బొన్ని గాబ్రియేల్
అందాల పోటీల విజేత | |
జననము | ఆర్' బొన్ని నోలా గాబ్రియేల్ 1994 మార్చి 20 హౌస్టన్, టెక్సాస్, యూ.ఎస్.ఎ |
---|---|
విద్య | యూనివర్సిటీ అఫ్ నార్త్ టెక్సాస్ (బిఎఫ్ఏ) |
వృత్తి |
|
ఎత్తు | 170 cm |
జుత్తు రంగు | బ్రౌన్ |
కళ్ళ రంగు | హాజెల్ |
బిరుదు (లు) |
|
ప్రధానమైన పోటీ (లు) |
|
బొన్ని గాబ్రియేల్ (జననం మార్చి 20, 1994) అమెరికాకు చెందిన అందాల పోటీ టైటిల్ విజేత. ఆమె 2023లో అమెరికాలోని లూసియానా రాష్ట్రం, న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన 71వ ఎడిషన్ మిస్ యూనివర్స్ 2022 విజేతగా నిలిచింది.[1]
అమెరికాకు చెందిన ఆర్. బోని గాబ్రియేల్ 'విశ్వ సుందరి ( మిస్ యూనివర్స్ ) - 2022 ' కిరీటాన్ని అందుకుంది.[2] అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఓర్లిన్స్ లో 2023 జనవరి 14వ తేదీన మిస్ యూనివర్స్ - 2022 గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. 71 విశ్వసుందరి పోటీలో 90 దేశాలకు చెందిన పోటీ దారులను వెనక్కి నెట్టి బోని గాబ్రియేల్ విశ్వ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది.[3] మాజీ విశ్వసుందరి హర్నాజ్ సందు చేతుల మీదుగా బోని గాబ్రియేల్ విశ్వ సుందరి - 2022 కిరీటాన్ని స్వీకరించింది. భరత్ తరపున కర్ణాటక రాష్ట్రానికి చెందిన దివిత రాయ్ ఏడాది విశ్వసుందరి పోటీల్లో పాల్గొన్నది.
మిస్ యూనివర్స్ 2022
[మార్చు]బొన్ని గాబ్రియేల్ మిస్ USA 2022గా, ఆమె మిస్ యూనివర్స్ 2022 పోటీలో యునైటెడ్ స్టేట్స్ తరపున ప్రాతినిధ్యం వహించి మిస్ యూనివర్స్ 2022 కిరీటాన్ని గెలుచుకుంది.[4] ఆమె మిస్ యూనివర్స్ గెలుచుకున్న 9వ అమెరికన్‌గా నిలిచింది. ఆమె విజయం మిస్ యూనివర్స్ 2012లో ఒలివియా కల్పో తర్వాత మిస్ యూనివర్స్ గెలుచుకున్న యునైటెడ్ స్టేట్స్ నుండి మొదటి ప్రతినిధిగా నిలిచింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (15 January 2023). "విశ్వసుందరిగా అమెరికా అందగత్తె.. కిరీటం దక్కించుకున్న బొన్ని గాబ్రియేల్". Archived from the original on 16 January 2023. Retrieved 16 January 2023.
- ↑ "R'Bonney Gabriel", Wikipedia (in ఇంగ్లీష్), 2023-03-09, retrieved 2023-03-15
- ↑ "Who is R'Bonney Gabriel, the first Filipino-American to be crowned Miss Universe 2022?". The Indian Express (in ఇంగ్లీష్). 2023-01-15. Retrieved 2023-03-15.
- ↑ V6 Velugu (15 January 2023). "మిస్ యూనివర్స్ 2022గా బొన్ని గాబ్రియేల్". Archived from the original on 16 January 2023. Retrieved 16 January 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (15 January 2023). "దివి నుంచి దిగివచ్చావా?విశ్వసుందరి గాబ్రియెల్ బ్యూటిఫుల్ ఫొటోస్ చూశారా?". Archived from the original on 16 January 2023. Retrieved 16 January 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)