆఛ్ఛాదనను ధరిస్తారు.

మైక్రో స్కర్టును కొన్ని సార్లు హాస్యాస్పదంగా బెల్టు స్కర్టు అని కూడా వ్యహరిస్తారు. పేరుకే ఇది స్కర్టు, దీనికి కప్పి ఉంచే ప్రయోజనమేమీ లేదన్న భావనతో మైక్రో స్కర్టును ఉదహరిస్తారు. కొందరు[ఎవరు?] మైక్రోస్కర్టును తమ పిరుదుల దిగువభాగాన్ని బహిరంగ పరచాలని సచేతనంగానో, అంతశ్చేతనంగానో కోరిక కలవారే, వేసుకుంటారని భావిస్తారు. సాగే మైక్రోస్కర్టులను కొన్నిసారు స్పాండెక్స్ అనే వస్త్ర పదార్ధంతో తయారుచేస్తారు. ఇలాంటి వాటిని సాహసం మెండుగా ఉన్న యువతులు హోల్డప్స్ మరియు స్టిలెట్టో హీల్స్ ఉన్న పాదరక్షలతో సహా ధరిస్తారు. కొన్నిసార్లు జీ-స్ట్రింగ్ అనే లోదుస్తుల పాటు కూడా ధరిస్తారు.

మైక్రో స్కర్టును చాలా అరుదుగా మాత్రమే బహిరంగ ఆఛ్ఛాదన (వీధిలో ఆచ్ఛాదన) గా ధరిస్తారు. సాధారణంగా వీటిని ఛీర్‌లీడింగ్ యువతలు, స్టేజి మీద ప్రదర్శనలిచ్చే సందర్భాలలో కొందరు గాయనులు ధరిస్తారు. ఉదాహరణకు ఫెర్గీ,[1] మిక్కీ గ్రీన్,[2] బెయాంసీ నౌలెస్ తదితరులు. గ్వినెత్ పాల్త్రో లాంటి సెలబ్రిటీలు ఎటువంటి హంగామా లేకుండా మైక్రో స్కర్టును ధరించిన సందర్భాలున్నాయి.[3] జపాన్లో మినీస్కర్టులు బాగా ప్రాచుర్యం పొందాయి. అక్కడ అవి పాఠశాల యూనీఫార్ములలో భాగమయ్యాయి. కోగల్ అనే ఉప సంస్కృతిలో భాగంగా మైక్రోస్కర్టులు ధరించడం పరిపాటైపోయింది.[4] పంచీరా అనే ఒక ప్రదర్శనా ధోరణిని అవలంబించే యువతులలో మైక్రోస్కర్టులు ప్రాచుర్యమైనవి. స్ట్రిప్ క్లబ్బులలో ఫ్లోరుపై నృత్యం చేసే స్ట్రిప్పర్లలో కూడా మైక్రోస్కర్టులు చాలా ప్రచురితమైనవి.

మైక్రోస్కర్టు మేరీ క్వాంట్ వంటి దుస్తుల డిజైనర్లచే ప్రాచుర్యం చేయబడి 1960వ దశకపు చివర్లో ఐరోపాలో అవతరించింది. ఆ కాలం నాటి తొలి మైక్రోస్కర్టులు కాస్త పొట్టైన మినీస్కర్టుల్లుగానే ఉండేవి, ధరించే వ్యక్తి యొక్క తొడలను మరి కొంచెం ఎక్కువ మాత్రమే చూపించేవిగా ఉండేవి. రాను రాను మరింత పొట్టి అవతారాలు లభ్యమవటం ప్రారంభమైంది. కొన్ని ఎంత పొట్టి వంటే వాటి అంచులు తొడల పైభాగంలో నిలచి తరచూ లోదుస్తుల దర్శనం గావించేవి. కొంత మంది ఇంకా పొట్టి వైన మైక్రోస్కర్టు శైలులను ధరించడం ప్రారంభించారు. ఇవి పిరుదుల కొంత భాగాన్ని బహిర్గతం చేసేవి. అయితే ఇవి ముందువైపు కాస్త ఎక్కువే లోదుస్తులను చూపిస్తున్నాయని కొంతమంది వీటిని అసభ్యకరమైనవిగా భావించారు. మరి కొంత మంది అమ్మాయిలు నాలుగు అంగుళాల నిడివితో అత్యంత కురుచవైన మైక్రోమినీలు ధరించారని, కొందరు అలాంటి వాటిని లోదుస్తులు కూడా లేకుండా ధరించారన్న వదంతులు ఉన్నాయి. అయితే అవేవి ఇప్పుడు నిర్ధారించ వీలులేని కథలు. 70వ దశకపు తొలినాళ్ళకు వచ్చేసరికి హాట్‌ ప్యాంట్లు ప్రాచుర్యం పొందడంతో మైక్రో స్కర్టులకు ఆదరణ తగ్గిపోయింది. క్రమంగా 1990లలో, 2000లలో స్కర్టుల యొక్క పొడపు పెరుగుతూ వచ్చింది. మరలా 2010లలో తిరిగి మైక్రో స్కర్టులను చాలామంది ధరించడం ప్రారంభించారు కానీ 60వ దశకపు చివర్లో మరియు 70వ దశకపు మొదట్లో ఉన్న ఊపు ఇంకా రాలేదు. అయితే పొట్టి స్కర్టుల వైపు మళ్లీ ఫ్యాషన్ మొగ్గు చూపుతుందని మాత్రం అనిపిస్తుంది.

2000 తర్వాత ఐరోపా ఫ్యాషన్ షోలలో మైక్రో స్కర్టు వాడకం పెరిగింది. ముఖ్యంగా గూచీకి సైలిస్టుగా పనిచేసే టాం ఫోర్డ్ 2002 సెప్టెంబర్లో మైక్రో స్కర్ట్లు 2003 వసంతం/వేసవి ఫ్యాషన్ కలెక్షన్లలో చోటు చేసుకుంటాయని సూచన చేసిన తర్వాత మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చాయి[5]

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]